Eye Health: బలహీనమైన కంటి చూపు ఈ రోజుల్లో సాధారణ సమస్యగా మారింది. ఫోన్, కంప్యూటర్ల వాడకంతో పాటు సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడంతో పాటు తగినంత నిద్ర లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు. ఈ రోజుల్లో, పిల్లలలో కంటి సంబంధిత సమస్యలు పెరగడం ఎక్కవయ్యాయి. అందుకే అన్ని వయస్సుల వారు కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఏర్పడింది.
మన ఆహారపు అలవాట్లు , జీవనశైలిలో కొద్దిగా మార్పు చేసుకుని కళ్లకు తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. దీంతో పాటు, కొన్ని కొన్ని రకాల టిప్స్ పాటించడం ద్వారా కూడా ఈ సమస్య నుండి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు.
ఆహారంలో మార్పులు:
విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాలు: క్యారెట్లు, చిలగడదుంపలు, బచ్చలికూర, గుమ్మడికాయ , ఇతర పసుపు-నారింజ కూరగాయలు విటమిన్ ఎకి మంచి వనరులు. అందుకే ఈ పదార్థాలు డైలీ మనం తినే ఆహారంలో తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. వీటిని తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతే కాకుండా కంటి సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు:
చేపలు, వాల్‌నట్‌లు, చియా గింజలు , అవిసె గింజలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తరుచుగా వీటిని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
యాంటీఆక్సిడెంట్లు:
బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, ద్రాక్ష వంటి పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి కళ్ళను రక్షిస్తాయి. అంతే కాకుండా కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
లుటీన్, జియాక్సంతిన్: ఆకుపచ్చని ఆకు కూరలు, గుడ్లలో లభించే ఈ పోషకాలు కంటిశుక్లంతో పాటు వయస్సు-సంబంధిత మచ్చల క్షీణత నుండి రక్షించడంలో సహాయపడతాయి.
జీవనశైలిలో మార్పులు:
విశ్రాంతి: తగినంత నిద్ర పొందండి. రోజులో కొంత సమయం పాటు కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోండి.
స్క్రీన్ సమయాన్ని తగ్గించండి: కంప్యూటర్, మొబైల్ , టీవీ ముందు తక్కువ సమయం గడపండి.
నీళ్లు తాగండి: తగినంత నీరు తాగడం వల్ల కళ్లు హైడ్రేట్‌గా ఉంటాయి.
కంటి వ్యాయామాలు: కంటి వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయండి. అంటే పైకి క్రిందికి చూడటం, ఎడమ-కుడివైపు చూడటం, కళ్ళు తిప్పడం మొదలైనవి.
సూర్యరశ్మి: సూర్యరశ్మి నుంచి కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ డి లభిస్తుంది.
Also Read: పొడవాటి జుట్టు కోసం.. ఇలా చేయండి
హోం రెమెడీ:
రోజ్ వాటర్: రోజ్ వాటర్ తో కళ్లను కడుక్కోవడం వల్ల కళ్లకు చల్లదనాన్ని అందించడంతో పాటు కంటి అలసటను దూరం చేస్తుంది.
అలోవెరా: అలోవెరా జెల్ కళ్లకు చాలా మేలు చేస్తుంది. దీన్ని కళ్లపై రాసుకుంటే చికాకు, వాపు తగ్గుతాయి.
త్రిఫల: త్రిఫల కంటి చూపును మెరుగుపరచడానికి ఒక సహజ ఔషధం. నీటిలో వేసి మరిగించి ఈ నీటిని తాగవచ్చు.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.