జమ్మూకాశ్మీర్ లోని అందమైన పర్యాటక ప్రదేశం పహల్ గామ్ తాజాగా ఉగ్రదాడితో రక్తసిక్తం అయ్యింది. ఈ దాడిలో 26 మంది పౌరులు చనిపోయారు. ఈ ఘటన నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ తో ఉన్న దౌత్య సంబంధాలు అన్నింటినీ తెంపుకుంది. ఈ దాడి వెనుక ఇస్లామాబాద్ పాత్ర ఉందని ఆరోపించింది. పాకిస్తాన్ మద్దతు తోనే ఉగ్రవాదులు కాశ్మీర్ లో దాడులకు తెగించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు ఈ వాదనలను పాకిస్తాన్ తోసిపుచ్చింది. భారత్ ఆరోపణలన్నీ అవాస్తవాలని తేల్చి చెప్పింది.
ఉగ్రదాడిపై భారత్ సీరియస్
మరోవైపు ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద సంస్థగా గుర్తించిన పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా సభ్యులు గా భారత ప్రభుత్వం గుర్తించింది. వీరికి పాక్ ప్రభుత్వ సహకారం ఉన్నట్లు తెలింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య కీలకమైన సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దును మూసివేసింది. ఇండియాలో ఉన్న పాకిస్తాన్ దౌత్య అధికారులను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఇండియాలో ఉన్న పాక్ పౌరులు కూడా వెళ్లిపోవాలని తేల్చి చెప్పింది.
సొంత దేశంపై పాకిస్తానీల సటైర్లు
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో సటైర్ల వర్షం కురుస్తోంది. ఓవైపు ఇండియన్ నెటిజన్స్ పాక్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, పాకిస్తాన్ నెటిజన్లు సైతం అక్కడి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సటైర్లు, మీమ్స్ తో కడుపుబ్బా నవ్విస్తున్నారు. పాకిస్తాన్ లో తమకు తాము సటైర్లు వేసుకుంటున్న స్క్రీన్ షాట్స్ ను ఓ ఇండియన్ నెటిజన్ షేర్ చేశాడు. “ఓ నెటిజన్ భారత్ మన మీద బాంబు దాడి చేయబోతోంది” అని ట్వీట్ చేస్తే.. “మనం కూడా రాత్రి 9 గంటల లోగా దాడి చేయాలి. లేదంటే గ్యాస్ ఆఫ్ చేస్తారు” అని మరో పాకిస్తాన్ నెటిజన్ సటైర్ వేశాడు.
These Pak people are roasting themselves on a different level 😭 pic.twitter.com/ckAA4F2So1
— Phunsuk Wangdu (@Phunsukwangduji) April 25, 2025
భారత్ తో గేమ్స్ మంచిది కాదంటున్న పాకిస్తానీయులు
అటు భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు నీటి సరఫరాను నిలిపివేడయడం పైనా నెటిజన్లు సటైర్లు వేస్తున్నారు. భారత్ నిర్ణయంతో బాత్ రూమ్ లలో నీళ్లు రాక స్నానం కూడా చేయలేకపోతున్నామంటూ ఫన్నీగా వీడియోలు షేర్ చేస్తున్నారు. పాకిస్తాన్ తీరుపై అక్కడి ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. “ఇప్పటి వరకు చపాతీ పిండి కోసం ఏడ్చాం. ఇప్పుడు ఆ చపాతీ పిండిని కలపడానికి నీళ్లు కూడా రాకుండా చేశారు భారతీయులు” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ చేస్తున్న పాపపు పనులే దేశానికి ఈ దుస్థికి పట్టేందుకు కారణం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “భారత్ సహనాన్ని అలుసుగా తీసుకోవడం పాకిస్తాన్ కు ప్రమాదకరం” అని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న దేశాన్ని కోరి మరిన్ని తలనొప్పులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నామంటూ మరికొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: ఏంటీ.. హైదరాబాద్ బిర్యానీ బెస్ట్ కాదా? అక్కడ బిర్యానీయే బెస్టా?