BigTV English

Leopard Head Stuck in Vessel : బిందెలో ఇరుక్కున్న చిరుత తల.. వీడియో వైరల్

Leopard Head Stuck in Vessel : బిందెలో ఇరుక్కున్న చిరుత తల.. వీడియో వైరల్

Leopard Head Stuck in Vessel


Leopard Head Stuck in Vessel : సాధారణంగా మన ఇండ్లలోని చిన్న పిల్లలు చెంబుల్లో చేతుల పెట్టడం, బిందెల తల పెట్టడం వంటివి చేస్తుంటారు. ఆ సమయంలో పొరపాటున ఇరుక్కపోతే నానా తంటాలు పడుతుంటారు. ఆ సీన్ చూడటానికి కాస్త టెన్షన్‌గా అనిపించినా.. మరొపక్క నవ్వు కూడా తెప్పిస్తుంది. ఇలాంటి సంఘటనలు గ్రామాల్లో, సినిమాల్లో చూస్తూనే ఉంటాం. సినిమాల్లో కామెడీగా ఇలాంటి సీన్లు పండినా రియల్ లైఫ్‌లో మాత్రం అటువంటి సీన్లు ఎదురైతే కష్టమే.

మరి ఇలాంటి సంఘటన అడవిలో ఓ క్రూర మృగానికి జరిగితే.. జనాలు భయంతో వణికిపోవాలా? లేక నవ్వలేక చావాలా అన్నట్లుగా ఉంటుంది కదా! ఇప్పుడు మహారాష్ట్ర- ధూలె జిల్లాలోని ఓ గ్రామంలో జరిన సంఘటన కూడా ఇటువంటిదే. ఈ అరుదైన ఘటన ఎలా జరిగిందో తెలుసుకోండి.


READ MORE : రోడ్డు దాటుతున్న పులిని ఢీకొట్టిన కారు.. ఆ తర్వాత జరిగింది చూస్తే..!

వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర – ధూలె జిల్లాలోని  ఓ గ్రామం చుట్టు పక్కల అటవీ ప్రాంతం ఉంటుంది. అయితే ఆ అడవి నుంచి ఓ చిరుత పులి అడవిలో ఆహారం దొరక్కపోవడంతో గ్రామంలోకి ప్రవేశించి మేకలు, పుశువులను ఎత్తుకెళుతూ ఉండేది. ఇలా ఆ చిరుత దాడిలో అనేక జంతువులు మరణించాయి.

ఈ నేపథ్యంలో చిరుతపులి జంతువులను వేడాడటం కోసం గ్రామంలోకి ప్రవేశించింది. బాగా దాహం వేసినట్లుగా ఉంది.. చుట్టుపక్కల నీరు కోసం వెతికింది. ఓ బిందెలో నీరు కనిపించడంతో వెంటనే తలదూర్చింది. ఇక అంతే బిందెలో చిరుత తల ఇరుక్కుపోయింది. ఆ బిందెను వదిలించుకోవడం చేతకాక.. అది పడిన తిప్పలు అంతా ఇంతా కాదు. దాదాపు 5 గంటలు అనాలే ఉండిపోయింది.

READ MORE : ధోనీ దాండియా ఆడితే ఆ కిక్కే వేరప్ప..!

మొదట చిరుతను ఆ స్థితిలో చూసిన ఇంటివారు, గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. కొంతసమయం తర్వాత దాని పరిస్థితి చూసి పగలబడి నవ్వుకున్నారు. తర్వాత ఫారెస్ట్ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు.

ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది.. బిందెల తల ఇరుక్కుని పంచలో బెణుకులాడుతున్న చిరుతను చూశారు. వెంటనే పులిని పట్టుకొని ఓ బోణులో ఉంచి కట్టర్ సాయంతో బిందెను కట్ చేశారు. బిందె బాదనుంచి విముక్తి పొందేలా చేశారు. ఇక చిరుత పడ్డ అవస్తలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×