BigTV English

Viral: రిస్కీ స్టంట్ వేశాడు.. నీట మునిగి మరణించాడు.. వీడియో వైరల్

Viral: రిస్కీ స్టంట్ వేశాడు.. నీట మునిగి మరణించాడు.. వీడియో వైరల్

Risky Stunt: ఇంటర్నెట్ చౌకగా అందుబాటులోకి వచ్చాక.. సోషల్ మీడియా పిచ్చి ముదిరాక.. ఐడెంటిటీ క్రైసిస్ పెరిగిపోయింది. తమను తాము స్టార్‌గా చూపించుకునే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. పాపులర్ కావాలనే ఆరాటం హద్దు మీరింది. వైరల్ కావాలనే ఆలోచనతో పిచ్చి పనులు, వెకిలి పనులు చేస్తున్నారు. చాలా సార్లు ప్రాణాలను పణంగా పెట్టి మరీ డేంజరస్ స్టంట్లు చేస్తు్న్నారు. చాలా సార్లు ఈ అతి వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతున్నా.. మారడం లేదు. మొన్నే ఒకామే సెల్ఫీ కోసమని కొండ చివరి వరకు వెళ్లి లోయలో పడిపోయింది. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటికి వచ్చింది. ట్రాక్ దగ్గర నిలబడి ట్రైన్ వస్తున్న సమయంలో సెల్ఫీ తీసుకోవాలని ఎంత మంది చనిపోయారో.. బైక్ పై స్టంట్లు వేస్తూ రక్తమాంసపు ముద్దలయ్యారు. అయినా.. ఈ విపరీతం తగ్గలేదు. తాజాగా మహారాష్ట్రలో డ్యాం కట్ట పైకి ఎక్కి నిలబడి కేరింతలు కొడుతూ.. క్షణాల్లోనే డ్యాంలో పడిపోయి విగతజీవిగా మారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వైరల్ కావాలనో.. ఫేమస్ కావాలనో రిస్కీ స్టంట్ వేశాడు. అంతలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది.


నాగ్‌పూర్‌లోని కాలామ్న ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల ఆకాశ్ చకోలే డ్యాంలో మునిగి మరణించాడు. స్థానికంగా పర్యాటక ప్రాంతంగానున్న మకర్దోక్డా డ్యాంకు మిత్రులతో కలిసి వెళ్లాడు. స్వాతంత్ర్య దినోత్సవం నాడే వారు కాసేపు సరదాగా గడపాలని అక్కడికి వెళ్లారు. భారీ వర్షాల కారణంగా డ్యామ్ నిండి నీళ్లు మత్తెడ దూకుతున్నాయి. అలుగుపారుతుండటంతో చాలా మంది ఆసక్తిగా తిలకించడానికి అక్కడికి వెళ్లుతున్నారు. ఆకాశ్ చకోలే కూడా అలాగే మిత్రులతో కలిసి వెళ్లారు.

Also Read: Ganesh Chaturthi: వినాయక చవితికి పకడ్భందీ ఏర్పాట్లు, డేగ కళ్లతో నిఘా: మంత్రి పొన్నం


నీరు పారుతున్న డ్యామ్ గోడ ఎక్కడానికి ఆకాశ్, మరో ఇద్దరు మిత్రులు ప్రయత్నరించారు. అయితే, ఆకాశ్ ఒక్కడే అనుకున్నట్టుగా డ్యామ్ గోడ ఎక్కాడు. ఆ గోడకు అటువైపుగా నిండుకుండలా మారిన డ్యామ్. ఆకాశ్‌ డ్యామ్ గోడ ఎక్కగా మరో ఇద్దరు ఆయనకు సమీపంగా వచ్చారు. అందులో ఒకడు ఆకాశ్‌కు చేయందించాడు. ఆకాశ్ అతని చేయి పట్టుకున్నాడు. కానీ, చేయి జారింది. దీంతో బ్యాలెన్స్ సరి చేసుకోబోయాడు ఆకాశ్. కానీ, సంతులనం కాక వెనకవైపున ఉన్న డ్యాంలో జారి పడిపోయాడు.

ఈ విషయం తెలుసుకున్న రెస్క్యూ టీమ్ వెంటనే అలర్ట్ అయింది. గాలింపు చర్యలు చేపట్టింది. కానీ, ఆకాశ్‌ను ప్రాణాలతో పట్టుకోలేకపోయారు. కొన్ని గంటల తర్వాత ఆకాశ్ మృతదేహాన్ని వారు గుర్తించారు. ఈ భయానక వైరల్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. గగుర్పాటుకు గురిచేస్తున్న ఈ వీడియోనైనా ఇకపై ఇలాంటి ప్రమాదకర స్టంట్లు వేయకుండా అడ్డుకుంటుందని ఆశిస్తున్నట్టు కామెంట్లు పెడుతున్నారు.

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×