BigTV English

Uttar Pradesh: 35 మంది పెళ్లి కాని అమ్మాయిలకు ప్రెగ్నెన్సీ, యూపీలో దారుణం!

Uttar Pradesh: 35 మంది పెళ్లి కాని అమ్మాయిలకు ప్రెగ్నెన్సీ, యూపీలో దారుణం!

Unmarried Girls Pregnant: ఉత్తర ప్రదేశ్ లో దారుణం జరిగింది. పెళ్లి కాకుండానే ఓ గ్రామంలోని అమ్మాయిలంతా గర్భం దాల్చారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆ ఊళ్లోని 35 మంది పెళ్లికాని అమ్మాయిలకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ విషయంలో గ్రామస్తులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ ఘటనపై అధికారులు ఏకంగా విచారణ ప్రారంభించారు. ఈ దర్యాప్తులో అసలు విషయాలు బయటకు రావడంతో అందరూషాక్ అయ్యారు.


అంగన్వాడీ కార్యకర్త పొరపాటుతో..

యూపీకి చెందిన ఓ ప్రముఖ వార్తా సంస్థ నవంబర్ 12న ఓ వార్తను ప్రచురించింది. ఈ వార్త ఉత్తర ప్రదేశ్ లో సంచలనం కలిగించింది. ఇంతకీ ఆ వార్తలో ఏం ఉందంటే… రామనా గ్రామానికి చెందిన 35 మందికి పైగా పెళ్లికానికి అమ్మాయిలు ప్రెగ్నెంట్ గా నమోదు చేయించుకున్నట్లు వారి ఫోన్లకు మెసేజ్ వెళ్లింది. వెంటనే సదరు అమ్మాయిలు షాక్ అయ్యారు. తాము ప్రెగ్నెంట్ కావడం ఏంటని ఆందోళనకు గురయ్యారు. దీనిపై అధికారులు విచారణ చేశారు. అంగన్వాడీ కార్యకర్త చేసిన పొరపాటు కారణంగా వారికి ఈ మెసేజ్ వెళ్లినట్లు తేల్చారు.


బాధ్యులకు నోటీసులు జారీ

రామనా గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త గర్బిణీలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించే పథకం కోసం    ఇంటింటికి వెళ్లి ఆధార్ కార్డులు,కుటుంబ సభ్యుల వివరాలను సేకరించింది. ఫారమ్‌లను సేకరిస్తున్నప్పుడు, అంగన్‌వాడీ కార్యకర్త తప్పుగా ఆధార్ నంబర్‌తో సహా రెండు ఫారమ్‌లను కలిపారు. ఈ నేపథ్యంలో అదే ఆధార్ నంబర్‌ మీద గర్భిణీలుగా రిజిస్ట్రేషన్ జరిగింది.  ఆ తర్వాత అమ్మాయిలకు మెసేజ్ వెళ్లింది. ఒక్కసారిగా వాళ్లు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే ఆడేటాను తొలగించినట్లు అధికారులు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్త పొరపాటు కారణంగానే గర్భిణీల జాబితాలో 35 మందికి పైగా పేర్లు నమోదయ్యాయన్నారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులకు నోటీసులు కూడా జారీ చేసినట్లు వెల్లడించారు.

Read Also: ప్రియురాలి కోసం యుద్ధానికి వెళ్లిన పరాయి దేశం యువకుడు.. శత్రు సైన్యం చేతికి చిక్కి ఏడుస్తూ..

అటు ఈ విషయానికి సంబంధించి  వారణాసి చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ హిమాన్షు నాగ్‌ పాల్ కీలక విషయాలు వెల్లడించారు. “అంగన్వాడీలో పనిచేస్తున్న ఆశా దీదీ బిఎల్‌ఓగా పనిచేస్తున్నారు. ఒక పథకం కింద, ఆమె రామనాలోని కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, ఫారాలను సేకరించింది. రెండు కలిసిపోయియా. ఈ నేపథ్యంలో తప్పుగా డేటా ఎంట్రీ చేశారు. పెళ్లికాని అమ్మాయిలను గర్భిణీల లిస్టులో చేర్చారు. ఈ విషయం బయటకు రావడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగింది” అని చెప్పుకొచ్చారు.

మొత్తంగా విచారణలో అనంతరం పెళ్లి కాని అమ్మాయిలకు పెగ్రెన్నీ రాలేదని అధికారులు ధృవీకరించారు. అంగన్వాడీ కార్యకర్త, డేటా ఎంట్రీ ఉద్యోగుల పొరపాటు కారణంగా ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. ఈ గందరగోళానికి కారణమైన పలువురిపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Read Also: గిరినాగుకు రక్తపింజరకు సమరం.. వదల బొమ్మాళీ రేంజ్ లో వేట.. క్షణక్షణం ఉత్కంఠ

Related News

Baba Vanga Prediction: ఏంటి.. AI వల్ల అలా జరుగుతుందా? భయపెడుతోన్న బాబా వంగా జ్యోతిష్యం!

Noida Man: తల్లి మరణం.. 20 ఏళ్ల యువకుడి ఖాతాలోకి రూ.10,01,35,60,00,00,00,00,00,01,00,23,56,00,00,00,00,299..

Viral Video: ఇంగ్లండ్ లోనూ ఉమ్మేస్తున్నారు.. ఈ ఖైనీ బ్యాచ్ మారరు!

Biggest Banana: బెట్, ఈ బనానాను ఒక్కరే తినలేరు.. చరిత్రలో అత్యంత పెద్ద అరటి పండు పొడవు ఎంతో తెలుసా?

TCS Employee: ఐటీ ఉద్యోగి రోడ్డుపై నిద్ర.. టీసీఎస్ స్పందన ఇదే

Self Surgery: మత్తు లేకుండా.. కడుపు కోసుకుని.. తనకి తానే సర్జరీ చేసుకున్న ఈ డాక్టర్ గురించి తెలుసా?

Big Stories

×