నలుగురు వెళ్లే దారిలో మనం వెళ్లే దారిలో మనం వెళ్తే కిక్ ఏం ఉంటుంది? అనుకుంటారు కొంత మంది. అందరితో పాటు కాకుండా ఏదైనా వెరైటీగా చేయాలి అనుకుంటారు మరికొంత మంది. వింత ఆలోచనలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. చిత్ర విచిత్రమైన ఐడియాలు వారికంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తాయి. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి క్రేజీ ఆలోచనలు వచ్చేస్తున్నాయి జనాలకు. ప్రతి ఒక్కరి చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చిన నేపథ్యంలో ఇలాంటి వింత ఐడియాలు కూడా క్షణాల్లోనే ఇంటర్నెట్ లో చక్కర్లు కొడతాయి.
నెట్టింట వైరల్ అవుతున్న వెరైటీ బిల్డింగ్ ఫోటోలు
తాజాగా ఇలాంటి ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎవరైనా ఆఫీస్ బిల్డింగ్ కట్టాలనుకుంటే చాలా స్టైలిష్ గా ఉండాలి అనుకుంటారు. అలాగే నిర్మిస్తుంటారు. కానీ, ఓ వ్యక్తి తన ఆఫీస్ విషయంలో చాలా డిఫరెంట్ గా ఆలోచించాడు. ఇప్పుడు ఆ ఆలోచనే సోషల్ మీడియాలో వైరల్ తుఫాన్ గా మారింది. ఎవరైనా ఈ బిల్డింగ్ ను చూస్తే ఏదో భూకంపం వచ్చి కూలిపోయింది. మళ్లీ నిర్మించేందుకు డబ్బులు లేక, కూలిన బిల్డింగ్ లోనే ఉద్యోగులు పని చేస్తున్నారు అని చాలా మంది అనుకుంటారు. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదు. ఆ బిల్డింగ్ డిజైనే అలా ఉంది అని తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. మీరు ఇప్పటి వరకు అలాగే అనుకున్నారు కదా. అయితే, మీరు కూడా తప్పులో కాలేసినట్లే. అయితే, ఈ బిల్డింగ్ నిజంగానే ఉందా? లేదంటే గ్రాఫిక్స్ చేశారా? అనేది తెలియాల్సి ఉంది.
Read Also: గుట్కా ఉమ్ములతో ఎర్రబడ్డ ఈ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందో చెప్పుకోండి.. బీహార్ కాదు!
ఫన్నీగా కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు
ఇక ఈ బిల్డింగ్ ఫోటోలు చూసి సోషల్ మీడియాలో జనాలు జోరుగా చర్చించుకుంటున్నారు. కొంత మంది ఈ బిల్డింగ్ ఆలోచనకు ఫిదా అవుతుంటే.. మరికొంత మంది ఇదేం బిల్డింగ్ రా అయ్యా అని కామెంట్స్ పెడుతున్నారు. “ఈ ఫోటోలు చూసి నేను ఏదో పెద్ద భూకంపం వచ్చి కూలిపోయింది అనుకున్నాను. కానీ, ఇదే అసలు డిజైన్ అని తెలిసి షాక్ అవుతున్నాను” అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. “ఈ డిజైన్ చాలా బాగుంది. కానీ, అన్ కంఫర్టబుల్ గా అనిపిస్తోంది” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “అక్కడ హల్క్ ఎంప్లాయీగా ఉండవచ్చు. అందుకే ఆ ఆఫీస్ అలా అయిపోయింది” అని మరో వ్యక్తి ఫన్నీగా కామెంట్ చేశాడు. “బహుశ ప్రపంచంలో ఇలాంటి డిజైన్ మరెక్కడా ఉండి ఉండదు. ఈ ఆలోచన చేసిన మహానుభావుడికి ఓ దండం” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “నేను వండర్ గా ఫీలయ్యాను. కానీ, ఈ డిజైన్ కు ఎంత ఖర్చు అయ్యిందో తెలుసుకోవాలని ఉంది!” అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. “ ఈ డిజైన్ చేయడానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు అయి ఉండదు. ఎందుకంటే అది ఏఐ సృష్టి” అని మరో వ్యక్తి రిప్లై ఇచ్చాడు. “ఇలాంటి డిజైన్ కొత్తేం కాదు, పాలస్తీనా, గాజాలో ఆఫీస్ లు అన్నీ ఇలాగే ఉంటాయి” అని ఇంకొకరు కామెంట్ పెట్టారు. మొత్తంగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
Read Also: పాపం.. విమానం దిగే వరకు ఉగ్గబెట్టుకుని కూర్చున్న ప్రయాణీకులు.. అసలు ఏమైంది?