Indian Railways: భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పంబన్ బ్రిడ్జి ప్రారంభం అయ్యింది. ప్రధాని నరేంద్రమోడీ శ్రీరామ నవమి శుభ సందర్భంగా ఈ వంతెనను జాతికి అంకితం చేశారు. దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సీ వంతెనను ఏప్రిల్ 6న మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభించారు. ఈ వంతెన ప్రారంభంతో రామేశ్వరం ద్వీపాన్ని దేశంలోని వివిధ ప్రాంతాలతో అనుసంధానించేందుకు పలు రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు భారతీయ రైల్వే వెల్లడించింది. ఈ మేరకు మొత్తం 11 నగరాలను కలిపే 28 రైళ్లను ప్రకటించింది. ప్రయాణీకులకు మరింత సజావుగా, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఈ రైళ్లు ఉపయోగపడనున్నాయి.
11 నగరాలను కలిపే 28 రైళ్లు
రామేశ్వరం రైల్వే స్టేషన్ దక్షిణ రైల్వే (SR) జోన్ పరిధిలో ఉంది. భారతీయ రైల్వే సంస్థ అయోధ్య, బనారస్, భువనేశ్వర్, తిరుచ్చిరాపల్లి జంక్షన్, తిరుపతి, చెన్నై ఎగ్మోర్, కోయంబత్తూర్, ఓఖా, కన్యాకుమారి, మధురై, ఫిరోజ్ పూర్ సహా 11 నగరాల నుంచి 28 రైళ్లను ప్రకటించింది. ఇంతకీ పంబన్ బ్రిడ్జి మీది నుంచి రాకపోకలు కొనసాగించే రైళ్లు ఏవి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Prime Minister @narendramodi inaugurates the new Pamban Rail Bridge in Rameswaram, India’s first vertical lift sea bridge
🔹The Bridge, linking Rameswaram to the mainland, stands as a remarkable feat of Indian engineering on the global stage
🔹2.08 km in length, it features 99… pic.twitter.com/2LbMayMUF1
— PIB India (@PIB_India) April 6, 2025
Read Also: వందే భారత్ లోకో పైలట్ జీతం ఎంత? ఆ ఉద్యోగానికి కావల్సిన అర్హతలేంటీ?
⦿ రైలు నంబర్ 22613- రామేశ్వరం- అయోధ్య శ్రద్దా ఎక్స్‌ప్రెస్
⦿ రైలు నంబర్ 22614- అయోధ్య- రామేశ్వరం శ్రద్దా ఎక్స్‌ప్రెస్
⦿ రైలు నంబర్ 22535- రామేశ్వరం- బనారస్ ఎక్స్‌ప్రెస్
⦿ రైలు నంబర్ 22536- బనారస్- రామేశ్వరం ఎక్స్‌ప్రెస్
⦿ రైలు నంబర్ 20850 రామేశ్వరం- భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్
⦿ రైలు నంబర్ 20849- భువనేశ్వర్- రామేశ్వరం ఎక్స్‌ప్రెస్
⦿ రైలు నంబర్ 16850- రామేశ్వరం- తిరుచ్చిరాపల్లి జంక్షన్ ఎక్స్‌ప్రెస్
⦿ రైలు నంబర్ 16849- తిరుచ్చిరాపల్లి జంక్షన్- రామేశ్వరం ఎక్స్‌ప్రెస్
⦿ రైలు నంబర్ 16780- రామేశ్వరం- తిరుపతి ఎక్స్‌ప్రెస్
⦿ రైలు నంబర్ 16779 తిరుపతి- రామేశ్వరం ఎక్స్‌ప్రెస్
Read Also: వేసవిలోనూ మంచు కురిసే ప్రాంతం.. రోహ్ తంగ్ పాస్ కు వెళ్లడానికి బెస్ట్ టైం ఇదే!
⦿ రైలు నంబర్ 16752- రామేశ్వరం- చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్
⦿ రైలు నంబర్ 16751- చెన్నై ఎగ్మోర్- రామేశ్వరం ఎక్స్‌ప్రెస్
⦿ రైలు నంబర్ 16617- రామేశ్వరం-కోయంబత్తూరు ఎక్స్‌ప్రెస్
⦿ రైలు నంబర్ 16618- కోయంబత్తూర్- రామేశ్వరం ఎక్స్‌ప్రెస్
⦿ రైలు నంబర్ 22662- రామేశ్వరం- చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్
⦿ రైలు నంబర్ 22661- చెన్నై ఎగ్మోర్- రామేశ్వరం ఎక్స్‌ప్రెస్
⦿ రైలు నంబర్ 22621- రామేశ్వరం- కన్యాకుమారి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
⦿ రైలు నంబర్ 22622- కన్యాకుమారి- రామేశ్వరం సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
⦿ రైలు నంబర్ 16733- రామేశ్వరం- ఓఖా ఎక్స్‌ప్రెస్
⦿ రైలు నంబర్ 16734- ఓఖా- రామేశ్వరం ఎక్స్‌ప్రెస్
⦿ రైలు నంబర్ 20497- రామేశ్వరం-ఫిరోజ్ పూర్ హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్
⦿ రైలు నంబర్ 20498- ఫిరోజ్‌పూర్- రామేశ్వరం హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్
⦿ రైలు నంబర్ 56712- రామేశ్వరం-మధురై ప్యాసింజర్
⦿ రైలు నంబర్ 56711- మధురై- రామేశ్వరం ప్యాసింజర్
⦿ రైలు నంబర్ 56714- రామేశ్వరం-మధురై ప్యాసింజర్
⦿ రైలు నంబర్ 56713- మధురై-రామేశ్వరం ప్యాసింజర్
⦿ రైలు నంబర్ 56716- రామేశ్వరం- మధురై ప్యాసింజర్
⦿ రైలు నంబర్ 56715- మధురై- రామేశ్వరం ప్యాసింజర్
Read Also: IRCTC నార్త్ ఈస్ట్ స్పెషల్ టూర్.. 33 శాతం డిస్కౌంట్ తో 5 రాష్ట్రాలు కవర్!