Puri Jagannath Temple Row: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరి జగన్నాథ ఆలయ ప్రాంగణంలో అపచారం జరిగింది. స్వామివారి మహా ప్రసాదాన్ని ఓ కుటుంబం డైనింగ్ టేబుల్ మీద కూర్చొని స్వీకరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో కాసేపట్లోనే తీవ్ర దుమారం రేపింది. భక్తులు స్వామి వారి ప్రసాదాన్ని నేల మీద కూర్చొని స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, తొలిసారి ఇందుకు విరుద్ధంగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
తాజాగా సుమారు 10 మందితో కూడిన ఓ కుటుంబం జగన్నాథుడిని దర్శించుకన్నారు. అనంతరం పిల్లలతో కలిసి వాళ్లంతా ఓ బీచ్ రిసార్ట్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు. వారికి ఓ పూజారి మహా ప్రసాదాన్ని వడ్డిస్తున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన ఓ వ్యక్తి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ప్రసాదం తినడం ఏంటని ప్రశ్నించారు. అయితే, తాము పర్మీషన్ తీసుకున్న తర్వాతే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ప్రసాదాన్ని స్వీకరిస్తున్నామని ఓ మహిళ సమాధానం ఇచ్చింది. అయితే, మీకు ఎవరు పర్మీషన్ ఇచ్చారో చెప్పాలని ఆయన ప్రశ్నించాడు, ఈ పద్దతి సరికాదని ఆయన పూజారిని కూడా నిలదీశారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాసేపట్లోనే నెట్టింట తెగ వైరల్ అయ్యింది.
ଭିଡ଼ିଓ ରେ ଦେଖନ୍ତୁ ସେ ହୋଟେଲର କର୍ମଚାରୀ ମନା କରିବା ସତ୍ତ୍ବେ ସେମାନେ କିପରି ଡାଇନିଂ ଟେବୁଲ ଉପେର ମହାପ୍ରସାଦ ବାଢ଼ି ଗୋଡ଼ ହଲେଇ ମୋବାଇଲ ଚଲାଇ ପାଉଛନ୍ତି..ଆଉ ତହୁଁ ବଡ଼ ସେ ବ୍ରାହ୍ମଣ ମହାଶୟ ଯିଏ ମହାପ୍ରସାଦ ତାଙ୍କୁ ବାଢ଼ିକି ଦେଇଛନ୍ତି।ଆଉ ସେ ଦାଢ଼ିଆ ବାବା ସବୁ ଦେଖି ମଧ୍ଯ ଚୁପ ହୋଇ ଠିଆ ହୋଇଛନ୍ତି।ଦୋଷ କାହାକୁ ଦେବେ? pic.twitter.com/ktH4KLpTkd
— 🦋šrαdhα🦋 (@princess_sradha) May 16, 2025
కీలక ప్రకటన చేసిన పూరి ఆలయ కమిటీ
ఈ వివాదానికి సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు జగన్నాథ ఆలయ కమిటీ కూడా ఈ వివాదంపై స్పందించింది. స్వామివారి మహా ప్రసాదాన్ని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని స్వీకరించడం సంప్రదాయ విరుద్ధమని తేల్చి చెప్పింది. “స్వామివారి మహాప్రసాదం పరబ్రహ్మ స్వరూపంతో సమానంగా పూజించబడుతుంది. ఈ ప్రసాదాన్ని ఎవరైనా భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా వస్తోంది. భక్తులు ఎవరూ సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరించకూడదు. ఎవరైనా నేల మీదే కూర్చొని తినాలను కోరుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ టేబుల్ మీద కూర్చొని తినకూడదు. ఇలా చేయడం సంప్రదాయానికి భంగం కలిగించడమే అవుతుంది” అని వెల్లడించింది.
— Shree Jagannatha Temple Office, Puri (@SJTA_Puri) May 17, 2025
Read Also: బట్టతలపై వెంట్రుకలు.. ఇద్దరి ప్రాణం తీసిన హెయిర్ ట్రాన్స్ ప్లాంట్!
పూరిలోని హోటళ్లు ఆలయ అధికారు సూచనలు
అటు భక్తుల మనోభావాలను, మత విశ్వాసాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ఆలయ కమిటీ ప్రకటించింది. హోటళ్లు కూడా తమ అతిథులకు ఇలాంటి విషయాలను చెప్పాలని సూచించింది. శతాబ్దాల నాటి ఆలయ సంప్రదాయాలను కాపాడాలని భక్తులకు విజ్ఞప్తి చేసింది. ఇకపై స్వామివారి గౌరవానికి, ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాంటి పరిస్థితి తీసుకురాకుండా ఉండేలా భక్తులు జాగ్రత్తగా ఉండాలని, సంప్రదాయబద్దంగా నడుచుకోవాలని సూచించింది.
Read Also: ఊళ్లోకి వచ్చిన సింహాన్ని పట్టుకొని కట్టేసిన గ్రామస్తులు, నెట్టింట వీడియో వైరల్!