TDP Mahanadu 2025: వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే టీడీపీ స్కెచ్ వేసిందా? కడప జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తామని సీఎం చంద్రబాబు ఎందుకన్నారు? చివరకు పులివెందుల సీటు టీడీపీ వశం కానుందా? లేకుంటే కేడర్‌ని ఉత్సాహపరిచేందుకు ఆ విధంగా మాట్లాడారా? జగన్‌కు రానున్న రోజుల్లో కష్టాలు తప్పవని ఇండికేషన్ ఇచ్చారా? ఇదే చర్చ ఏపీ వ్యాప్తంగా మొదలైపోయింది.
కడపలో ఈసారి టీడీపీ మహానాడు కార్యక్రమం చేపట్టింది. ఇక్కడ పెట్టడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో 10 సీట్లకు ఏడు సీట్లను కూటమి గెలుచుకుంది. కేవలం మూడు సీట్లతో వైసీపీ సరిపెట్టుకుంది. ఈ లెక్కన కూటమి గాలి ఏ రేంజ్‌లో వీచిందో చెప్పనక్కర్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కడపలో మహానాడు ఏర్పాటు చేసినట్టు అక్కడి నేతల మాట.
మంగళవారం టీడీపీ మహానాడు కార్యక్రమంలో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో ఏడు స్థానాలు గెలిచి సత్తా చాటామన్నారు. వచ్చేసారి ఇంకొంచెం కష్టపడతే పదికి పది మనమే స్వీప్ చేస్తామని చెప్పకనే చెప్పారు. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన గెలుపు అసామాన్యమన్నారు. జరుగుతున్న మహానాడు ఏపీ దశ దిశను మార్చనుందని పేర్కొన్నారు.
వైసీపీ కోటలో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు. బాబు ఆ తరహా వ్యాఖ్యలు చేశారంటే.. వెనుక పెద్ద కథ ఉండే ఉంటుందని అంటున్నారు. జగన్ ఫ్యూచర్ గురించి తెలిసే ఈ వ్యాఖ్యలు చేశారంటూ అప్పుడే రాయలసీమ తెలుగు తమ్ముళ్లలో చిన్నపాటి చర్చ మొదలైపోయింది.
ALSO READ: అన్నీ పెద్ద నోట్లు రద్దు, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఈసారి కడపలో తమకు సానుకూల పవనాలు ఉన్నాయని చెప్పారు. నేతలంతా విభేదాలు మరిచి కష్టపడితే విజయం మనదేనని చెప్పిన విషయాన్ని కొందరు నేతలు గుర్తు చేసుకున్నారు.
ఒకవిధంగా చెప్పాలంటే వైసీపీకి సీఎం చంద్రబాబు క్లియర్‌గా ఇండికేషన్స్ ఇచ్చారని అంటున్నారు. కొందరు నేతలు కార్యకర్తలను ఉత్సాహపరడానికి ఆ తరహా వ్యాఖ్యలు చేశారని అంటున్నవాళ్లు లేకపోలేదు. మొత్తానికి ఏదైతేనేం అధినేత మాటలపై అప్పుడే చర్చ మొదలైంది.
జగన్ మెడకు చాలా కేసులు వేలాడుతున్నాయని అంటున్నారు టీడీపీ నేతలు. రేపో మాపో లిక్కర్ వ్యవహారం ఆయన మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుందని చెబుతున్నారు. దీనికితోడు రకరకాల కేసులను కూటమి సర్కార్ రెడీ చేస్తోందని అంటున్నారు. అదే జరిగితే వచ్చే ఎన్నికల నాటికి జగన్ బయటకు రారని అంటున్నారు.
సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తోంది వైసీపీలోని ఓ వర్గం. గతంలో తమ నేత జగన్ కూడా వై నాట్ 175 అని అన్నారని అంటున్నారు. ఫలితాలు చూసేసరికి ఎవరికీ అంతుబట్ట లేదన్నారు. టీడీపీకి పునరావృతం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. కేవలం కార్యకర్తలను ఉత్సాహ పరిచేందుకు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు.
కడప లోపదికి పది గెలవాలని సీట్లు గెలవాలి : సీఎం చంద్రబాబు
టీడీపీ మహానాడులో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడపలో తొలిసారి జరుగుతోన్న టీడీపీ మహానాడు చరిత్ర సృష్టించబోతోందని అన్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన గెలుపు అసామాన్యమన్నారు. కడప జిల్లాల్లో 10 సీట్లకు ఏడు… pic.twitter.com/iGDjbOLVhf
— ChotaNews App (@ChotaNewsApp) May 27, 2025