తరచుగా అటవీ జంతువులు గ్రామాల్లో వస్తుంటాయి. పులులు, సింహాలు, చిరుతలు, ఎలుగు బంట్లు దారితప్పి ఊళ్లోకి అడుగు పెడతాయి. పశువులను తింటూ జనాలను భయాందోళనకు గురి చేస్తాయి. కొన్నిసార్లు మనుషుల మీద దాడి చేసిన సందర్భాలున్నాయి. ఊళ్లోకి క్రూర జంతువులు వచ్చాయంటే.. ఎప్పుడు? ఎలా? తమ మీద దాడి చేస్తాయోనని భయంతో వణికిపోతారు. అటవీశాఖ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసి వాటిని పట్టుకునే వరకు ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని భయం భయంగా గడుపుతారు. వాటిని పట్టుకున్నాక రిలాక్స్ అవుతారు.
సింహాన్ని పట్టుకొని కట్టేసిన గ్రామస్తులు
ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ వింటే ఆశ్చర్యం కలుగుతుంది. తాజాగా గుజరాత్ లోని ఓ చిన్న గ్రామంలోకి సింహం వచ్చింది. చూడ్డానికి చాలా పెద్దిగా ఉంది. కానీ, వయసు మీద పడటంతో బలహీనంగా మారింది. చేతకాని స్థితిలో ఉంది. తొలుత ఈ సింహాన్ని చూసి గ్రామస్తులు భయపడినా, ఆ తర్వాత ధైర్యం తెచ్చుకున్నారు. పైగా అనారోగ్యంతో బలహీనంగా ఉండటంతో జనాల మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేయలేదు. అందరూ కలిసి ఆ సింహాన్ని పట్టుకున్నారు. ఓ ఇంటి దగ్గర గొలుసు పెట్టి కట్టేశారు. అయితే, ఆ సింహం బలం లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అలాగే ఉండిపోయింది.
పెంపుడు జంతువులా ఆటలాడుతున్న పిల్లలు
ఇక సింహం ఎవరినీ ఏం అనకపోవడంతో పిల్లలు దానితో ఆడుకుంటున్నారు. ఏకంగా దాని తోక పట్టుకుని అటూ ఇటూ గుంజుతున్నారు. చేతకాని స్థితిలో ఉన్న ఆ సింహం, ఎవరు ఏమన్నా పట్టించుకోవడం లేదు. తాజాగా ఈ సింహంతో పిల్లలు ఆడుకుంటుండగా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read Also: బట్టతలపై వెంట్రుకలు.. ఇద్దరి ప్రాణం తీసిన హెయిర్ ట్రాన్స్ ప్లాంట్!
నెటిజన్లు ఎలా రియాక్ట్ అవుతున్నారంటే?
ఈ వీడియో కాసేపట్లోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు కొంత మంది ఫన్నీగా కామెంట్స్ పెడుతుంటే, మరికొంత మంది సింహం పరిస్థితిని చూసి జాలిపడుతున్నారు. వయసు పెరిగి చావుకు దగ్గర అయిన సింహాన్ని ఇబ్బంది పెట్టకుండా, వెంటనే అటవీశాఖ అధికారులకు అప్పగించాలని కోరుతున్నారు. పిల్లలను సింహం దగ్గరికి వెళ్లనివ్వడం మంచిది కాదు. ఒకవేళ అది తిరగబడితే పిల్లల ప్రాణాలకే ప్రమాదం అని మరికొంత మంది నెటిజన్లు సూచిస్తున్నారు. క్రూర జంతువుల ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఎంత చేతకాని సింహం అయినా ఒక్కోసారి తన జూలు విదిల్చే అవకాశం ఉంటుందంటున్నారు. వెంటనే, ఆ సింహాన్ని తీసుకెళ్లి జూలో ఉంచాని అటవీశాఖ అధికారులకు సూచిస్తున్నారు మరికొంత మంది నెటిజన్లు. అటు ఈ ఘటనపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: బాంబులా పేలిన టాయిలెట్ సీట్.. యువకుడు స్పాట్ లోనే!