రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణంగా నిర్లక్ష్యం. కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరిగినప్పటికీ, ఎక్కువ శాతం డ్రైవర్ల అతి కారణంగానే యాక్సిడెంట్లు అవుతుంటాయి. ఎవరో ఒక డ్రైవర్ చేసిన పొరపాటు ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకున్న సందర్భాలున్నాయి. రోడ్డు మీద వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నప్పటికీ చాలా మంది పట్టించుకోవడం లేదు. తాజాగా ఓ ట్రక్కు డ్రైవర్ ఏకంగా స్టీరింగ్ వదిలేసి చేసిన డేంజర్ స్టంట్ తాలూకు విజువల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రైవర్ తీరుపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.
స్టీరింగ్ వదిలేసి డేంజరస్ స్టంట్..
ట్రక్కు డ్రైవర్లు దేశ వ్యాప్తంగా ప్రయాణాలు చేస్తుంటారు. నిత్యం ఆయా వస్తువులను రవాణా చేస్తుంటారు. రోజూ ఎన్నో రోడ్డు ప్రమాదాలను చూస్తుంటారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తమతో పాటు ఎదుటి వారి ప్రాణాలు పోతాయనే విషయం బాగా తెలుసు. అయినా కొంత మంది ఓవరాక్షన్ చేస్తుంటారు. తమతో పాటు ఎదుటి వారి ప్రాణాలకు ముప్పు తీసుకొస్తారు. తాజాగా ఓ లారీ డ్రైవర్ చేసిన పని కూడా ఇలాగే ఉంది. జాతీయ రహదారి మీద అతివేగంగా లారీని నడపడంతో పాటు ప్రమాదకర విన్యాసాలు చేశాడు. ఈ వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
వైరల్ వీడియోలో ఏం ఉందంటే?
తాజాగా సదరు లారీ డ్రైవర్ షేర్ చేసిన వీడియోను పరిశీలిస్తే, లారీ జాతీయ రహదారి మీద వేగంగా వెళ్తుంది. ఒక్కసారిగా డ్రైవర్ తన సీటు నుంచి లేచి విండో లో నుంచి ట్రక్ ముందు భాగంలోకి వెళ్తాడు. నెమ్మదిగా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వరకు చేరకుంటాడు. ఎడమ చేతి వైపు విండో ద్వారా లోపలికి వెళ్లి, మళ్లీ తన సీటులో కూర్చుంటాడు. తానేదో ఘనకార్యం చేసిన వాడిలా వీడియోకు ఫోజులిస్తాడు. డ్రైవర్ గారి కథనంతా క్లీనర్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Read Also: సమోసా ఇండియాలో పుట్టిందని అనుకుంటున్నారా? కానే కాదు.. ఆ దేశంలో పుట్టి.. ఇక్కడికి!
డ్రైవర్ తీరుపై నిప్పుల చెరుగుతున్న నెటిజన్లు
ఈ వైరల్ వీడియో సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ప్రసారం అయ్యింది. రహదారి భద్రతపై తీవ్ర ఆందోళనకు కారణం అయ్యింది. ఈ స్టంట్ చేసిన ట్రక్కు డ్రైవర్ మీద దుమ్మెత్తి పోస్టున్నారు నెటిజన్లు. పోతే వాడొక్కడే కాదు, చాలా మంది చావుకు కారణం అవుతాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చలాన్లు జారీ చేయడంతో పాటు రహదారుల మీద ఇలాంటి ప్రమాదకరమైన చర్యల పట్ల కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. సదరు డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరూ ఇలాంటి సంట్లు చేసి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దంటున్నారు.
Read Also: బాబోయ్.. మేం నడపలేం, చేతులెత్తేసిన పాక్ రైల్వే, పలు రైళ్లు ప్రైవేట్ పరం!