Emergency Movie: ఒక సినిమా కథను రాసుకోవడం కొంతవరకు ఈజీనే, దానికి కష్టపడి షూటింగ్ పూర్తిచేసిన తర్వాత అదే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది అతిపెద్ద టాస్క్. ముఖ్యంగా బయోపిక్స్ విషయంలో ఎన్నో అడ్డంకులు, ఇబ్బందులు ఎదురవుతాయి. అయినా కూడా మేకర్స్ మాత్రం వెనక్కి తగ్గకుండా తాము తెరకెక్కించిన సినిమాను ప్రేక్షకులకు చూపించాలని కష్టపడుతుంటారు. ప్రస్తుతం కంగనా రనౌత్ కూడా అదే చేస్తోంది. కంగనా రనౌత్ (Kangana Ranaut) హీరోయిన్‌గా నటిస్తూ డైరెక్ట్ చేసిన మూవీ ‘ఎమర్జెన్సీ’. పలు కారణాల వల్ల ఇప్పటివరకు ఈ మూవీ థియేటర్లలో విడుదల కాలేదు. ఇప్పుడు విడుదలయ్యే సమయానికి ‘ఎమర్జెన్సీ’కి మరో ఎదురుదెబ్బ తగిలింది.
మరో ఎదురుదెబ్బ
మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘ఎమర్జెన్సీ’. ఈ సినిమాను కంగనా తానే స్వయంగా డైరెక్ట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంది. కానీ మూవీ మొదలుపెట్టినప్పటి నుండి ఏదో ఒక విధంగా ఇబ్బందులు ఎదుర్కుంటూనే ఉంది. సెన్సార్ విషయంలో కూడా ఈ సినిమా చాలాకాలం పాటు ఎదురుచూసింది. ఫైనల్‌గా అన్ని అడ్డంకులను దాటుకుంటూ జనవరి 17న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమయ్యింది. కేవలం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ‘ఎమర్జెన్సీ’ని ఒకేసారి విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తుండగా.. ఒక్క దేశంలో మాత్రం ఈ మూవీ బ్యాన్ అయినట్టు తెలుస్తోంది.
Also Read: డేటింగ్ రూమర్స్ పై క్లారిటీ.. అందుకే ఒంటరిగా అంటూ కామెంట్..!
రాజకీయ సంబంధాల కోసమే
బంగ్లాదేశ్‌లో ‘ఎమర్జెన్సీ’ మూవీ బ్యాన్ అవ్వనుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. 1975లో ఇండియాలో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ప్రకటించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దానివల్ల రాజకీయంగా ఎన్నో మార్పులు జరిగాయి. ప్రస్తుతం ఇండియా, బంగ్లాదేశ్‌కు మధ్య సంబంధాలను దృష్టిలో పెట్టుకొని ఈ మూవీని అక్కడ బ్యాన్ చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకుందని సమాచారం. ఆ సినిమాలో ఉన్న కంటెంట్‌ను పక్కన పెడితే.. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉన్న రాజకీయ సంబంధాలను దృష్టిలో పెట్టుకొని అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అందుకే బ్యాన్
1971 లిబరేషన్ వార్‌లో ఇండియన్ ఆర్మీ, ఇందిరా గాంధీ పాత్ర గురించి హైలెట్ చేస్తూ ‘ఎమర్జెన్సీ’ (Emergency) తెరకెక్కింది. అదే సమయంలో ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్‌గా పిలవబడే షేక్ ముజిబిర్ రెహమాన్ అందించిన సపోర్ట్ కూడా ఈ సినిమాలో తెలిపారు. అప్పట్లో ఆయన ఇందిరా గాంధీని దుర్గా దేవి అని పిలిచేవారు. ఈ సినిమాలో షేక్ ముజిబిర్ రెహమాన్, షేక్ హసీనా ఎలా హత్య చేయబడ్డారు కూడా స్పష్టంగా చూపించారు. ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని బంగ్లాదేశ్‌లో ‘ఎమర్జెన్సీ’ బ్యాన్ చేయనుందని తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా బంగ్లాదేశ్‌లో ఎన్నో ఇండియన్ సినిమాలు బ్యాన్ అవుతూ వచ్చాయి. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ కూడా ఆ దేశంలో బ్యాన్ అయ్యింది.