OTT Movie : సైన్స్ ఫిక్షన్ జోనర్లో వచ్చే సినిమాలు డిఫెరెంట్ గా ఉంటాయి. ఆ లొకేషన్స్, విజువల్స్ మరో ప్రపంచంలో ఉన్నామా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, స్పేస్ లో ఉండే ఒక ఆస్ట్రోనాట్ భార్య గురించే తలచుకుంటాడు. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ లా అనిపించినా, ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఓ వైపు అడ్వెంచర్ సన్నివేశాలు సాగుతుంటే, మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ నడుస్తుంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
జాకుబ్ చెక్ రిపబ్లిక్‌కు చెందిన మొదటి ఆస్ట్రోనాట్. అతను బృహస్పతి గ్రహానికి దగ్గరలో ఉన్న ‘చోప్రా’ అనే అంతరిక్ష ధూళి మేఘాన్ని పరిశోధించడానికి, ఎనిమిది నెలల పాటు ఈ మిషన్‌లో ఒంటరిగా ఉంటాడు. ఈ మిషన్‌లో జాకుబ్ ఒంటరితనంతో పోరాడుతూ, తన భార్య లెంకా జ్ఞాపకాలతో బాధపడుతుంటాడు. అయితే లెంకా అతనితో విడిపోతున్నానని ఒక సందేశం పంపుతుంది. ఆమె అతన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటుంది. కానీ ఆ సందేశం జాకుబ్ వరకూ వెళ్ళకుండా ఒక అధికారి అడ్డుకుంటాడు. ఈ విషయం అతని పనికి ఆటంకం కలిగిస్తుందేమో అని అలా చేస్తాడు. ఈ సమయంలో, జాకుబ్‌కు ఒక భారీ సాలీడు రూపంలో ఉన్న గ్రహాంతర జీవి కనిపిస్తుంది. వీళ్లిద్దరికి మంచి స్నేహం ఏర్పడుతుంది. జాకుబ్‌కు చెందిన జ్ఞాపకాలను ఆ సాలీడు చూడగలుగుతుంది.
సాలీడు ఒక థెరపిస్ట్‌లా పనిచేస్తూ, జాకుబ్‌కు తన వివాహంలో చేసిన తప్పులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఆ తరువాత జాకుబ్ చోప్రా మేఘంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ అతను తన జీవితంలోని ముఖ్యమైన క్షణాలను మళ్లీ అనుభవిస్తాడు. భార్యతో జరిగిన ప్రయాణాన్ని,తొలి ముద్దు అనుభవాన్ని తలుచుకుంటాడు. ఆమెతో జీవితమే తనకు ముఖ్యమని అతనికి అనిపిస్తుంది. ఇక జాకుబ్ కు పెళ్ళాం గురించి జ్ఞానోదయం అవ్వడంతో, ఆ గ్రహాంతర వాసి అదృశ్యం అవుతాడు. చివరికి జాకుబ్ భూమి పైకి తిరిగి వస్తాడా ? తన భార్యతో సంసారం చేస్తాడా ? భార్య విడాకులే కావాలంటుందా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : సీను సీనుకో ట్విస్ట్ … సైలెన్స్ తో వైలెన్స్ పెంచే మూవీ… ఈ థ్రిల్లర్ని ఊపిరి బిగబట్టి చూడాల్సిందే
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘స్పేస్‌మ్యాన్’ (Spaceman). 2024 లో వచ్చిన ఈ మూవీకి జోహన్ రెన్క్ దర్శకత్వం వహించాడు. ఇది జరోస్లావ్ కల్ఫార్ రాసిన ‘స్పేస్‌మ్యాన్ ఆఫ్ బొహీమియా’అనే నవల ఆధారంగా రూపొందింది. ఈ స్టోరీ సౌర వ్యవస్థలో పరిశోధన నిమిత్తం స్పేస్ కి పంపిన ఒక వ్యోమగామి చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఆడమ్ శాండ్లర్, కేరీ మల్లిగన్, పాల్ డానో, కునాల్ నయ్యర్, లీనా ఓలిన్, ఇసాబెల్లా రోసెల్లినీ వంటి నటులు నటించారు. నెట్ ఫ్లిక్స్ (Netflix) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.