E-Paper
Advertisement

Gemini AI: అంత బద్దకం ఎందుకు? జెమినీ AI శారీ ట్రెండ్‌పై టాటా ఫ్రెండ్ శాంతను నాయుడు సెటైర్!

Gemini AI: అంత బద్దకం ఎందుకు? జెమినీ AI శారీ ట్రెండ్‌పై టాటా ఫ్రెండ్ శాంతను నాయుడు సెటైర్!
Advertisement

Shantanu Naidu On Gemini AI:

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జెమిని ఏఐ శారీ ఫోటోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరూ చక్కటి చీరలో కనువిందు చేస్తున్నారు. నానో బనానా త్రీడీ ఫోటోలతో పాటు శారీ ఫోటో ఎడిటింగ్ టూల్ కూడా నెటిజన్లు విపరీతంగా యూజ్ చేయడం మొదలుపెట్టారు. వినియోగదారులు తమ రోజువారీ ఫోటోలను వాళ్లకు నచ్చినట్లు మార్చుకు ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లిలో పట్టు శారీ, బెనారస్ శారీ, బాలీవుడు ఫాంటసీ స్టైల్ శారీ అంటూ రకరకాలుగా తమ ఫోటోలను మార్చుకుంటున్నారు. జెమిని AI మోడల్‌ ను ఉపయోగించి అందమైన ఫోటోలను క్రియేట్ చేసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. గూగుల్ జెమినీ వినియోగదారులు తమ సెల్ఫీలను చిఫ్ఫోన్ చీరలు, అద్భుతమైన బ్యాక్‌ డ్రాప్‌లతో అద్భుతమైన పోర్ట్రెయిట్‌లుగా మార్చుకుంటున్నారు.

AI శారీ ట్రెండ్‌పై శాంతను నాయుడు ఫన్నీ కామెంట్స్

జెమినీ AI శారీ ట్రెండ్‌పై దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా మేనేజర్‌గా పనిచేసిన శాంతను నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఇన్ స్టా వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. ఇండియాలో నివసిస్తున్న వాళ్లు చీరల ఫోటోలను టూల్ సాయంతో ఎడిట్ చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. “మీరు ఇండియాలో ఉంటున్నారు. అమెరికాలో ఉండటం లేదు. ఇండియాను ‘ల్యాండ్ ఆఫ్ ది శారీ’ అంటారు. ఒక్కో మహిళకు సంబంధించి కనీసం అల్మారాలో 15 చీరలు ఉంటాయి. వాటిని కట్టుకుని చక్కగా ఫోటోలు దిగక, AI నుంచి శారీ ఫోటోలను జెనరేట్ చేసుకుంటున్నారు. వామ్మో ఎంత బద్దకంగా మారిపోయారో జనాలు. మీరో మీ సొంత శారీలో ఫోటోలు దిగండి, ఇంకా అందంగా ఉంటారు” అంటూ వీడియోను షేర్ చేశారు.

Advertisement

Read Also: జెమిని AI శారీ ఫోటో ట్రెండ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్!

సోషల్ మీడియాలో శాంతను వీడియో వైరల్

Advertisement

శాంతను AI శారీ ట్రెండ్‌ గురించి చేసిన కామెంట్స్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “నేను ఫన్నీగా మాట్లాడుతున్నాను” అంటూ ఆ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు. “నా మనసులోనూ ఇదే ఉంది. ప్రతి మహిళ దగ్గర చక్కటి చీరలు ఉన్నాయి. వాటిని కట్టుకుని దిగితే మంచి ఫోటోలు వస్తాయి. అలాంటప్పుడు AI టూల్ లో శారీ ఫోటోలు క్రియేట్ చేసుకోవడం ఏంటో?” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “అందరి మనసులో మాట శాంతను బ్రో చెప్పేశాడు. ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు” అని ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు. మరికొంత మంది నెటిజన్లు శాంతను మాట్లాడి హిందీ స్లాంగ్ గురించి కూడా ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది ఆయన మాట్లాడిన విధానం చాలా క్యూట్ గా ఉందని మెచ్చుకుంటున్నారు.

Read Also: బొమ్మల షాపులో దొంగ మకాం.. ఆరు నెలలు అక్కడే తిష్ట వేసినా కనిపెట్టలేకపోయిన సిబ్బంది!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×