Snake bite viral video: మనలో చాలామందికి పాములు అంటే భయంగా ఉంటుంది. కానీ కొందరికి అవే పాములు ధైర్యం, వినోదం అనే పేర్లతో కనిపిస్తాయి. అలా ఓ వ్యక్తి తన జీవితాన్ని అర్థం కాని ఓ సాహసంతో ప్రమాదంలోకి నెట్టేశాడు. అదేంటంటే, రోడ్డుపైన కనిపించిన పామును మెడలో వేసుకుని వీరుడిలా బైక్ పై చక్కర్లు కొట్టాడు. నాకు భయం లేదు అంటూ చుట్టూ ఉన్నవాళ్లకి చూపించడానికి ఇలా చేశాడు. కానీ, ఆ పామే కాసేపటికే అతనికి కాటు వేసింది. చివరికి ప్రాణమే బలైంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
ఆ రోజు ఉదయం. తండ్రి తన చిన్న కొడుకుని స్కూల్ వద్ద దింపేందుకు బైక్ పై వెళుతున్నాడు. మార్గమధ్యంలో ఓ పాము కనిపించింది. అది నల్ల త్రాచు అనే విషపూరితమైన జాతికి చెందినదని అతనికి తెలియదు. అది ప్రమాదకరమైనదని ఎవ్వరూ హెచ్చరించలేదు. కానీ అతను మాత్రం దాన్ని హీరోలా మెడలో వేసుకుని బైక్ పై షికార్లు కొట్టడం మొదలుపెట్టాడు. తన కుమారుడిని స్కూల్ వద్ద దింపి ఫోజులు ఇచ్చాడు. అంతే కాదు.. చుట్టూ ఉన్నవాళ్లకు పాములంటే భయం లేదురా నాకంటూ చెప్పే ప్రయత్నం చేశాడు.
విషపూరితమైన ఆ పాము కొంతసేపు ఓపికగా అతని మెడపై నిశ్శబ్దంగా ఉంది. కానీ ఓ దశలో భయంతో తనను రక్షించుకునేందుకు కాటు వేసింది. మూడో క్షణంలోనే పరిస్థితి మారిపోయింది. నవ్వుతూ, ధైర్యంగా ఉండే వ్యక్తి కొద్ది నిమిషాల్లోనే నేలపై పడిపోయి బాధతో విలవిలలాడాడు. వెంటనే చుట్టుపక్కలవారు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పాము విషం శరీరంలో వ్యాపించిపోయింది. వైద్యం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆ రాత్రికి అతను శ్వాస విడిచాడు.
ఇలాంటి ఘటనలు ఇప్పటిదొక్కటే కావు. ఇటీవలి కాలంలో సెల్ఫీలు, వీడియోల కోసం, సోషల్ మీడియాలో సాహసం చూపించాలనే ఉద్దేశంతో పాములతో ఆటలాడే ఘటనలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కానీ మనం మర్చిపోకూడని ఓ విషయం ఏమిటంటే.. పాములు పాములే. అవి తమ స్వభావాన్ని మార్చకపోయినా, మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చాలా విషపూరిత పాములు మొదట నిశ్శబ్దంగా ఉంటాయి. అయితే ఒక్కసారి అవి వేసే కాటు మన జీవితానికే శాపంగా మారుతుంది.
Also Read: Visakhapatnam Raipur Expressway: ఏపీకి మరో ఫోర్ లైన్.. విశాఖ నుండి జర్నీ చాలా ఈజీ బాస్!
ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమిటంటే.. ప్రతి పాము విషరహితం కాదు. పాము కనిపించగానే గేమ్, షో అనుకుంటే.. అది ఆట కాదు, రిస్క్. ముఖ్యంగా పిల్లల ముందు ఇలా ప్రవర్తించడం చాలా ప్రమాదకరం. పెద్దలు చేసే పనులు చిన్నవాళ్లు అనుకరిస్తారు. ఓ తండ్రి చేసిన ఈ సాహసం.. ఇప్పుడు కొడుకు జీవితాంతం గుర్తుంచుకునే గాయం అయిపోయింది.
ఈ ఘటన మధ్య ప్రదేశ్‌లోని రఘోఘర్ లో జరిగింది. పామును మెడలో వేసుకొని ప్రాణాలు వదిలిన వ్యక్తి పేరు దీపక్ మహావార్. పామును మెడలో వేసుకుని వినోదంగా అనుకున్నది.. చివరికి విషంగా మారింది. మనిషి ప్రకృతితో ఆడుకుంటే.. ప్రకృతి తీర్పు మాత్రం దారుణంగానే ఉంటుందని చెప్పేందుకు ఈ ఘటన ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.
మెడలో పాము వేసుకుని ఆటలు… చివరికి పాము కాటు వేయడంతో మృతి.
మధ్య ప్రదేశ్‌లోని రఘోఘర్ లో దీపక్ మహావార్ అనే అతను ప్రమాదకరమైన నల్లత్రాచును మెడలో వేసుకుని ఆటలు ఆడాడు. తన కుమారున్ని స్కూల్ వద్ద డ్రాప్ చేసి తిరిగి ఇంటికి వస్తుండగా ఆ పాము కాటేసింది. చికిత్స తీసుకున్నా.. రాత్రిలోపు… pic.twitter.com/Kp4jh7DhXZ
— BIG TV Cinema (@BigtvCinema) July 16, 2025