E-Paper
Advertisement

Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కోమటిరెడ్డి వెర్షన్ 2.0.. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా!?

Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కోమటిరెడ్డి వెర్షన్ 2.0.. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా!?
Advertisement

Komatireddy Venkat Reddy Version 2.0: సాధారణంగా వ్యక్తిని పోలిన వ్యక్తులు ఏడుగురు ఉంటారని పెద్దలు అంటుంటారు. అనడమే కాదు, నిజం అని చెప్పేందుకు సేమ్ టు సేమ్ ఉండే వ్యక్తులు తరచుగా కనిపిస్తుంటారు కూడా. ఇక తాజాగా అచ్చం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాగే కనిపించే ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు. గత రెండు రోజులుగా ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్.. ఏ ప్లాట్ ఫారమ్ ఓపెన్ చేసినా, అతడే దర్శనం ఇస్తున్నాడు. కోమటిరెడ్డి, ఆయన అన్నదమ్ముల మాదిరిగా ఉన్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వ్యక్తి ఎవరు? ఆయన పేరేంటి? ఆయనది ఏవూరు? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

పేరు బ్రహ్మయ్య.. సొంతూరు పులిపలుపుల!  

చూడ్డానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాగే ఉన్న ఈ వ్యక్తి పేరు కంభంపాటి బ్రహ్మయ్య. సొంతూరు మునుగోడు మండలం పులిపలుపుల. చాలా ఏళ్ల క్రితమే నల్లగొండ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి వచ్చారు. ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఆయన స్వయంగా రేణుకా ఎల్లమ్మ తల్లి భక్తుడు. అప్పుడప్పుడు అమ్మవారు పూనుతారు కూడా. ఎవరైనా ఎల్లమ్మ పండుగ చేయాలనుకుంటే ఆయన వెళ్తారు. మిగతా సమయాల్లో తన కుల వృత్తి అయిన కుండలు అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నారు. నల్లగొండలోని ఎన్జీ కాలేజీకి ఎదురుగా ఉన్న వీధి వ్యాపారుల దుకాణ సముదాయంలో ఆయనకు ఓ దుకాణం ఉంది. అక్కడే ఎక్కువగా ఉంటారు.

ఎలా వైరల్ అయ్యారంటే?

Advertisement

తాజాగా ఓ వ్యక్తి ఆయన కుండల దుకాణం పక్కనే ఉన్న పండ్ల షాప్ దగ్గర కారు ఆపాడు. ఈయనను చూసి వీడియో తీశాడు. దగ్గరికి వచ్చి అచ్చం కోమటిరెడ్డిలా ఉన్నావని చెప్పాడు. చెప్పడమే కాదు, ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. గత రెండు రోజులుగా ఆయన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. నెటిజన్లు క్రేజీగా కామెంట్స్ పెడుతున్నారు. ఒకే పోలికలు ఉన్న వ్యక్తులు నల్లగొండలోనే ఉండటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆ వీడియో పట్ల ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. “ఓసారి బ్రహ్మయ్యకు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిలా డ్రెస్సు వేసి, మేకప్ వేయండి ఇంకా బాగుంటారు” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “అన్నగారికి మంచి సూట్ వేసి మున్సిపల్ ఆఫీస్ కు తీసుకెళ్తే అందరూ కోమటిరెడ్డి అనుకుంటారు” అని మరో వ్యక్తి స్పందించారు. “త్వరలోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బ్రహ్మయ్యను కలవడం ఖాయం” అని ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు.

ఊపందుకున్న కుండల వ్యాపారం

Advertisement

బ్రహ్మయ్య వీడియో వైరల్ కావడంతో చాలా మంది ఆయన దగ్గరికి వస్తున్నారు. ఆయన దుకాణంలో కుండలు కొనుగోలు చేస్తున్నారు. కోమటిరెడ్డి 2.0 అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తనకు కలిసి వస్తుందంటున్నారు బ్రహ్మయ్య. ఆయన పుణ్యమా అని తన కుండలు బాగా అమ్ముడు పోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం నల్లగొండలోనే ఎక్కువ సమయం గడుపుతున్న మంత్రి కోమటిరెడ్డిని వీలుంటే కలిసే ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు. ఈ వీడియో మంత్రి దగ్గరికి చేరుకుని, త్వరలోనే బ్రహ్మయ్యకు కలిసి అవకాశం కల్పించాలని మనమూ కోరుకుందాం!

Read Also:  ఇదెక్కడి పైత్యం.. బతికున్న భర్తను తల వరకూ పూడ్చి.. నెత్తిన పాలాభిషేకం చేసిన భార్య

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×