BigTV English
Advertisement

School Assignment on God| ‘భగవంతుడున్నాడా? మతానికి కట్టుబడి ఉన్నారా?’.. పిల్లలకు స్కూల్ అడ్మిషన్ కోసం అడిగిన ప్రశ్నలు!

School Assignment on God| ‘భగవంతుడున్నాడా? మతానికి కట్టుబడి ఉన్నారా?’.. పిల్లలకు స్కూల్ అడ్మిషన్ కోసం అడిగిన ప్రశ్నలు!

School Assignment on God| ఒక స్కూల్ లో తమ చిన్న పాప అడ్మిషన్ కోసం వెళితే.. అక్కడ ఆ పాపకు ఒక అసైన్ మెంట్ ఇచ్చారు. అందులో కొన్ని ప్రశ్నలున్నాయి. ఆ ప్రశ్నలకు 24 గంటల్లోగా సమాధానం రాసి తీసుకురావాలని చెప్పారు. అయితే ఆ అసైన్ మెంట్ లో ప్రశ్నలు చూసి ఆ పాప తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఇలాంటి ప్రశ్నలు స్కూల్ పిల్లలకు అసైన్ మెంట్ ఇస్తారా? అని ఆ పాపా తల్లి అనుమానం వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడామె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.


వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఓక్లహోమా రాష్ట్రంలో స్కోటుక్ పబ్లిక్ స్కూల్ లో తమ పాప నేటీని చేర్పించేందుకు వెళ్లిన దంపతులకు ఆ స్కూల్ యజమాన్యం షాకిచ్చింది. పాప చేత ఒక అసైన్ మెంట్ చేయించాలని. అది పూర్తి చేస్తే.. పాపను చేర్చుకోవాలో లేదో నిర్ణయిస్తామని తెలిపారు. ఆ అసైన్ మెంట్ ప్రపంచ చరిత్ర గురించి ఉంటుందని అన్నారు. అయితే ఆ అసైన్ మెంట్ లో కొన్ని ప్రశ్నలున్నాయి. వాటికి ఆ పాప సమాధానం రాయాలి. ఆ ప్రశ్నలను చూసి నేటి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు.

అసైన్‌మెంట్ లో అడిగిన ప్రశ్నల్లో ఉన్న కొన్ని ప్రశ్నలు.. ”నిజంగానే దేవుడున్నాడా? ”, ”ప్రపంచంలో సైతాన్ (చెడు చేసే భూతం) ఉందని నమ్ముతున్నారా? ”, ”మీరు క్రిస్టియానిటి మతాన్ని నమ్ముతున్నారా? ”, ”మతానికి కట్టుబడి ఉన్నారా?”. ఈ ప్రశ్నలకు 24 గంటల్లోగా నేటి సమాధానం రాసి అసైన్ మెంట్ పూర్తిచేయాలి. అయితే ఈ అసైన్ మెంట్ ప్రశ్నలు చదివిన నేటీ తల్లి ఒలివియా ఆగ్రహం చెంది. పిల్లలకు స్కూల్ లో ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా? అని మండిపడింది. ”ఒక స్కూల్ లో ఇంతగి కష్టమైన అసైన్ మెంట్ ఇవ్వడం ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదేమో?”.. అని క్యాప్షన్ పెట్టి ఆ అసైన్ మెంట్ పేపర్ ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.


Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..

ఈ అసైన్ మెంట్ పేపర్ ని చూసిన నెటిజెన్లంతా స్కూల్ యజమాన్యంపై మండిపడుతున్నారు. స్కూల్ లో ఉపాధ్యాయులకు పిచ్చి పట్టిందా? ఇలాంటి ప్రశ్నలు స్కూల్ లో ఎలా అడుగుతారు అని కామెంట్లు చేస్తున్నారు. జేనా అనే ఒక ఫేస్ బుక్ యూజర్ కామెంట్ చేస్తూ.. ”నాకు ఈ అసైన్ మెంట్ తయారు చేసిన టీచర్ కు అసలు విద్యను బోధించే అర్హత ఉందా? కాలేజీ లెవెల్ కూడా ఇలాంటి ప్రశ్నలు అడగరు” అని రాసింది. లీసా అనే మరొక యూజర్ అయితే..” పాపకు అడ్మిషన్ ఇవ్వాలన్నా.. పాప టాలెంట్ చూడాలన్నా ఇలాంటి ప్రశ్నలేనా అడిగేది?” అని కామెంట్ చేసింది.

యూజర్లో ఒక టీచర్ కూడా ఉన్నారు. అయన తన పోస్ట్ లో, ”నేను కూడా ఒకట టీచర్ నే ఇలాంటి ప్రశ్నలు స్కూల్ పిల్లలకు అడగడం ఏ మాత్రం సరికాదు.” అని రాశాడు. ఫేస్ బుక్ లో ఒలివీయా పెట్టిన పోస్టుకు దాదాపు 700 కామెంట్స్ వచ్చాయి. 500 మంది ఈ పోస్ట్ ను షేర్ చేశారు.

అయితే స్కూల్ లో పిల్లల మానసిక పెరుగుదల కోసం టీచర్లు అసైన్ మెంట్లు ఇస్తుంటారు. విభిన్న అంశాలపై అసెన్ మెంట్ల ద్వారా పిల్లల్లో ఆలోచనా ధోరణి, క్రియేటివిటీ మెరుగుపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: లారీ డ్రైవర్ నెల ఆదాయం రూ.10 లక్షలు.. ఎలా సంపాదిస్తున్నాడో తెలుసా?

Related News

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

AMB Cinemas: ఏఎంబీ సినిమాస్‌లో స్నానం చేయడానికి షవర్ కూడా ఉందని మీకు తెలుసా? ఔనండీ, నిజం!

Cleanliness Drive: రోడ్డుపై చెత్త వేసేవారి ఫొటో తీస్తే.. రూ.250 మీవే, ఎక్కడంటే?

Big Stories

×