Chahal-Dhanashree: ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champion Trophy 2025 Tournament ) గెలిచిన ఆనందంలో టీమిండియా ఫ్యాన్స్ అలాగే క్రీడాకారులు ఉంటే… ఇప్పుడు దేశవ్యాప్తంగా యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal ) గురించి అందరూ చర్చించుకుంటున్నారు. దీనికి ప్రత్యేక కారణం ఉంది. గత కొన్ని రోజులుగా టీమిండియా యంగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ , ఆయన భార్య ధనశ్రీ వర్మ ( Dhana Sree Varma ) ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీళ్ళ విడాకుల అంశం కోర్టు పరిధిలో ఉంది. 60 కోట్లు డిమాండ్ చేస్తోందని ధనశ్రీ వర్మపై అనేక ఆరోపణలు వస్తున్నాయి.
Also Read: Tobacco Alcohol Ban: IPLలో ఆ యాడ్స్ బ్యాన్ చేయండి… కేంద్రం కీలక ఆదేశాలు
అయితే ఇలాంటి నేపథ్యంలో… ఓ మిస్టరీ అమ్మాయితో… యుజ్వేంద్ర చాహల్ ప్రత్యక్షమయ్యాడు. చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరిగింది. అయితే ఈ దుబాయ్ మ్యాచ్ కు… ఓ మిస్టరీ అమ్మాయితో గ్రౌండ్ కు వచ్చాడు చాహల్. ఇద్దరు పక్కపక్కనే కూర్చుని మ్యాచ్ చూస్తూ.. తెగ ఎంజాయ్ చేశారు. ఇక ఆ మిస్టరీ అమ్మాయితో పాటు చాహల్ ఎంజాయ్ చేసిన మూమెంట్స్… సోషల్ మీడియాలో వైరల్ గా మారాలి.
ఫోటోలు అలాగే వీడియోలు కూడా… నిన్నటి నుంచి ట్రెండింగ్ లో ఉన్నాయి. అయితే ఈ వార్తలు తెగ ప్రచారం అవుతున్న నేపథ్యంలో… యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ స్పందించడం జరిగింది. చాహల్ కు మండిపోయేలా… పోస్ట్ పెట్టింది ధనశ్రీ వర్మ. మహిళను బ్లెం చేయడం ఫ్యాషన్ అయిపోయింది అంటూ… ఆమె సోషల్ మీడియా వేదికగా.. పెట్టిన పోస్ట్ వివాదంగా మారింది. మిస్టరీ అమ్మాయితో చాలా దిగిన వీడియోలు వైరల్ అయిన నేపథ్యంలోనే ఈ పోస్టు పెట్టినట్లుగానే స్పష్టమవుతుంది…. దీంతో ధన శ్రీ వర్మ ( Dhanashree Verma )పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also Read: Ravindra Jadeja: టీమిండియా విజయం వెనుక పుష్ప రాజ్ ?
ఇక ధనశ్రీ వర్మ చేసిన పోస్ట్ పై నేటిజన్స్ కూడా అభ్యున్నంగా స్పందిస్తున్నారు. ఓ కొరియోగ్రాఫర్ తో నువ్వు తిరిగినప్పుడు… చాహల్ కు మండ లేదా ? ఇప్పుడు చాహల్ తిరిగితే నీకేంటి నొప్పి అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ధనశ్రీ వర్మ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు. విడాకుల అంశం మనకైతే తెలియదు కానీ… అధికారికంగా విడాకులు తీసుకోకముందు మరో అమ్మాయితో చాహల్ తిరగడం కూడా తప్పే అని ధనశ్రీ వర్మ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు కొంతమంది నేటిజన్స్. కాగా… చాహల్ అలాగే ధనశ్రీ వర్మ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో.. ఉందని సమాచారం అందుతోంది. అయితే విడాకులు కావాలని ధనశ్రీ వర్మ పదేపదే కోరుతోందట. విడాకులు తనక ఇష్టం లేదని చాహల్.. చెబుతున్నారట. విడాకులు మంజూరు అయితే 60 కోట్ల వరకు ధనశ్రీ వర్మకు.. చాహల్ ఇవ్వాల్సి ఉంటుందని కూడా నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా చాహల్ తో దుబాయ్ కి వెళ్లిన మిస్టరీ లేడీ రాజ్ మహ్వాష్ అని తెలుస్తోంది.