E-Paper
Advertisement

King Cobra viral video: నోట్లో నాగపాము.. చేతులతో కాకుండా నోటితో పట్టుకుని అతి చేశాడు, చివరికి..

King Cobra viral video: నోట్లో నాగపాము.. చేతులతో కాకుండా నోటితో పట్టుకుని అతి చేశాడు, చివరికి..
Advertisement

King Cobra viral video: సాధారణంగా పాము కనిపిస్తేనే ఆమడదూరం పరుగెడుతుంటాం. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాతో ఓ వ్యక్తి చేసిన సాహసం చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ప్రాణాలను పణంగా పెట్టి అతను చేసిన ఆ వింత విన్యాసం ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. అసలు ఆ వ్యక్తి ఏం చేశాడంటే..

ఒక కింగ్ కోబ్రా (రాజనాగు)తో చేసిన అత్యంత ప్రమాదకరమైన విన్యాసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా రెమునా ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన చూసిన వారందరినీ షాక్‌కు గురిచేస్తోంది. “ఖగా” అనే వ్యక్తి ఎటువంటి రక్షణ కవచాలు లేకుండా, కేవలం తన చేతులతోనే కాకుండా, ఏకంగా తన నోటితో ఆ భయంకరమైన పామును పైకి లేపడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.

Advertisement

సాధారణంగా పాములను పట్టుకునే వారు వాటి పడగను తాకడం లేదా ముద్దు పెట్టుకోవడం వంటివి చేస్తుంటారు. కానీ, ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రాను ఇలా నోటితో కరచుకుని గాలిలోకి లేపడం అనేది అత్యంత అరుదైన మరియు ప్రాణాంతకమైన చర్య. ఈ విన్యాసం జరుగుతున్న సమయంలో అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి ఉండటం విశేషం. ఆ పాము ప్రాణంతోనే ఉన్నప్పటికీ, ఖగా ఎంతో సులువుగా దానిని నోటితో పట్టుకోవడం వీడియోలో కనిపిస్తుంది. విన్యాసం ముగిసిన తర్వాత అతను ఏమీ జరగనట్లుగా ఆ పామును పక్కనే ఉన్న ఒక సంచిలో పడేసి అక్కడి నుంచి వెనుదిరిగాడు.

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు అతని సాహసాన్ని చూసి ఆశ్చర్యపోతుంటే, మరికొందరు దీనిని బాధ్యతారాహిత్యమైన చర్యగా మండిపడుతున్నారు. ఇది కేవలం ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా, మూగజీవాలను హింసించడమేనని వన్యప్రాణి ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు ఇతరులకు తప్పుడు సందేశాన్ని ఇస్తాయని, వీటిని ప్రోత్సహించకూడదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Advertisement

Read Also: Viral Video: బైకులకు రాడ్లు కట్టుకుని తిరుగుతోన్న పాకిస్తానీలు.. అక్కడ కూడా అదే సమస్య?

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×