Indian Railways: కదులుతున్న రైలులోకి ఎక్కుతూ, దిగుతూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం చూశాం. నేరుగా పట్టాల మీద పడి ముక్కలు అయిన సందర్భాలూ ఉన్నాయి. కొన్నిసార్లు రైల్లో నుంచి పడిపోతున్న వారిని కాపాడిన ఘటనలను కూడా చాలాసార్లు చూశాం. కొన్నిసార్లు రైల్వే సిబ్బంది, మరికొన్నిసార్లు ప్లాట్ ఫారమ్ మీద ఉన్న ప్రయాణీకులు వెంటనే స్పందించిన పడిపోతున్న వారి ప్రాణాలను సేవ్ చేశారు. తాజాగా సేమ్ అలాంటి ఘటనే జరిగింది. రైల్లో నుంచి పడిపోతున్న ఓ మహిళ ప్రాణాలను కాపాడాడు ఓ రైల్వే పోలీస్. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..
మహిళ ప్రాణాలు రక్షించిన రైల్వే పోలీస్
కదులుతున్న రైలు నుంచి ప్లాట్ ఫారమ్ మీదికి దిగేందుకు ప్రయత్నించిన ఓ మహిళ నేరుగా పట్టాల మీద పడబోయింది. అది గమనించిన రైల్వే పోలీస్ వెంటనే ఆమెను పైకి లాగి ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన ముంబై లోని బోరివలి రైల్వే స్టేషన్ లో జరిగింది. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఈ వీడియోను రైల్వే మినిస్ట్రీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ ఘటనను ‘మిషన్ జీవన్ రక్ష’గా అభివర్ణించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఘటనపై రైల్వేశాఖ ఏం అన్నదంటే?
“మహారాష్ట్రలోని బోరివలి రైల్వే స్టేషన్ లో రన్నింగ్ ట్రైన్ నుంచి దిగుతున్నప్పుడు ఓ మహిళ తన బ్యాలెన్స్ ను కోల్పోయింది. రైలు, ప్లాట్ ఫారమ్ మధ్యలో పడిపోబోయింది. అక్కడే ఉన్న రైల్వే పోలీస్ సిబ్బంది వేగంగా స్పందించారు. ఆమె చేయి పట్టుకుని పైకి లాగారు. ప్రాణాలను కాపాడారు. ఆయన స్పందించిన తీరు నిజంగ అభినందనీయం. ప్యాసింజర్లు రైల్లో ప్రయాణించేటప్పుడు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. రైలు కదలడానికి ముందే ఎక్కాలి. రైలు ఆగిన తర్వాతే దిగాలి. కదులుతున్న రైల్లో నుంచి దిగడం మూలంగా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా రైల్వే సిబ్బంది ఎల్లప్పుడూ కృషి చేస్తున్నారు” అని రైల్వేశాఖ వెల్లడించింది.
महाराष्ट्र के बोरीवली रेलवे स्टेशन पर एक महिला चलती ट्रेन से उतरते समय असंतुलित होकर गिर पड़ी। वहां मौजूद रेलवे सुरक्षाकर्मी ने तत्परता दिखाते हुए उसे बचा लिया।
कृपया चलती ट्रेन से चढ़ने या उतरने की कोशिश न करें।#MissionJeevanRaksha pic.twitter.com/6R8FALdD0d
— Ministry of Railways (@RailMinIndia) March 9, 2025
రైల్వే పోలీసుపై నెటిజన్ల ప్రశంసలు
ఈ వీడియోను చూసి నెటిజన్లు సదరు రైల్వే పోలీస్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మహిళ ప్రాణాలను కాపాడిన ఆయనకు తగిన రివార్డును ఇవ్వాలని రైల్వేశాఖకు సూచిస్తున్నారు. తను వెంటనే స్పందించడం వల్లే నిండు ప్రాణాలు నిలబడ్డాయంటున్నారు. ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు సాధారణ రైళ్లలోనూ మెట్రో తరహా ఆటోమేటిక్ డోర్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Read Also: ఇకపై టికెట్ ఉంటేనే రైల్వే స్టేషన్ లోకి ఎంట్రీ, రైల్వేశాఖ కీలక నిర్ణయం!
గత నెలలో అంధేరి రైల్వే స్టేషన్ లోనూ..
గత నెలలోనూ ముంబైలో ఇలాంటి ఘటనే జరిగింది. అంధేరి రైల్వే స్టేషన్ లో 40 సంవత్సరాల వ్యక్తి రెండు బ్యాగులు మోసుకుంటూ, కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. కాలు జారి ట్రాక్ మీద పడబోయాడు. వెంటనే స్పందించిన రైల్వే పోలీసులు అతడిని పైకి లాగి ప్రాణాలు కాపాడారు.
Read Also: పట్టాలెక్కబోతున్న హైడ్రోజన్ ట్రైన్, ముహూర్తం ఫిక్స్ చేసిన ఇండియన్ రైల్వే!