Secunderabad Railway Station Latest News: సౌత్ ఇండియాలోనే టాప్ అతిపెద్ద రైల్వే స్టేషన్లలో ఒకటిగా కొనసాగుతోంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సుమారు 150 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ రైల్వే స్టేషన్ ను పూర్తి స్థాయిలో కూల్చివేసి, అత్యాధునిక హంగులతో పునర్నిస్తోంది రైల్వేశాఖ. సుమారు రూ. 720 కోట్లతో శరవేగంగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పనులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. ఇక్కడి నుంచి నడిచే పలు రైళ్లను హైదరాబాద్ లోని ఇతర రైల్వే స్టేషన్లకు షిఫ్ట్ చేశారు. తాజాగా మరో 20 రైళ్లను ఇతర స్టేషన్ల నుంచి నడిపించాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ రైళ్లు చర్లపల్లి, కాచిగూడ సహా ఇతర స్టేషన్ల నుంచి రాకపోకలు కొనసాగించనున్నాయి.
సికింద్రాబాద్ నుంచి ఇతర స్టేషన్లకు మార్చిన రైళ్ల వివరాలు:
కాచిగూడకు మళ్లించిన రైళ్లు
⦿ రైలు నంబర్ 12713- విజయవాడ – సికింద్రాబాద్ శాతవాహన ఎక్స్ ప్రెస్
⦿ రైలు నంబర్ 12714- సికింద్రాబాద్ – విజయవాడ శాతవాహన ఎక్స్ ప్రెస్
ఉమ్దానగర్ కు మళ్లించిన రైళ్లు
⦿ రైలు నంబర్ 20968- పోర్‌బందర్ – సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్
⦿ రైలు నంబర్ 20967- సికింద్రాబాద్ – పోర్‌బందర్ ఎక్స్ ప్రెస్
మల్కాజ్‌గిరికి మళ్లించిన రైళ్లు
⦿ రైలు నంబర్ 77656- సిద్దిపేట – సికింద్రాబాద్ డెము
⦿ రైలు నంబర్ 77653- సికింద్రాబాద్ – సిద్దిపేట డెము
⦿ రైలు నంబర్ 77654- సిద్దిపేట – సికింద్రాబాద్ మల్కాజ్‌గిరి
⦿ రైలు నంబర్ 77655- సికింద్రాబాద్ – సిద్దిపేట డెము
హైదరాబాద్ టెర్మినల్‌కు మళ్లించిన రైళ్లు
⦿ రైలు నంబర్ 12025- పూణే – సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ రైలు
⦿ రైలు నంబర్ 12026- సికింద్రాబాద్ – పూణే ఎక్స్ ప్రెస్
Read Also: ఇక ఆ రైళ్లన్నీ చర్లపల్లి నుంచే, సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం, కారణం ఏంటంటే?
చర్లపల్లి టెర్మినల్‌కు మళ్లించిన రైళ్లు
⦿ రైలు నంబర్ 12745- సికింద్రాబాద్ – మణుగూరు ఎక్స్ ప్రెస్
⦿ రైలు నంబర్ 12746- మణుగూరు – సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్
⦿ రైలు నంబర్ 17645- సికింద్రాబాద్ – రేపల్లె ఎక్స్ ప్రెస్
⦿ రైలు నంబర్ 17646 రేపల్లె – సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్
⦿ రైలు నంబర్ 12514- సిల్చార్ – సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్
⦿ రైలు నంబర్ 12513 సికింద్రాబాద్ – సిల్చార్ ఎక్స్ ప్రెస్(చర్లపల్లి – సిల్చార్ ఎక్స్‌ప్రెస్ గా పేరు మార్పు)
⦿ రైలు నంబర్ 17007- సికింద్రాబాద్ – దర్భంగా ఎక్స్ ప్రెస్(చర్లపల్లి – దర్భంగా ఎక్స్ ప్రెస్ గా పేరు మార్పు)
⦿ రైలు నంబర్ 17008- దర్భంగా – సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్
⦿ రైలు నంబర్ 12735- సికింద్రాబాద్ – యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్
⦿ రైలు నంబర్ 12736- యశ్వంత్‌పూర్ – సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్
Read Also: వేసవి సెలవుల వేళ రైల్వే గుడ్ న్యూస్, చర్లపల్లి నుంచి 26 ప్రత్యేక రైళ్లు!
Read Also: రైల్‌లో ప్రయాణికుడు ఎంత లగేజ్ తీసుకెళొచ్చు? అంతకు మించితే ఏం చేస్తారు?