OTT Movie : ఓటీటీ లో మలయాళం సినిమాలకి ఇప్పుడు డిమాండ్ బాగా నడుస్తోంది. మంచి కథలను చక్కగా ప్రజెంట్ చేయడంలో, మలయాళం దర్శకులు ఒక అడుగు ముందే ఉన్నారు. గత ఏడాది కామెడీ డ్రామాతో తెరకెక్కిన ఒక మలయాళం మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో బీజు మీనన్ తన సహజ శైలి నటనతో మరోసారి ఆకట్టుకున్నారు. సీరియస్ గా ఉండాల్సిన పోలీస్ పాత్రలో, అమాయక చక్రవర్తిలా పేరు తెచ్చుకుంటాడు. చివరివరకు సరదాగా సాగిపోయే ఈ మలయాళ కామెడీ డ్రామా మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే…
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
ఈ మలయాళ కామెడీ డ్రామా మూవీ పేరు ‘తుండు’ (Thundu). 2024 లో వచ్చిన ఈ మూవీకి రియాస్ షెరీఫ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బిజు మీనన్ ప్రధాన పాత్రలో నటించారు. అతనితో పాటు షైన్ టామ్ చాకో, ఉన్నిమాయ ప్రసాద్ వంటి నటులు సహాయక పాత్రల్లో కనిపిస్తారు. ఈ మూవీ ఒక పోలీస్ కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతుంది. అతను తన కెరీర్‌లో ప్రమోషన్ కోసం, పరీక్షల్లో కాపీ కొట్టి ఊహించని సమస్యల్లో చిక్కుకుంటాడు. ఈ మలయాళ కామెడీ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
బేబీ అనే పోలీస్ కానిస్టేబుల్ తన ఉద్యోగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందాలని ఆశిస్తాడు. అతను తన సహోద్యోగి షిబిన్ నుండి వచ్చే అవమానాలను భరించలేక, పరీక్ష రాసి పదోన్నతి సాధించాలని నిర్ణయించుకుంటాడు. ప్రమోషన్ వచ్చాక అతని పై పెత్తనం చేయాలని అనుకుంటాడు. అయితే బేబీకి ఈ పరీక్షలంటే భయం. ఈ క్రమంలో తన కొడుకును పరీక్షల్లో కాపీ కొట్టినందుకు మందలించిన అతను, హాస్యాస్పదంగా తాను కూడా అదే మార్గాన్ని ఎంచుకుంటాడు. చిట్టీలు ఉపయోగించి, కాపీ కొట్టడం ద్వారా ప్రమోషన్ కి పెట్టే పరీక్షల్లో పాస్ అవ్వాలనుకుంటాడు. కథ అంతా బేబీ ఈ పరీక్షలో విజయం సాధిస్తాడా లేదా అనే ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. అతని ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటాయి. అతను మరిన్ని ఇబ్బందుల్లో పడతాడు. అక్కడ అధికారులు అతనికి కొన్ని పనీష్మెంట్ లు కూడా ఇస్తారు.
ఈ సంఘటనలన్నీ కామెడీతో కడుపుబ్బ నవిఇస్తాయి. చివరికి, బేబీ తన పదోన్నతి పరీక్షను చిట్టీలు పెట్టి పాస్ అవుతాడా ? సీనియారిటీ ఆధారంగా సాధిస్తాడా ? అతని సహోద్యోగి నుంచి ఎటువంటి సమస్యలు ఎదుర్కుంటాడు ? ఈ విషయాలను సినిమాను చూసి తెలుసుకోండి. ఈ సినిమాలో బేబీ అమాయకత్వం ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేస్తాయి. పరీక్షల్లో కాపీ కొట్టడం వంటి సున్నిత అంశాన్ని దర్శకుడు కామెడీ గా చూపించారు. బిజు మీనన్ తన సహజమైన నటనతో బేబీ పాత్రకు జీవం పోశాడు. ఈ సినిమా 2024 ఫిబ్రవరి 16న థియేటర్లలో విడుదలైంది. మలయాళంలోనే థియేట్రికల్ రిలీజ్ అయినప్పటికీ, OTTలో మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది.