Madhavi latha:గత కొద్దిరోజుల నుండి జేసి ప్రభాకర్ రెడ్డి (JC.Prabhakar reddy )కి, సినీ నటి, రాజకీయ నాయకురాలు అయినటువంటి మాధవి లత (Madhavi latha) కి మధ్య సోషల్ మీడియా వేదికగా మాటలు యుద్ధం నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. మాధవి లత న్యూ ఇయర్ సమయంలో జెసి పార్క్ వైపు మహిళలు ఎవరూ వెళ్ళకండి అని,ఆ పార్కులో అక్రమాలు జరుగుతున్నాయని, మహిళలు ఎవరైనా వెళ్తే వారికి ప్రమాదమని,డ్రగ్స్ వంటివి వాడుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆమె వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. అంతే కాదు ప్రెస్ మీట్ పెట్టి మరీ మాధవి లత వ్యాఖ్యలను ఖండిస్తూ.. మాధవి లతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మాధవి లత తో పాటు ఇండస్ట్రీలో ఉన్న మహిళలపై కూడా ఈయన దారుణంగా కామెంట్స్ చేయడంతో.. చాలా మంది మహిళలు మండిపడ్డారు. సోషల్ మీడియా ఫాలోవర్స్ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలను తీవ్రంగా ఖండించారు.
తెలుగు ఫిలిం ఛాంబర్ లో జేసీ ప్రభాకర్ రెడ్డి పై మాధవి లతా కంప్లైంట్..
ఇక ఈ విషయంపై మాధవి లత కూడా ఫైర్ అయ్యింది. అయితే జేసి ప్రభాకర్ రెడ్డి మాధవి లతను అనకూడని మాట అనడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై దుమారం చెలరేగింది. దాంతో తగ్గిపోయిన జేసి ప్రభాకర్ రెడ్డి వెంటనే మాధవి లతకు క్షమాపణలు చెప్పారు. కానీ మాధవి లత అంతటితో ఆగకుండా జేసీ ప్రభాకర్ రెడ్డికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.మళ్ళీ జీవితంలో కోలుకోని దెబ్బ కొట్టినట్టు తెలుస్తోంది. మరి ఇంతకీ మాధవి లతా చేసిన పని ఏంటి అనేది చూద్దాం. తాజాగా మాధవి లత, జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేసింది.
స్పందించిన మా అసోసియేషన్.. అండగా ఉంటాం అంటూ హామీ..
అయితే మాధవి లత పై జేసి ప్రభాకర్ రెడ్డి అణుచిత వ్యాఖ్యలు చేస్తే ఇండస్ట్రీ నుండి కనీసం ఒక్కరు కూడా స్పందించలేదు.అయితే ఇండస్ట్రీ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మాధవి లత నేరుగా వెళ్లి మా అసోసియేషన్ వాళ్లకి కంప్లైంట్ ఇవ్వడంతో ఇది కాస్తా రచ్చకు దారితీసింది. నా గురించి, ఇండస్ట్రీ వాళ్ల గురించి జేసి ప్రభాకర్ రెడ్డి దారుణంగా మాట్లాడారు. ఆయన కేవలం క్షమాపణలు చెప్పి చేతులు దులిపేసుకుంటే సరిపోదు. నేను ఆయనపై న్యాయపోరాటం చేస్తాను. ఆయన నన్ను అన్ని మాటలు అంటే కనీసం ఇండస్ట్రీ నుండి ఒక్కరు కూడా స్పందించలేదు. అందుకే ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ చేస్తున్నాను అని చెప్పడంతో పాటు న్యాయం కోసం నా పోరాటం అని చెప్పుకొచ్చింది.దీంతో ఫిలిం ఛాంబర్ లో జేసీ ప్రభాకర్ రెడ్డి పై మాధవి లత ఫిర్యాదు చేయడం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయింది. అయితే మాధవి లత ఫిర్యాదు పై శివ బాలాజీ(Shiva balaji ), రవి (Ravi)లు స్పందిస్తూ.. మీకు అండగా ఉంటామని చెప్పారట. అయితే ఈ విషయంపై మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu)కూడా స్పందించి కచ్చితంగా మాధవి లతకు అండగా ఉండి వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో మాధవి లతకి ఇండస్ట్రీలో మద్దతు పెరిగింది. కానీ మాధవి లత పోరాటం. జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఎఫెక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది.