BigTV English

Old Man Viral Video: ముసలోడే కానీ మామూలోడు కాదు.. జస్ట్ మిస్.. ముసలోడి ఆధార్ కార్డ్ చిరిగిపోయేది!

Old Man Viral Video: ముసలోడే కానీ మామూలోడు కాదు.. జస్ట్ మిస్.. ముసలోడి ఆధార్ కార్డ్ చిరిగిపోయేది!

Old Man Escaped Vande Bharat Express: వందే భారత్.. దేశంలో అత్యంత వేగవంతంగా ప్రయాణించే రైలు. ఈ రైలు ఎంత వేగంగా ప్రయాణిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జెట్ స్పీడ్‌తో ప్రయాణించే వందే భారత్ రైళ్లను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చారు. ఈ రైళ్ల విషయంలో రైల్వే శాఖ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.


ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అక్కడక్కడ కొన్ని రకాల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కేరళలో అటువంటి ఘటనే ఒకటి వెలగుచూసింది. ఓ వృద్ధుడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More: ప్రపంచంలోనే అతిపెద్ద పాము.. వీడియో వైరల్..!


కేరళలలోని తిరువనంతపురం నుంచి కాసర్ గాడ్‌కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్తోంది. ఈ రెండు స్టేషన్ల మధ్యలో తిరువూరు రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడ ఆ రైలుకు హాల్ట్ లేదు. దీంతో రైలు వేగంతో దూసుకెళ్తోంది. 110 కిలో మీటర్ల వేగంతో స్టేషన్ దాటుతోంది.

ఈ క్రమంలో స్టేషన్ వద్ద ఓ వృద్ధుడు పట్టాలు దాటేశాడు. ఒకటో నంబర్ ఫ్లాట్‌ఫామ్ చేరుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే వందే భారత్ రైలు స్టేషన్‌లోకి ప్రవేశించింది. వాయు వేగంతో దూసుకొస్తున్న రైలును సెకండ్ల వ్యవధిలో ఆ వృద్ధుడు దాటి ప్రాణాలను దక్కించుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు చక్కెర్లు కొడుతోంది.

Read More: బాప్రే విమానంలో దూరిన పాము.. చాకచక్యంగా పట్టుకున్న వ్యక్తి!

అయితే ఆ వృద్ధుడు రైలు పట్టాలు దాటే క్రమంలో స్టేషన్లో ఉన్న ప్రయాణికులు, రైల్వే ఉద్యోగులు ఆందోళన చెందారు. ప్రమాదం నుంచి ప్రాణాలు దక్కించుకున్న ఆ వృద్ధుడ్ని చూసి ఆశ్చర్యపోయారు. అనంతరం వృద్ధుడికి స్టేషన్ సిబ్బంది చివాట్లు పెట్టారు. కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో ఆందోళనకు గురయ్యారు.

Related News

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Shocking News: షాకింగ్.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Big Stories

×