Funny Video: రంగుల పండుగ హోలీ వచ్చిందంటే చాలు జనాలంతా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అందరూ ఒక్కచోట చేరి రంగులు చల్లుకుంటూ సరదాగా గడుపుతారు. పల్లెటూళ్లలో మోదుగులు పూలు తెచ్చి రంగు తయారు చేసి ఒకరిపై మరొకరు చల్లుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక పట్టణాలు నగరాల్లో రకరకాల రంగులు చట్టుకుంటూ జోష్ ఫుల్ గా గడుపుతారు. కొన్ని సంస్థలు హోలీ ఈవెంట్లు కూడా నిర్వహిస్తాయి. వాటర్ డ్యాన్సులు చేస్తూ ఆహ్లాదంగా గడుపుతారు.
హోలీ ఆడుతున్న ప్రేమికులకు ఊహించని షాక్
ఇక హోలీ సందర్భంగా వరుసైన అమ్మాయిలు, అబ్బాయిలు మరింత జోష్ గా హోలీ జరుపుకుంటారు. బావ మరదల్లు, లవ్ లో ఉన్నవాళ్లు చేసే ఎంజాయ్ మెంట్ మాటల్లో చెప్పలేం. ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ, డ్యాన్సులు చేస్తూ హోలీని సెలబ్రేట్ చేసుంటారు. అయితే, హోలీ సందర్భంగా ఓ ప్రేమ జంటకు అనుకోని స్విచ్చువేషన్ ఎదురయ్యింది. రంగులు పూసుకుని ముద్దు పెట్టుకోవాలనుకున్నాఆ జంటకు ఊహించని పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ముద్దు పెట్టబోయిన యువకుడికి చెంపదెబ్బ
హోలీ సందర్భంగా అమ్మాయి ఇంట్లోను ఉండగా.. అబ్బాయి వారి ఇంటి బయట ఉంటాడు. ఆ అమ్మాయికి రంగులు పూసేందుకు కలర్స్ తో అక్కడికి వస్తాడు. ఆమె కూడా అతడికి రంగులు పూయాలనుకుంటుంది. కానీ, బయటకు పోయే అవకాశం లేకపోవడంతో గోడ దగ్గరికి వచ్చి నిల్చుంటుంది. ముందుగా అతడు ఆ అమ్మాయి బుగ్గలకు రంగులు పూస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా అతడికి రంగులు పూస్తుంది. పనిలో పనిగా ఆ అమ్మాయికి ఓ ముద్దు పెట్టాలనుకుంటాడు. గోడపైకి ఎక్కి ఆమెకు ముద్దు పెట్టు సమయంలోనే ఊహించని ఘటన జరుగుతుంది. అ అమ్మాయి వాళ్ల అమ్మ అక్కడికి వచ్చి, అబ్బాయి చెంప చెల్లుమనిపిస్తుంది. దీంతో వాళ్లిద్దరు షాక్ అవుతారు. ఆ అబ్బాయి అక్కడి నుంచి పారిపోగా, అమ్మాయి సైతం ఇంట్లోకి వెళ్లిపోతుంది. ఈ వీడియోను ‘రాండమ్ గాయ్’ అనే ఎక్స్ అకౌంట్ ద్వారా షేర్ చేయబడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం 2 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.
Broooo 😭 pic.twitter.com/QNZd4zNngP
— Random Guy 🇮🇳 (@_____Random_Guy) March 6, 2025
Read Also: ఆ కారులో ఏముంది? ఆమె అంత భయంతో పరిగెట్టింది?
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
ఇక ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. మరికొంత మంది ఇది కేవలం డ్రామా అంటున్నారు. స్క్రిప్ట్ ప్రకారం ఈ వీడియోను షూట్ చేశారని కామెంట్స్ పెడుతున్నారు. “ఇది కచ్చితంగా స్క్రిప్టెడ్ వీడియో” అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. “ఇదీ అలసైన వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే..” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “ కరెక్ట్ టైమ్ కు భలే షాట్ కొట్టింది” అని ఇంకోవ్యక్తి కామెంట్ చేశారు. “సూపర్ ఫాస్ట్ ఆంటీ” అని మరోవ్యక్తి కామెంట్ పెట్టాడు. “ఇది కదా సూపర్ సర్ ప్రైజ్ అంటే..” అని మరొకరు కామెంట్ పెట్టారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను బాగా అలరిస్తోంది.
Read Also: రన్నింగ్ ట్రైన్ లో నుంచి కింద పడబోయిన మహిళ.. కాపాడిన రైల్వే పోలీస్!