Nithin Kamath: బిజినెస్ ప్రపంచంలో ఒక్క రూపాయి నష్టం వస్తేనే తలపట్టుకునే సీఈఓలను చూసుంటాం. కానీ, ఏకంగా రూ. 2.5 లక్షల బెట్ ఓడిపోయి, ఆ విషయాన్ని పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు భారతదేశపు ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ‘జెరోధా’ కో-ఫౌండర్ అండ్ సీఈఓ నితిన్ కామత్. “ఈ బెట్‌లో నేను ఓడిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది” అంటూ ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. అసలు ఇంతకీ ఆయన ఎవరితో బెట్ కాశారు? ఆ రూ. 2.5 లక్షలు ఎవరి జేబులోకి వెళ్లాయో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు.
I lost a fitness bet, and I'm happy I lost this one. pic.twitter.com/xhR3XSC9Yn
— Nithin Kamath (@Nithin0dha) June 18, 2026
జెరోధా కంపెనీలో కంటెంట్ అండ్ స్ట్రాటజిస్ట్‌గా పనిచేసే రోహిత్ అగర్వాలా అనే ఉద్యోగి కథే దీనికి కారణం. ఒకప్పుడు 104 కిలోల బరువుతో, శారీరక సమస్యలతో ఇబ్బంది పడ్డ రోహిత్.. ఎలాగైనా ఫిట్‌గా మారాలని డిసైడ్ అయ్యాడు. జెరోధా కంపెనీలో ఉన్న హెల్త్ కల్చర్‌ను చూసి ఇన్స్‌పైర్ అయిన అతను, తన బాస్ నితిన్ కామత్‌తోనే నేరుగా ఒక క్రేజీ ఛాలెంజ్ పెట్టుకున్నాడు. నితిన్ కామత్ విధించిన ఫిట్‌నెస్ టార్గెట్‌ను రీచ్ అయితే రూ. 2.5 లక్షలు ఇస్తానని బాస్ ఆఫర్ ఇచ్చారు. కేవలం సీఈఓ మాత్రమే కాదు.. ఆఫీస్‌లోని మరో 15 మంది కొలీగ్స్ కూడా రోహిత్ మీద నమ్మకం లేక, “నువ్వు బరువు తగ్గలేవు” అంటూ మరో రూ. 1 లక్ష బెట్ కట్టారు. అంటే మొత్తం రూ. 3.5 లక్షల బెట్ అన్నమాట.
Also read :బాహుబలి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదుగా.. ఫ్రాన్స్‌లో ప్రభాస్ యానిమేషన్ సినిమా సెన్సేషన్!
రోహిత్ అగర్వాలా గతంలో చాలాసార్లు బరువు తగ్గడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు. కానీ ఈసారి బాస్ పెట్టిన ఛాలెంజ్, ఆఫీస్ కొలీగ్స్ వేసిన బెట్ అతనిలో కసిని పెంచాయి. ఏప్రిల్‌లో 104 కేజీల బరువుతో ప్రయాణం ప్రారంభించిన రోహిత్, జూన్ నాటికి అప్పటికే కష్టపడి 95 కేజీలకు వచ్చాడు. ఇక అక్కడ నుండి అసలైన ఛాలెంజ్ మొదలైంది. జనవరి 8 నాటికి ఆరు నెలల డెడ్‌లైన్ ముగిసేసరికి అతను ఏకంగా 74.5 కేజీలకు చేరుకున్నాడు. మొత్తంగా ఏడాది కాలంలో 30 కిలోల బరువు తగ్గి, తన పాత లుక్‌ను పూర్తిగా మార్చేసి అందరికీ మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చాడు. తన టార్గెట్ కంటే ఎక్కువే తగ్గి బెట్ గెలుచుకున్నాడు.
రోహిత్ సాధించిన ఈ అద్భుతమైన విజయాన్ని నితిన్ కామత్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, రోహిత్‌తో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. రోహిత్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. “నా బిగ్గెస్ట్ ఫ్లెక్స్ ఏంటో తెలుసా? మా బాస్ నితిన్ కామత్ దగ్గర బెట్ కాసి రూ. 2.5 లక్షలు గెలవడం. అయితే ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు, నా ఆరోగ్యం తిరిగి రావడం, నా లైఫ్ మారడమే అసలైన రివార్డ్” అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. లైఫ్‌లో ఓడిపోవడానికి ఇంతకంటే బెస్ట్ బెట్ మరొకటి ఉండదు నితిన్ భాయ్.. మీరు డబ్బులు పోగొట్టుకున్నా ఒక మనిషి ప్రాణాన్ని, ఆరోగ్యాన్ని గెలిపించారు,హాట్సాఫ్ టు జెరోధా కల్చర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.
ఈ రోజుల్లో ఐటీ, కార్పొరేట్ ఉద్యోగాలు అంటే కేవలం టార్గెట్లు, ప్రెజర్లు, డెడ్‌లైన్లు, మానసిక ఒత్తిడి మాత్రమే గుర్తుకొస్తాయి. కూర్చుని పనిచేయడం వల్ల 90% మంది ఉద్యోగులు ఊబకాయం, గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఇలాంటి తరుణంలో జెరోధా సీఈఓ నితిన్ కామత్ తీసుకున్న ఈ డిసీషన్ మెచ్చుకోతగ్గదే. కంపెనీలో కేవలం వర్క్ మాత్రమే కాదు, ఎంప్లాయ్ హెల్త్ కూడా ముఖ్యమే అని నిరూపించారు. మరి మీ ఆఫీస్‌లో కూడా ఇలాంటి క్రేజీ ఛాలెంజ్స్ పెట్టి, బరువు తగ్గితే లక్షలు ఇచ్చే బాస్ ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.