BigTV English

Snake in Plane: బాప్రే విమానంలో దూరిన పాము.. చాకచక్యంగా పట్టుకున్న వ్యక్తి!

Snake in Plane: బాప్రే విమానంలో దూరిన పాము.. చాకచక్యంగా పట్టుకున్న వ్యక్తి!

Snake in Plane: థాయ్ రాజధాని బ్యాంకాక్ నుంచి ఫూకెట్ వేళ్లేందుకు ఎయిర్‌ఏషియా సంస్థకు చెందిన విమానం టెకాఫ్ అయ్యింది. ప్రయాణికులు ఎవరి సీట్లలో వారు హాయిగా కుర్చొని జర్నీని ఆశ్వాధిస్తున్నారు. ఇంతలోనే విమానం ఓవర్‌హెడ్ లగేజీ బిన్‌లో కొందరు ప్రయాణికులు పామును గుర్తించారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది.


ఈ ఘటనకు సంబంధించిన వీడోయో సోషల్ మీడియలో చక్కెర్లు కొడుతోంది. చిన్నపాము లగేజీ కంపార్ట్‌మెంట్‌ను అంటుకొని పాకుతూ వెళుతోంది. ఒక ఫ్లైట్ అడెంటర్ పామును పట్టుకునే ప్రయత్నంలో భాగంగా.. ఒక బాటిల్‌లో బంధించాలని ప్రయత్నించాడు. కానీ పాము తెలివిగా తప్పించుకుంది. తర్వాత చిన్న సంచిని పట్టుకొని బాటిల్‌తో పామును సంచి లోపల పడేలా చేశాడు.

Read More: ఒంటిచేత్తో పామును పట్టేసింది భయ్యా..!


ఈ ఘటనపై థాయ్‌లాండ్ కొర్పొరేట్ సేఫ్టీ హెడ్ ఫోల్ పూమ్ పుయాంగ్ మాట్లాడుతూ.. ఇది చాలా అరుదైన సంఘటన అని అన్నారు. ల్యాండింగ్‌కు ముందు ఫ్లైట్‌లో పాము ఉన్నట్లుగా భద్రత సిబ్బంది గుర్తించారని తెలిపారు. ప్రయాణికులు భద్రత విషయంలో ఎయిర్ ఏషియా సంస్థ రాజీపడదని పేర్కొన్నారు.

ఎయిర్ ఏషియా సంస్థ కూడా ఈ ఘటనను ధృవీకరించింది. బ్యాంకాక్‌లోని డాన్ యమాంగ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి బయలుదేరిన FD3015 ఫ్లైట్‌లో పాము కనిపించిన సంఘటన తమకు తెలిసిందని తెలిపింది. స్పందించిన ఇంజనీరింగ్ అధికారులు వేంటనే ఫ్లట్‌ను తనిఖీ చేశారని వెల్లడించింది.

యుఎస్‌లోని ఓ వార్త సంస్థ కథనం ప్రకారం.. ఎయిర్ ఏషియా విమానంలో ఇది వరకే పాము కనింపిచిన ఘటన జరిగింది. కౌలాలంపూర్ నుండి సబాకు వెళ్తున్న ఫ్టైట్‌లో మచ్చల కొండచిలువ కనిపించింది. అప్పుడు ఎయిర్ ఏషియా విమానాన్ని విమానాశ్రయం నుంచి వెనక్కి పంపించారు.

Read More: ఆ స్నేక్.. శృంగారం తర్వాత మగ పామును చంపేస్తుంది.. !

ఈ వీడియో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్‌లో వైరల్ అవుతోంది. ఆథర్ మోర్గానే అనే ఎక్స్ ఖాతా నుంచి అప్లోడ్ అయింది. దాదాపుగా 3 వేలకు మందికి పైగా ఈ వీడియోను చూశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు.. పాపం పాముకు ఒక సీట్ ఇస్తే సరిపోద్ది కాదా అని ఫన్నీగా కామెంట్లు చేస్తే.. మరికొందరమే వేలు రూపాయలు ఖర్చుబెట్టి ఫ్లైట్ ఎక్కితే ప్రయాణికులకు ఇచ్చే భద్రతా ఇదా అని ప్రశ్నిస్తున్నారు.

Related News

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Viral Video: మూడో అంతస్తు మీద నుంచి పడిపోయాడు.. ఆ తర్వాత మీరు నమ్మలేనిది జరిగింది!

Big Stories

×