మయన్మార్, థాయ్ లాండ్ లో సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు ఇరు దేశాల్లో భూకంపం కల్లోలం సృష్టించింది. 7.7, 6.4 తీవ్రతతో వరుస భూకంపాలు రావడంతో.. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆఫీసులు, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొద్ది నిమిషాల పాటు భూమి కంపిచడంతో భారీ భవంతులు కుప్పకూలిపోయాయి. పలు చోట్ల రోడ్డు ధ్వంసం అయాయి. చారిత్రక కట్టడాలు ధ్వంసం అయ్యాయి. ఇప్పటి వరకు భూకంపం ధాటికి మృతి చెందిన వారి సంఖ్య వెయ్యికి చేరింది. శిథిలాల కింద వందల మంది చిక్కుకున్నారు. వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు అక్కడి అధికారులు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న భూకంపం వీడియోలు
ఇక థాయ్ లాండ్, మయన్మార్ లో భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆయా నగరాల్లో విధ్వంసానికి సంబంధించి స్థానిక ప్రజలు కొన్ని వీడియోలను షేర్ చేయగా, మరికొన్ని సీసీ టీవీల్లో రికార్డు అయిన వీడియోలు బయటకు వచ్చాయి. వీటిలో ఆయా నగరాలు ఎలా విధ్వంసం అయ్యాయో స్పష్టంగా కనిపిస్తున్నాయి. థాయిలాండ్‌లో నిర్మాణంలో ఉన్న ఎత్తైన భవనం కూలిపోవడంతో సహా, అనేకత ఇతర వీడియోలు భయాన్ని కల్పిస్తున్నాయి.
రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ లో బీభత్సం..
ఇక బ్యాంకాక్ లోని ఓ భారీ భవంతి భూకంపానికి చిగురుటాకులా వణించింది. రూఫ్ టాప్ మీద ఉన్న స్విమ్మింగ్ పూల్ లో ఓ జంట పరుపు మీద పడుకుని రిలాక్స్ అవుతున్నారు. మరోవ్యక్తి స్విమ్మింగ్ పూల్ పక్కినే చైర్ మీద రిలాక్స్ అవుతున్నాడు. ఒక్కసారిగా భూకంపం రావడంతో స్విమ్మింగ్ పూల్ లోని నీళ్లు అల్లకల్లోం సృష్టించాయి. పూల్ లో బెడ్ మీద రిలాక్స్ అవుతున్న జంటకు గుండె ఆగినంత పని అయ్యింది. స్విమ్మింగ్ పూల్ లో నీళ్లు భారీ కుదుపులకు గురయ్యాయి. ఏమాత్రం ఆలస్యం చేసినా వాళ్లు స్విమ్మింగ్ పూల్ లో నుంచి కిందపడిపోయే అవకాశం ఉండేది. కానీ, వెంటనే, వాళ్లు స్విమ్మింగ్ పూల్ లో నుంచి బయటపడ్డారు.
CCTV footage from a swimming pool in a building in Bangkok during yesterday's earthquake.#Thailand #Bangkok #แผ่นดินไหว #EarthquakeThailand #Earthquakes #Earthquake pic.twitter.com/qoFqZXxBGg
— Thai Enquirer (@ThaiEnquirer) March 29, 2025
ఇక శక్తివంతమైన భూకంపం ధాటికి భవనాలు ఊగిపోవడంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. పలు భవనాల పైకప్పు కొలనుల నుండి నీళ్లు బయటకు ఒలికిపోయాయి. రోడ్ల మీద వెళ్తున్న కార్లు, ఇతర వాహనాలు వణుకుతుతే కనిపించాయి. మయన్మార్ లో భవనాలు కళ్లముందే కూలిపోతున్న విజువల్స్ ప్రపంచాన్ని షాక్ కు గురి చేస్తున్నాయి.
The #earthquake shakes #Thailand as water cascades from the pool of a high-rise building. #Myanmar #MyanmarEarthquake https://t.co/xZazhLImIK pic.twitter.com/1Jz8YpLgGP
— Shanghai Daily (@shanghaidaily) March 28, 2025
ప్రధాని మోడీ దిగ్భ్రాంతి, ఆయా దేశాలకు సహాయ సామాగ్రి
భారీ భూకంపం మయన్మార్, థాయ్ లాండ్ దేశాల్లో భారీ విపత్తును కలిగించిన నేపథ్యంలో ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ దేశాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే భారత్ నుంచి ఆయా దేశాలకు సహాయపు సామాగ్రిని సైనిక విమానంలో పంపించారు.
As the #earthquake struck, cars rocked on the road while buildings across #Myanmar were damaged. #MyanmarEarthquake https://t.co/xZazhLImIK pic.twitter.com/rN5JXzKXwL
— Shanghai Daily (@shanghaidaily) March 28, 2025
Read Also: భూకంపంతో మయన్మార్ లో కల్లోలం, 144కి చేరిన మృతుల సంఖ్య!