BigTV English

Game Changer OTT :’ గేమ్ ఛేంజర్ ‘ మూవీ ఓటీటీ రిలీజ్‍ డేట్ లాక్.. స్ట్రీమింగ్ అప్పుడే..?

Game Changer OTT :’ గేమ్ ఛేంజర్ ‘ మూవీ ఓటీటీ రిలీజ్‍ డేట్ లాక్.. స్ట్రీమింగ్ అప్పుడే..?

Game Changer OTT : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా నటించిన మూవీ గేమ్ చేంజర్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో రిలీజ్ అయింది.. భారీ బడ్జెట్లో వచ్చిన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని అందుకుంది.. త్రిబుల్ ఆర్ తర్వాత మూడేళ్ల తర్వాత వచ్చిన ఈ మూవీ పై మొదటినుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్స్ కూడా మూవీ టీం గట్టిగానే చేశారు. కానీ స్టోరీ కన్ఫ్యూజన్ గా ఉండడంతో జనాలు పెద్దగా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపించలేదు అని తెలుస్తుంది. ఈ మూవీ టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం బాగానే రాబట్టిందని ఓ వార్త వినిపిస్తుంది.. ఈ మూవీ తర్వాత వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ బ్లాక్ బస్టర్ అందుకోవడంతో గేమ్ చేంజర్ పై బజ్ తగ్గింది. ఇక ఓటిటిలోకి రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారని తెలుస్తుంది. ఈ మూవీని ఎప్పుడు స్ట్రీమింగ్ కు తీసుకొస్తారన్నది ఇప్పుడు తెలుసుకుందాం..


కలెక్షన్స్ డౌన్.. 

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ కలెక్షన్స్ ఇప్పుడు దారుణంగా పడిపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి. తొలి రోజు రూ.186కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని మూవీ టీమ్ వెల్లడించడం రచ్చ అయింది. లెక్కలు పెంచేసి చూపిస్తున్నారని నెటిజన్ల నుంచి భారీగా ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో రచ్చ అయింది. ఆ తర్వాత వసూళ్లలో డీలా పడింది. గేమ్ ఛేంజర్ సినిమా మొత్తంగా 12 రోజుల్లో ఇప్పటి వరకు సుమారు రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకున్నట్టు టాక్.. మొత్తానికి ఈ మూవీకి అనుకున్న కలెక్షన్స్ రాలేదని ఓ ఫిలిం ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.


ఓటీటి డీటెయిల్స్.. 

ఈ గేమ్ ఛేంజర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటి సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.. రిలీజ్‍కు ముందే ఈ ఓటీటీ డీల్ జరిగింది. కాగా, గేమ్ ఛేంజర్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఫిబ్రవరి రెండో వారంలో వస్తుందని తాజాగా జబ్ నెలకొంది. ఫిబ్రవరి 14 న గేమ్ ఛేంజర్ చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేందుకు ఈ ఓటీటి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ స్ట్రీమింగ్ గురించి ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఈ చిత్రానికి థియేట్రికల్ రన్ కూడా డల్‍గానే ఉంది. మరి ఫిబ్రవరి రెండో వారంలోనే ఓటీటిలో అందుబాటులోకి తీసుకొస్తారేమో చూడాలి.. ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అదరగొట్టాడు.. నెవ్వర్ బిఫోర్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. కానీ మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రంలో అంజలి, కియారా అడ్వానీ, ఎస్‍జే సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, సునీల్ కీలకపాత్రలు చేశారు. థమన్ సంగీతం అందించారు.. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ రెండు సినిమాలు చేస్తున్నారు..

Related News

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Big Stories

×