Swiggy’s Best Biryani in India: ఫుడ్ లవర్స్ బిర్యానీ అంటే పడి చచ్చిపోతారు. భారత్ లో బిర్యానీ అనగానే హైదరాబాద్ స్పైసీ బిర్యానీ గుర్తొస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాదీ బిర్యానీకి మంచి గుర్తింపు ఉంది. హైదరాబాద్ తర్వాత కోల్ కతాలో ఘుమఘుమలాడే బిర్యానీ దొరుకుతుంది. కోల్ కతా బిర్యానీని కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. కానీ, తాజాగా స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2025లో ఈ రెండూ ప్రాంతాల బిర్యానీలు కాదని, ఢిల్లీకి చెందిన బిక్ గాన్ బిర్యానీకి బెస్ట్ బిర్యానీ అవార్డు లభించింది. దీంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్ బిర్యానీని కాదని ఢిల్లీ బిర్యానీకి అవార్డు ఇవ్వడం ఏంటని షాక్ అవుతున్నారు.
భారతీయులు ఎంతో ఇష్టపడే ఫుడ్ బిర్యానీ!
భారతీయులు అత్యంత ఇష్టపడే ఫుడ్ రుచికరమైన బిర్యానీ. అద్భుతమైన టేస్టీ, మర్చిపోలేని ఘుమఘుమలు, ఆహా అనిపించే సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో తయారు చేసిన బిర్యాని తింటూ ఉంటూ మైమరచిపోతాం. ఈ నేపథ్యంలోనే ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ బెస్ట్ ఫుడ్స్ పోటీ నిర్వహించింది. అన్ని ఫుడ్స్ తో పాటు బెస్ట్ బిర్యానీకి కోసం నెల రోజుల పాటు ఓటింగ్ నిర్వహించింది. ఎక్కువ మంది ప్రజల అభిప్రాయాల ప్రకారం ఈ ఫుడ్ అవార్డును ప్రకటించింది. ప్రజల ఎంపికను దృష్టిలో ఉంచుకుని రెస్టారెంట్ల నిర్ణయం తీసుకున్నట్లు ఫుడ్ డెలివరీ మేజర్ వెల్లడించింది. డొమినోస్ పిజ్జా, మెక్ డొనాల్డ్స్ లాంటి ఫాస్ట్ ఫుడ్ దిగ్గజాలకు సంబంధించి పలు బ్రాండ్లు.. ఉత్తమ పిజ్జా, బర్గర్ అవార్డులను గెలుచుకున్నాయి. చౌమాన్ ఉత్తమ చైనీస్ ఫుడ్ అవార్డును గెలుచుకుంది. చుల్హా చౌకి ద ధాబా ఉత్తమ నార్త్ ఇండియన్ వంటకంగా అవార్డు అందుకుంది.
ఢిల్లీ బిర్యానీకి బెస్ట్ బిర్యానీ అవార్డు!
స్విగ్గీ నిర్వహించిన పోటీలో హైదరాబాద్, కోల్ కతా లాంటి టాప్ బిర్యానీలను కాదని, ఢిల్లీ బిర్యానీ బెస్ట్ బిర్యానీ అవార్డు అందుకుంది. “స్విగ్గీ అనేది ప్రజలకు బెస్ట్ ఫుడ్ అందించడంతో ముందుంటుంది. ప్రజల సంస్కృతులు, సంప్రదాయాలను పరిగణలోకి తీసుకుని ఆహారాన్ని అందిస్తున్నాం. భారతదేశ ఆహార రంగాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా మార్చే చెఫ్‌లు, రెస్టారెంట్లను కలుపుకుని స్విగ్గీ రెస్టారెంట్ అవార్డుల వేడుకను నిర్వహిస్తున్నాం. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వారందరికీ అభినందనలు” అని స్విగ్గీ ఫుడ్ మార్కెట్ ప్లేస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సిద్ధార్థ్ భకూ వెల్లడించారు.
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాదీ బిర్యానీని కాదని, ఢిల్లీ బిర్యానీకి బెస్ట్ బిర్యానఅ అవార్డు ఇవ్వడం పట్ల నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్విగ్గీ కావాలని ఢిల్లీ బిర్యానీకి ఫేవర్ వ్యహరించిందని కామెంట్స్ పెడుతున్నారు. ఈ అవార్డ్స్ అంతగా నమ్మదగినవి కాదంటున్నారు. చాలా మంది నెటిజన్లు స్విగ్గీని ట్రోల్ చేస్తున్నారు. హైదరాబాద్ బిర్యానీ కంటే ఢిల్లీ బిర్యానీ పెద్ద తోపేం కాదంటున్నారు.
Read Also: ఈ ఇంట్లో తిరగడానికి ఒక్క రోజు సరిపోదు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ బంగ్లాల గురించి మీకు తెలుసా?