BigTV English

Manoj Bajpayee: డబ్బుల కోసమే అలాంటి సినిమాలు, అదే ట్రెండ్ అయిపోయింది.. బాలీవుడ్ స్టార్ వ్యాఖ్యలు

Manoj Bajpayee: డబ్బుల కోసమే అలాంటి సినిమాలు, అదే ట్రెండ్ అయిపోయింది.. బాలీవుడ్ స్టార్ వ్యాఖ్యలు

Manoj Bajpayee: చాలామంది ప్రేక్షకులు సినిమాను ఒక ఎమోషన్ లాగా భావిస్తారు. కానీ మేకర్స్ మాత్రం దానిని పూర్తిగా కమర్షియల్ దృష్టితోనే చూస్తారు. గత కొన్నేళ్లలో ఆర్ట్ సినిమాలు తక్కువయ్యాయి, కమర్షియల్ చిత్రాలు ఎక్కువయ్యాయి. కమర్షియల్ చిత్రాలను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించి హిట్ కొట్టడమే ట్రెండ్ అయిపోయింది. అయితే ఈ ట్రెండ్ నచ్చని ప్రేక్షకులు కూడా ఉన్నారు. కానీ అందులో చాలామంది ఈ విషయాన్ని ఓపెన్‌గా చెప్పలేరు. ఒక బాలీవుడ్ స్టార్ హీరో మాత్రం ఈ విషయంపై ఓపెన్ కామెంట్స్ చేశారు. కేవలం డబ్బుల కోసమే మేకర్స్ సినిమాలు తీస్తున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


క్రియేటివిటీ లేదు

ఇటీవల పలువురు బాలీవుడ్ స్టార్లు అంతా కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగానే మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏ మాత్రం క్రియేటివిటీ లేకుండా కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయడం ట్రెండ్ అయిపోయింది. ఒక నాలుగు, అయిదు సినిమాలు ఇలాగే చేసినా తర్వాత ఈ ఫార్ములా సక్సెస్ అవ్వదు’’ అని చెప్పుకొచ్చారు. సినిమాల్లో మాత్రమే కాకుండా ఓటీటీ కంటెంట్‌లో కూడా తనదైన మార్క్ క్రియేట్ చేశారు మనోజ్ బాజ్‌పాయ్. ఆయన హీరోగా నటించిన ఎన్నో చిత్రాలు నేరుగా ఓటీటీల్లోనే విడుదలయ్యి మంచి విజయాన్ని సాధించాయి. అలా ఇతర భాషా ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరయ్యాడు.


Also Read: అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డ్ రావడం సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది.. అమీర్ ఖాన్ ఓపెన్ కామెంట్స్

వెబ్ సిరీస్‌లు

కొన్నేళ్ల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో ‘సేక్రెడ్ గేమ్స్’ అనే వెబ్ సిరీస్ విడుదలయ్యింది. అది దేశవ్యాప్తంగా పాజిటివ్ రివ్యూలు సాధించింది. అయితే ఆ వెబ్ సిరీస్ తర్వాతే యాక్షన్, థ్రిల్లర్ జోనర్‌లో మరిన్ని వెబ్ సిరీస్‌లు వచ్చాయని మనోజ్ బాజ్‌పాయ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. మనోజ్ బాజ్‌పాయ్ హీరోగా ‘ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఆ వెబ్ సిరీస్ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అందుకే ఈ సిరీస్‌ను ఒక సీజన్‌తో ఆపేయకుండా రెండు సీజన్స్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ రెండు సీజన్స్ ఒకదానికి మించి మరొకటి హిట్ అయ్యాయి. అలా మనోజ్ బాజ్‌పాయ్ ఓటీటీ ప్రయాణం గ్రాండ్‌గా మొదలయ్యింది.

అలాంటివి చేయను

కొందరు నటీనటులకు తాము ఎలాంటి సినిమాలు, ఎలాంటి పాత్రలు చేయకూడదు అనే విషయంలో చాలా క్లారిటీ ఉంటుంది. అలాగే మనోజ్ బాజ్‌పాయ్ కూడా తను గన్స్, సెక్స్‌కు సంబంధించిన సినిమాలు, సిరీస్‌లు చేయను అని ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆయన యాక్టింగ్ అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పర్సనల్ ఫేవరెట్. వెండితెరపై విడుదలయిన సినిమాల కంటే ఓటీటీలో వచ్చిన కంటెంటే ఆయనను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. మెథడ్ యాక్టింగ్‌తో తను చేసే ప్రతీ పాత్రలో ప్రాణం పోసి దాంతో ఆడియన్స్‌లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే నటుల్లో మనోజ్ బాజ్‌పాయ్ పేరు కచ్చితంగా ఉంటుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×