BigTV English

Jenny Nguyen: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..

Jenny Nguyen: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..

Jenny Nguyen| లక్ష రూపాయల నెల జీతం సంపాదించడానికి బిటెక్ లు, ఎం టెక్ లు చదవాలి.. లేదా చిన్న సాలరీతో మొదలుపెట్టి సంవత్సరాల తరబడి జీతం పెరగడానికి ఎదురు చూడాలి. కానీ ఓ యువతి ఏ డిగ్రీ లేకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లకు పైగా సంపాదిస్తోంది. ఆమె పేరే జెన్ని గుయెన్. వయసు 29 సంవత్సరాలు.


జెన్ని గుయెన్ ఇంత పెద్ద మొత్తం సంపాదించడానికి ముందు జీవితంలో చాలా కష్టపడింది. కానీ ఆ కష్టాలేవి ఆమెకు అడ్డుపడలేదు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఆమెకు వచ్చిన ఒకే ఒక్క ఆలోచన జెన్ని జీవితాన్ని మార్చేసింది. 2018 వరకు ఆమె అమెరికాలోని హోఫ్స్‌త్రా యూనివర్సిటీ డిగ్రీ చదవేవారు. కానీ ఫీజు కట్టడానికి డబ్బులు లేక ఆమె చదువుని మధ్యలోనే ఆపేసింది. ఆర్థిక కష్టాల కారణంగా ఆమె తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడేవారు. వారికి మొత్తం నలుగురు సంతానం. నలుగురిలో జెన్నీ అందరికంటే పెద్దది కావడంతో ఆమె తల్లిదండ్రులకు సాయపడాలనుకుంది.

అందుకే చదువు మధ్యలోనే ఆపేసి 2019లో లాస్ ఏంజిల్స్ కు ఉద్యోగం కోసం వెళ్లింది. అక్కడ ఓ స్కూల్ లో చిన్న పిల్లలకు సబ్సిటిట్యూట్ టీచర్ గా పనిచేసేది. కానీ ఆ ఉద్యోగంలో కూడా తక్కువ జీతం ఉండడంతో జెన్ని అసంతృప్తిగా ఉండేది. అయితే ఆ ఉద్యోగం వదిలేస్తే.. మరి ఆ తరువాత ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు. అలా క్రమంగా 2020లో కరోనా లాక్ డౌన్ వచ్చింది. ఇంటి వద్దనే ఉంటూ జెన్నీ ఆన్ లైన్ లో వీడియాలు చూసేది. ముఖ్యంగా ఆమెకు నెయిల్ ఆర్ట్ అంటే చాలా ఇష్టం.


Also Read: ‘ఉద్యోగం కావాలంటే బాస్ తో సమయం గడపాలి’.. మహిళకు కండిషన్ పెట్టిన మేనేజర్

అందుకే ఇన్స్‌టాగ్రామ్ లో చాలా మంది నెయిల్ ఆర్టిస్టులను ఫాలో అయ్యేది. ఒకరి వద్ద ఉద్యోగం చేయడానికి ఇష్టపడని జెన్నీ అప్పుడే స్వతహాగా పనిచేయాలని నిర్ణయించుకుంది. వెంటనే నెయిల్ ఆర్ట్‌ కోసం ప్రత్యేక సర్వీస్ స్టార్ట్ చేయాలని భావించి ఆన్ లైన్ లో మానికూర్ ట్రైనింగ్ తీసుకొని లైసెన్స్ సంపాదించింది. ఆ తరువాత ఆన్ లైన్ తాను నెయిల్ ఆర్ట్‌ సర్వీస్ ఇస్తానంటూ యాడ్స్ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఆమె యాడ్స్ మంచి స్పందన వచ్చింది. చాలామంది ఆమె డిజైన్స్ చూసి మెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆమె డిజైన్స్ కావాలని సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఫోన్లు చేసేవారు. దీంతో జెన్నీ బిజీగా మారింది. ఎంత బిజీ అంటే ఏకంగా సెలబ్రిటీలు కూడా ఆమె కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి.

కేవలం 2022 సంవత్సరంలో జెన్నీ వార్షిక ఆదాయం 6 లక్షల డాలర్లకు మించిపోయింది. అంటే భారత కరెన్సీలో 5 కోట్లకు పైమాటే. ఆమె నెయిల్ ఆర్ట్ కోసం ప్రత్యేకంగా ‘జెన్ పెయింట్ నెయిల్ లౌంటజ్’ పేరుతో ఓ సెలూన్ ఓపెన్ చేసింది. ప్రస్తుతం ఆమె సెలూన్ కు ఒక వారానికి 300 కస్టమర్లు వస్తున్నారట. ”నెయిల్ ఆర్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. నా నెయిల్ ఆర్ట్ సర్వీస్ తో కస్టమర్లు హ్యాపీ.. నేను వారిచ్చే డబ్బులతో చాలా హ్యాపీ”, అని జెన్నీ తన బిజినెస్ గురించి సంతోషంగా చెప్పింది.

Also Read: ‘కలియుగం.. ఆడవాళ్లు ఇలా కూడా చేస్తున్నారు’.. పాకిస్తాన్ లో డివోర్స్ పార్టీపై ట్రోలింగ్

 

Related News

India-China: సుంకాల యుద్ధం.. చైనాతో భారత్ సయోధ్యకు ప్రయత్నం

Kim Jong Un: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. నమ్మండి ఇది నిజం

Donald Trump: మళ్లీ షాకిస్తున్న ట్రంప్.. ఇక అమెరికా గ్రీన్ కార్డు పొందడం కష్టమే..

Terroist Masood Azhar: మసూద్ టార్గెట్ రూ.120 కోట్లు.. గ్లోబల్ టెర్రరిస్ట్‌కి విరాళాలు ఇస్తుంది ఎవరంటే..?

New York Bus Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Earthquake: సౌత్ అమెరికాను కుదిపేసిన భారీ భూకంపం.. 7.5గా నమోదు

Big Stories

×