BigTV English

Aircraft From Scrap: వారెవ్వా.. పనికిరాని వస్తువులతో ఎయిర్‌‌క్రాఫ్ట్, గాల్లోకి ఎగరగానే..

Aircraft From Scrap: వారెవ్వా.. పనికిరాని వస్తువులతో ఎయిర్‌‌క్రాఫ్ట్, గాల్లోకి ఎగరగానే..

బంగ్లాదేశ్ అంటే.. చాలామందికి ఒక చిన్న చూపు ఉంది. అక్కడంతా నిరక్షరాస్యులే ఉంటారని, నేరాలు ఎక్కువని, సివిక్ సెన్స్ ఉండదని.. చివరికి వారు మనుషులే కాదని వాదించేవారు చాలామందే ఉన్నారు. కానీ, అంతా అలాగే ఉంటారని అనుకుంటే మాత్రం పొరపాటే. అక్కడ మేథావులు కూడా ఉంటారు. ఇందుకు ఈ కుర్రాడే నిదర్శనం. ఎందుకంటే.. అతడు కేవలం ఒక చిన్న షెడ్డులో.. ఎలాంటి సదుపాయాలు లేని ప్రాంతంలో.. తనకు లభించిన చిన్న చిన్న వస్తువులతో ఏకంగా విమాన్ననే తయారు చేసేశాడు. పక్కన పడేసిన ఓ నీటి మోటారునే ఇంజిన్‌గా వాడేశాడు. చిన్న మైదానంలో విజయవంతంగా విమానాన్ని గాల్లోకి తీసుకెళ్లి ఔరా అనిపించాడు.


పనికిరాని వస్తువులతో విమానం..

విమానం తయారు చెయ్యడం అంటే మాటలు కాదు. ఒక వేళ తయారు చేసినా.. దాన్ని గాల్లోకి ఎగిరేలా చెయ్యడం అసాధ్యం. కానీ, బంగ్లాదేశ్‌కు చెందిన 28 ఏళ్ల మానిక్ చంద్ పనికిరాని వస్తువులతో విమానాన్ని తయారు చెయ్యడమే కాదు. ఏకంగా దాన్ని టేకాఫ్ చేసి.. గాల్లో చక్కర్లు కొడుతూ తన సత్తా చాటాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.


జనాలే జనాలు..

మానిక్ చంద్ విమానం తయారు చేశాడని తెలియగానే.. స్థానికులు ప్రయోగం జరుగుతున్న ప్రాంతానికి తరలివచ్చారు. వాళ్ల కేరింతలలో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. అంతేకాదు.. విమానం అలా గాల్లోకి ఎగిరిందో లేదో.. చప్పట్లు.. అరుపులు.. విజిల్స్‌తో సందడి చేశారు. ఆ వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. అయితే, ఈ వీడియోపై భిన్న వాదనలు నెలకొన్నాయి. అది బంగ్లాదేశ్ కాదు, బీహార్ అని కొందరు అంటున్నారు. కానీ, ఇది బంగ్లాదేశ్‌లో జరిగినట్లు ఓ నెటిజన్ స్పష్టం చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ వివిధ కామెంట్లు చేస్తున్నారు. రైట్ బ్రదర్స్ నుంచి 100 మిస్డ్ కాల్స్ అని కొందరు.. ఇలాంటి లోకల్ టాలెంట్స్‌ను ఎంకరేజ్ చెయ్యండని మరికొందరు అంటున్నారు. ప్రభుత్వాలు సరైన ప్రోత్సాహం కల్పించకపోవడం వల్ల ఇలాంటి ఎంతోమంది యంగ్ టాలెంట్స్ ప్రతిభ మరుగునపడిపోతోందని మరికొందరు అంటున్నారు.

Also Read: కలుషితాలను తిని 24 క్యారెట్ల బంగారాన్ని ఉమ్మేసే వింత జీవి ఇదిగో

ఏయే వస్తువులతో తయారు చేశాడు?

ఈ లైట్ వెయిట్ ఎయిర్‌క్రాఫ్ట్ బరువు సుమారు 100 కిలోలు ఉంటుంది. గంటకు 70 కిమీల వేగంతో దూసుకుపోగలరు. ఒక లీటర్ ఇంధనానికి 25 నుంచి 30 కిమీలు వరకు ప్రయాణించగలదు. దీని తయారీకి సుమారు రూ.8 లక్షలు వరకు ఖర్చయినట్లు తెలిసింది. నీటిని తోడేందుకు ఉపయోగించే పంపు ఇంజిన్లు, అల్యూమినియం, స్టైన్‌లెస్ స్టీల్ ఇతరాత్ర వస్తువులను సేకరించి ఈ విమానాన్ని తయారు చేశాడట. ఇందులో వాడిన ప్రతి వస్తువూ అల్రెడీ వాడేసి.. పనికిరాదు అనుకుని పక్కన పెట్టేసినవే. సీటు నుంచి పెడల్ వరకు ప్రతి ఒక్కటీ వ్యర్థాల నుంచి సేకరించినదే. మాణిక్ చంద్ ప్రతిభను చూసి యూఎస్-బంగ్లా ఎయిర్‌లైన్స్ సాయానికి ముందుకొచ్చింది. అతడికి ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Related News

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Viral Video: మూడో అంతస్తు మీద నుంచి పడిపోయాడు.. ఆ తర్వాత మీరు నమ్మలేనిది జరిగింది!

Viral Video: హాలీవుడ్ మూవీని తలపించేలా కారు ప్రమాదం.. వెంట్రుకవాసిలో బయటపడ్డాడు, వైరల్ వీడియో

Viral Video: దాహమేస్తే ఇంజిన్ ఆయిల్ తాగేస్తాడు.. రోజూ ఏకంగా 8 లీటర్లు!

Viral Video: ఫ్లష్ కొట్టగానే.. బుస్సు అంటూ పైకిలేచిన తాచు పాము, పాపం.. గుండె జారింది!

Rare Meteor: ఆకాశంలో అరుదైన మెరుపులు.. నిజంగా ఉల్కాపాతమేనా?

Viral Video: రోడ్డు మధ్యలో కారు ఆపి.. హస్త ప్రయోగం.. ఇంత కరువులో ఉన్నావ్ ఏంట్రా?

Big Stories

×