Leopard & Bear: గత కొన్నిరోజులుగా జంతువులు జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. కొన్ని చోట్ల వీటి కారణంగా ప్రాణ నష్టం జరుగుతుండగా.. మరికొన్ని చోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే తాజాగా చిరుతపులి, ఎలుగుబంటిలు అర్ధత్రి ఓ ఇంటికిపైకి ప్రవేశించి గందరగోళం సృష్టించాయి. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇటీవలే చిరుతపులి, ఎలుగుబంటి తమిళనాడు ప్రజలును ఉలిక్కి పడేలా చేశాయి. ఊటీ సమీపంలోని ఎల్లనల్లి కైకట్టి గ్రామంలో అర్థరాత్రి అందరూ నిద్రస్తున్న సమయంలో ఈ రెండూ హల్ చల్ చేశాయి. చిరుతపులి, ఎలుగుబంటి ఓ ఇంటి పైకప్పుపైకి ప్రవేశించి చక్కర్లు కొట్టాయి. అయితే ఆ సమయంలో ప్రజలెవరూ బయటలేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.
ఓ ఇంటిపై ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాల ప్రకారం.. ఎల్లనల్లి కైకట్టి గ్రామంలోకి చిరుతపులి, ఎలుగుబంటి ప్రవేశించాయి. ఆ గ్రామంలోని అన్ని ఇండ్లకు గడియలు పెట్టి ఉండడంతో ఆ రెండూ.. ఇంటిపై చక్కర్లు కొట్టాయి. ముందుగా చిరుతపులి ఇంటి పైకప్పుపై చక్కరు కొట్టి మెట్లపైనుంచి కిందకి దిగింది. ఆ తర్వాత అదే ఇంటిపై ఎలుగుబంటి కూడా కనిపించింది. అయితే చిరుత, ఎలుగుబంటిలు ఆ ఇంటి పై నుంచి దిగిన తర్వాత ఎక్కడికి వెళ్లాయన్నది మాత్రం తెలియలేదు.
Also Read: నీ దైర్యానికి హ్యాట్సాఫ్.. కింగ్ కోబ్రా దాహాన్ని తీర్చావ్ బ్రో.. వైరల్ వీడియో!
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చిరుతపులి, ఎలుగుబంటి గ్రామంలోకి వచ్చిన సమయంలో ఎవరైనా సరే వాటి కంట పడితే ప్రాణాలు పోయే అవకాశం లేకపోలేదని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తమయ్యారు.
#WATCH | Tamil Nadu: A leopard and a bear entered a house in Yellanalli Kaikatti village near Ooty.
(Source: Local) pic.twitter.com/UPDsnjFDnm
— ANI (@ANI) April 6, 2024