ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ వేదికగా మహా కుంభమేళా వేడుక అత్యంత వైభవంగా జరుగుతోంది. జనవరి 13న బోగి రోజున మొదలైన ఈ ఆధ్యాత్మిక సంబురం.. ఫిబ్రవరి 26న శివరాత్రితో ముగియనుంది. రోజూ కోట్లాది మంది భక్తులు తరలి వస్తున్నారు. సాధువులు, నాగసాధువులు, అఘోరాలు ఈ వేడుకలో పాల్గొని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. మరోవైపు మహా కుంభమేళా వేదికగా పలువురు వైరల్ అవుతున్నారు. రీసెంట్ గా ఓ ఐఐటీ బాబా సోషల్ మీడియాలో ట్రెండ్ కాగా, రీసెంట్ గా రుద్రాక్షలు అమ్మే మోసాలీసా తెగ వైరల్ అయ్యింది. ఇప్పుడు హర్ష రిచారియా అనే సాధ్వి ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది.
మోడ్రన్ డ్రెస్సుల నుంచి కాషాయ దుస్తుల్లోకి!
నిన్న మొన్నటి వరకు మోడ్రన్ లుక్ లో అందాలు ఆరబోసిన హర్ష రిచారియా.. ఒక్కసారిగా గెటప్ మార్చి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. సాధ్వి గెటప్ లో కనిపించడమే కాదు, మోస్ట్ బ్యూటీఫుల్ సాధ్విగా గుర్తింపు తెచ్చుకుంది. నిన్న మొన్నటి వరకు కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా కాషాయ దుస్తులు ధరించి, నుదుటన తిలకం పెట్టుకుని, చేతిలో జపమాల ధరించి అందమైన రూపంలో అటుగా తరలి వస్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఈ అందమైన సాధ్వి హర్ష నిచారియా ఎవరు? అని నెటిజన్లు ఆన్ లైన్ లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.
మోడల్ గా, యాంకర్ గా గుర్తింపు
ఉత్తరాఖండ్ కు చెందిన ఈ 30 ఏళ్ల ముద్దుగుమ్మ, చాలా రిచ్ కిడ్. మోడల్ గా, యాక్టర్ గా, యాంకర్ గా, ఇన్ ఫ్లుయెన్సర్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ ను కలిగి ఉంది. నిజానికి ఆమెకు ముందు నుంచీ దైవ భక్తి ఎక్కువే. ఒకప్పుడు చాలా లగ్జరీ లైఫ్ గడిపినా, ఇప్పుడు దైవ చింతనలో గడపాలి అనుకుంటున్నది. జీవితంలో స్టైల్ గా ఉన్నంత మాత్రాన ఇప్పుడు భక్తి మార్గంలో ఎందుకు నడవకూడదనేది ఆమె ప్రశ్న.
హర్ష రిచారియా తన గురించి ఏం చెప్పిందంటే..
రెండు సంవత్సరాల క్రితం తాను మోడలింగ్, యాక్టింగ్ కు స్వస్తి పలికి ఆధ్యాత్మికతకు మారినట్లు వెల్లడించింది. సాధ్వీగా ఉండేందుకు అన్నింటిని వదిలేసినట్లు చెప్పింది. నిరంజనీ అఖారాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర స్వామి కైలాసానంద గిరి జీ మహారాజ్ దగ్గర శిష్యరికం చేస్తున్నది. ఆమె తాజాగా మహా కుంభమేళాలో కనిపించడంతో సోషల్ మీడియా వేదికగా బాగా పాపులర్ అయ్యింది. మరోవైపు ఆమె ఓ ఫేక్ సాధ్వి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. కాళీ సేన అధిపతి స్వామి ఆనంద్ స్వరూప్ లాంటి వారు కుంభమేళాలో ఆమె వ్యవహార శైలిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. జీవితంలో ఒకసారి వచ్చే మహా కుంభమేళా తనకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిందన్నారు. చాలా మంది తన గురించి తప్పుగా మాట్లాడుతున్నారని కంటతడి పెట్టుకుంది.
About For Viral Video
महाकुंभ में आई बहुत ही खूबसूरत साध्वी
पत्रकार ने पूछा आप इतनी सुन्दर हैं तो साध्वी क्यों बनीं? pic.twitter.com/48ANV8euTR— ममता राजगढ़ (@rajgarh_mamta1) January 13, 2025
यही सत्य है
जब जब एक महिला अपने जीवन में कुछ अलग करती है तो समाज के कुछ लोग बढ़ने नहीं देते
बाकी प्रभु इच्छाहर हर महादेव……………..@newscooponline #harsha #viralsadhvi #host_harsha #harshasquad #trending #viralvideo #mahakumbh2025 #prayagraj #sanatan #hindu #mahadev pic.twitter.com/4fYrJYL6Jv
— Harsha (@Host_harsha) January 16, 2025
Read Also: ఆహా.. ఏమా అందం.. కుంభమేళాలో ఈ న్యాచురల్ బ్యూటీ ఎవరంటే!