Lady Aghori : శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరీ కేసులో కీలక అప్‌డేట్. అఘోరీకి బెయిల్ వచ్చింది. అయితే, ఆమె విడుదలపై అనుమానాలు ఉన్నాయి. ఒక కేసులో బెయిల్ వచ్చినా.. మరో రెండు కేసుల్లో ఏం జరుగుతుందోననే ఆసక్తి నెలకొంది. పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి మళ్లీ రిమాండ్ చేస్తారా? పోనీలే పాపం అని వదిలేస్తారా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది.
బెయిల్ కష్టాలు..
మహిళా ప్రొడ్యూసర్‌ను బెదిరించిన కేసులో అఘోరీకి చేవెళ్ల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.5 వేల చొప్పున రెండు ష్యూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే, అఘోరీకి పూచీకత్తు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఆమె తరఫు లాయరే ఆ ఏర్పాట్లు కూడా చూస్తున్నట్టు సమాచారం.
అఘోరీ మళ్లీ అరెస్ట్?
కోర్టు ఆదేశించినట్టు ఇద్దరు ష్యూరిటీ ఇస్తే.. మంగళవారం సాయంత్రం కల్లా లేడీ అఘోరీ చంచల్‌గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే, ఆమెపై మరో రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ కేసుల్లో సమగ్ర దర్యార్తు కోసం పోలీసులు వెయిట్ చేస్తున్నారు. అఘోరీ జైలు నుంచి బయటకు రాగానే.. అరెస్ట్ చేసి మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ రెండు పెండింగ్ కేసుల్లో కస్టడీకి కోరే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు. అదే జరిగితే.. అఘోరీ జైలు నుంచి బయటకు రావడం.. ఆ వెంటనే మళ్లీ జైలుకు వెళ్లాల్సి రావడం తప్పకపోవచ్చు. ఏదైనా పోలీసుల నిర్ణయం మీద డిపెండ్ అయి ఉంటుంది.
వర్షిణి వేదన..
లేడీ అఘోరీ బయటకు వస్తారా? మళ్లీ జైలుకు వెళ్తారా? అని దానిపై అందరికంటే శ్రీవర్షిణినే ఎక్కువ ఉత్కంఠకు గురి చేస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె.. ఆమెకు భార్య. పెళ్లి చేసుకున్న ముచ్చట తీరకముందే.. వారాల వ్యవధిలోనే అఘోరీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆమె లేని లోటు ఈమెను తీవ్రంగా వేధిస్తోంది. జైల్లో అఘోరీ సైతం వర్షిణి వర్షిణి అంటూ అరుస్తోందట. భార్య కోసం విరహ వేదనతో రగిలిపోతోందని సమాచారం. ఇటు, శ్రీవర్షిణి సైతం అఘోరీ కోసం ఆత్రంగా ఎదురుచూస్తోంది. జైలుకు వెళ్లేముందు కూడా ఆ ఇద్దరూ నానారచ్చ చేశారు. వర్షిణిని కూడా అఘోరీతో పాటు జైల్లో ఉంచాలంటూ పట్టుబట్టారు. తమనిద్దరినీ ఒకే సెల్‌లో వేయాలని పెద్ద గొడవ చేశారు. అయితే, అందుకు రూల్స్ ఒప్పుకోవుగా.
నీ రాక కోసం..
అఘోరీ జైల్లో ఉండటంతో శ్రీవర్షిణి కోసం ఆమె కుటుంబ సభ్యులు గట్టిగా ట్రై చేశారు. తిరిగి తమ కూతురును తమ ఇంటికి తీసుకెళ్లేందుకు నచ్చజెప్పారు. పేరెంట్స్ ఎంతగా బతిమిలాడినా వర్షిణి మాత్రం ఫ్యామిలీతో ఉండేందుకు ససేమిరా అంది. అత్తారింటికైనా వెళ్తాకానీ, పుట్టింటికి వెళ్లనంటూ పంతం పట్టింది. చేసేది లేక వర్షిణి పేరెంట్స్ ఒట్టి చేతులతో తిరిగి వెళ్లిపోయారు. నీ రాక కోసం అంటూ అఘోరీ కోసం వర్షిణి కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తోంది. తాజాగా, ఓ కేసులో అఘోరీకి బెయిల్ రావడంతో.. శ్రీనివాస్ విడుదలపై ఉత్కంఠ పెరిగింది.
బయటకు వస్తే ఎగిరిపోతారా?
పోలీసులు మళ్లీ అరెస్ట్ చేస్తే ఇక చేసేదేం లేదు. మరికొంత కాలం చంచల్‌గూడ జైల్లోనే ఉండాల్సి వస్తుంది. వర్షిణికి మళ్లీ ఏకాంతవాసమే మిగులుతుంది. అదే, పోలీసులు కాస్త కనికరిస్తే.. అఘోరీ బెయిల్ మీద బయట ఉండొచ్చు. అప్పుడు వాళ్లిద్దరూ మళ్లీ కలవొచ్చు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మరింత ఇంట్రెస్టింగ్ మేటర్. అసలే అఘోరీకి ఇల్లు, ఊరు, రాష్ట్రం అంటూ ఓ ఫిక్స్డ్ అడ్రస్ లేదు. జైలు నుంచి బయటకు రాగానే.. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనుకుంటే? వర్షిణిని తీసుకుని ఏ హిమాలయాలకో చెక్కేస్తే..? ఆ కొండల్లోనో కాపురం పెడితే..? ఆ మూడు కేసుల పరిస్థితి ఏంటి? వాళ్లను పోలీసులు ఎక్కడని వెతుకుతారు? వెతికినా దొరుకుతారా? దొరకక పోతే కోర్టుకు ఊరుకుంటాయా? ఎందుకొచ్చిన తిప్పలు అనుకుని.. పోలీసులు ముందుచూపుతో ఇప్పుడే మళ్లీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తారా? ఇలా అనేక ట్విస్టులు ఉన్నాయి అఘోరీ కేసులో. పాపం.. శ్రీవర్షిణి. లేడీ అఘోరీని పెళ్లి చేసుకున్నప్పటి నుంచీ అన్నీ తిప్పలే. 20 ఏళ్ల వయస్సులో ఎన్ని కష్టాలో. ఎమోషన్‌తో కాకుండా.. కాస్త కామన్‌సెన్స్‌తో ఆలోచిస్తే సొల్యూషన్ సింపులే అంటున్నారు.