అమెరికా నుంచి ఇండియాకు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. విమానంలోని టాయిలెట్లు పని చేయకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టాయిలెట్స్ వచ్చిన వెళ్లే పరిస్థితి నానా అవస్థలు పడ్డారు. ప్రయాణీకులు ఇబ్బంది నేపథ్యంలో సుమారు 5 గంటల పాటు ప్రయాణించిన విమానం మళ్లీ వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన ఎయిర్ ఇండియా విమానంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
చికాగో నుంచి న్యూఢిల్లీకి బయల్దేరిన విమానం
ఈ నెల 6న ఎయిర్ ఇండియా విమానం చికాగో నుంచి విమానాశ్రయం నుంచి బయల్దేరింది. ఈ విమానం న్యూఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. విమానంలో మొత్తం 300 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఈ ఫ్లైట్ సుమారు 5 గంటల పాటు ప్రయాణించిన తర్వాత అకస్మాత్తుగా టాయిలెట్లు పని చేయడం మానేశాయి. మొత్తంగా 12 టాయిలెట్లలో ఏకంగా 11 టాయిలెట్లు చెడిపోయాయి. అంత మందికి ఒకే టాయిలెట్ ఉండటంతో చాలా మంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత మంది మరుగుదొడ్లు లేక అవస్థలు పడాల్సి వచ్చింది. ప్రయాణీకులంతా ఆందోళనకు దిగడంతో.. మరో ఆప్షన్ లేక విమానాన్ని వెనక్కి తిప్పారు. సుమారు 5 గంటల తర్వాత మళ్లీ ఆ విమానం చికాగో విమానాశ్రయానికి చేరుకుంది. మొత్తం 10 గంటల పాటు ప్రయాణీకులు చుక్కలు చూశారు.
ప్రయాణీకులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
చికాగో విమానాశ్రయంలో దిగిన ప్రయాణీకులకు విమానయాన సంస్థ వసతులు కల్పించింది. ప్రయాణీకులను వారి గమ్య స్థానాలకు చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పట్లు జరుగుతున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఇక విమానంలో ఆందోళన చేస్తున్న ప్రయాణీకులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మరుగు దొడ్లు సరిగా లేకపోతే ప్రయాణం ఎలా చేయాలని విమాన సిబ్బందిని నిలదీస్తూ కనిపించారు. వారి ప్రశ్నలకు సిబ్బంది ఎలాంటి సమాధానం ఇవ్వకుండా సైలెంట్ గా నిలబడి కనిపించారు.
🔥🚨BREAKING: An Air India flight was forced to return on a 10 hour trip to Chicago Illinois because their toilets were clogged with poop leaving hundreds Indians trapped on a plane with no restroom.
Air India Flight 126 was making its way over Greenland on March 5 when 11 out… pic.twitter.com/FhPfMBYgzU
— Dom Lucre | Breaker of Narratives (@dom_lucre) March 9, 2025
Read Also: భలే.. జస్ట్ వాయిస్ కమాండ్‌తో నచ్చిన సీటు బుక్ చేసుకోవచ్చు.. ఇదిగో ఇలా!
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
ప్రస్తుతం భారత్ లో ఉన్న విమానయాన సంస్థలలో ఎయిర్ ఇండియాకు మంచి పేరు ఉంది. అలాంటి విమానంలోనూ ఇలాంటి సమస్య తలెత్తడం పట్ల అందరూ షాక్ అవుతున్నారు. అదే సమయంలో ఒకేసారి 11 టాయిలెట్లు ఎలా పని చేయడం లేదంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో కావాలనే ఇలాంటి పరిస్థితి కల్పించారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని మరికొంత మంది డిమాండ్ చేస్తున్నారు. మరికొంత మంది నెటిజన్లు ప్రయాణీకులు పరిస్థితిపై సానుభూతి వ్యక్తం చేశారు. అన్ని గంటల పాటు టాయిలెట్ కు వెళ్లే పరిస్థితి లేక ఎంత అవస్థ పడ్డారో అని కామెంట్స్ పెట్టారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ అంతర్గత విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. త్వరలోనే నిజానిజాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: భలే.. ఈ పడవ వంతెనలా మారిపోతుంది, ఈ అద్భుతం ఎక్కడో తెలుసా?