సాధారణంగా రైల్వే స్టేషన్లలో దొంగతనాలు జరుగుతుంటాయి. జనాలతో కిక్కిరిసిపోయిన సందర్భాల్లో దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తుంటారు. జనాల్లో కలిసిపోయి నెమ్మదిగా ప్రయాణీకుల పర్సులు, సెల్ ఫోన్లు, నగలు దొంగిలిస్తారు. అందుకే, రద్దీ ఎక్కువగా ఉన్న సందర్భాల్లో కాస్త అలర్ట్ గా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా, విలువైన వస్తువులను పోగొట్టుకోవడం ఖాయం. కానీ, తాజాగా ఓ రైల్వే స్టేషన్ లో జరిగిన దొంగతనం అందరినీ ఆశ్చర్యపరిచింది. దొంగతనం ఇలా కూడా జరుగుతుందా? అని అందరూ పరేషాన్ అవుతున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఫ్లాట్ ఫామ్ మీద యువకుడికి వింత అనుభవం
తాజాగా ఓ యువకుడికి రైల్వే ఫ్లాట్ ఫామ్ మీద విచిత్ర అనుభవం ఎదురయ్యింది. రైలు కదులుతుండగా, ఫ్లాట్ ఫామ్ మీద నిలబడి దుస్తుల వ్యాపారానికి సంబంధించిన ప్రమోషన్ కోసం ఓ వీడియో చేస్తున్నాడు. ఆ సమయంలో ఎదురైన వింత ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే..
తాజాగా ఈ వీడియోను Sarcastic School అనే ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేయబడింది. ఇందులో ఓ యువకుడు రైల్వే ఫ్లాట్ ఫామ్ మీద నిలబడి తను అమ్మబోయే బట్టలకు సంబంధించిన వీడియోను మిత్రుడి సాయంతో షూట్ చేస్తున్నాడు. రైలు కదులుతుండగా, దాని పక్క నుంచి నడుచుకుంటూ వచ్చి తన దుస్తుల గురించి ప్రమోషనల్ వీడియో చేస్తున్నాడు. అదే సమయంలో పక్క నుంచి ట్రైన్ బయల్దేరుతుంది. ఆ కుర్రాడు తన రెండు చేతుల్లో రెండు షర్ట్స్ పట్టుకుని, వాటి గురించి చెప్తూ ముందుకు కదులుతున్నాడు. అదే సమయంలో రైలు డోర్ దగ్గర ఉన్న ఓ కుర్రాడు, రైల్వే ఫ్లాట్ ఫామ్ మీద ఉన్న కుర్రాడి చేతిలోని ఓ షర్ట్ లాక్కున్నాడు. వెంటనే ఆ కుర్రాడు షాకై, వెనక్కి తిరిగి చూశాడు. పక్క బోగీలో ఉన్న మరో వ్యక్తి, మరో షర్ట్ ను లాగేసుకున్నాడు. వెంటనే ఆ కుర్రాడు తన షర్ట్స్ కోసం రైలు వెంట పడిగెత్తాడు. కానీ, అప్పటి రైలు వేగంగా ముందుకు వెళ్లిపోయింది. ఏం చేయాలో తెలియక బాధపడటం అతడి వంతు అయ్యింది. నిల్చున్న ఓ వ్యక్తి ఈ కుర్రాడి చేతిలోని షర్టులను లాగేసుకున్నాడు. మరో భోగీలో ఉన్న వ్యక్తి మిగిలిన షర్టులను లాగేసుకున్నాడు. షాకైన ఆ కుర్రాడు తన బట్టల కోసం లోకల్ రైలు వెంబడి పరిగెత్తాడుం కానీ అప్పటికే చాలా ఆలస్యం అయింది. రైలు వేగంగా వెళ్లిపోయింది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
Read Also: బాబోయ్.. ఇంత పెద్ద రుమాల్ రోటినా, తినడానికా, చలికి కప్పుకోవడానికా నాయనా?
నెటిజన్లు ఏమంటున్నారంటే?
ఈ వీడియోను షేర్ చేయడంతో ప్రస్తుతం బాగా వైరల్ అయ్యింది. లక్షలాది మంది ఈ వీడియోను చూశారు. చాలా మంది కామెంట్స్ పెట్టారు. కొంత మంది ఫన్నీగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే, మరికొంత మంది బాధపడుతూ కామెంట్స్ పెట్టారు. “పాపం, ఆ కుర్రాడు ఏదో కష్టపడి తన దుస్తులను ప్రమోట్ చేసుకుంటే, ఇలా చేయడం నిజంగా దారుణం” అని ఓ వ్యక్తి కామెంట్స్ చేశాడు. “నిర్లక్ష్యంగా ఉంటే ఇలాగే జరుగుతుంది” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “ఇది కావాలని చేసినట్లు అనిపిస్తున్నది” అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు.
Read Also: స్టవ్ మీద కూర పెట్టి నిద్రపోయారు.. గాల్లో కలిసిపోయిన ప్రాణాలు!