BigTV English

Viral Video : వధువు కండలకు అంతా హడల్ – పెళ్లి కొడుకు జాగ్రత్త భయ్యా అంటూ కామెంట్లు

Viral Video : వధువు కండలకు అంతా హడల్ – పెళ్లి కొడుకు జాగ్రత్త భయ్యా అంటూ కామెంట్లు

Viral Video : మృదువైన శరీరం, వయ్యారాల నడక, సుకుమారమైన చేతులు.. ఎవరైన పెళ్లి చేసుకునే అమ్మాయి గురించి చెప్పమంటే వినిపించే మాటలు. కానీ.. ఈ అమ్మాయిని ఓసారి చూశారంటే కలలో కూడా అలాంటి మాటలు మాట్లాడరు. కండరు తిరిగిన చేతులు, బలమైన శరీరం.. ఆమెను చూస్తే మామూలు మగవాళ్లు అయితే హడలిపోతే పర్సనాలిటీ. ఇంతకీ ఎవరా అమ్మాయి అంటారా.. కర్ణాటకకు చెందిన చిత్రా పురుషోత్తమ్. పెళ్లి కూతురుగా అందగా ముస్తాబై, చీర కట్టులో తన కండల్ని చూపిస్తూ.. బాడీ బిల్డింగ్ పోటీల్లో ఇచ్చేలా ఫోజులు ఇస్తుంటే పెళ్లి ఫోటోలు తీశారు. ఎందుకంటే..ఆవిడ బాడీ బిల్డర్, ట్రైనర్ మరి. ఆమె ప్రొఫెషన్ కు తగ్గట్టుగానే.. పెళ్లి ఫోటోలు తీశారు. ఇప్పుడు అవే.. ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఎవర్రా ఈ అమ్మాయి అంటూ.. ఆడపిల్లలు సైతం నోరెళ్లబెడుతుంటే, యువకులు.. ఆమె సోషల్ మీడియా అకౌంట్ల కోసం వెతికేస్తున్నారు.


ఇటీవల ఈమె వెడ్డింగ్ వేడుకగా నిర్వహించారు. ఇందుకు కోసం ఓవైప సంప్రదాయ పద్దతిలో, మరోవైపు తన శారీరక శక్తిని ప్రదర్శించేలా తీసుకున్న ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. ఇవి కాస్తా సూపర్ వైరల్ గా మారాయి. తన బాడీ బిల్డింగ్ సామర్థ్యం తెలిసేలా.. ఎల్లో, బ్లూ కలర్ కాంబినేషన్ లోని కంజీవరం శారీని కట్టుకుంది. నడముకు వడ్డాణం, మెడలో బంగారు నగలు ధరించింది. సంప్రదాయానికి తగ్గట్టుగా పెద్ద తిలకం, చెవులకు రింగులు, చేతులకు బంగారు గాజులు ధరించింది. కానీ.. తన ప్రొఫెషన్ ను తెలిపేలా.. చిత్రా పురుషోత్తం బ్లౌజ్ లేకుండానే ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆమె కండ బలం, భుజ బలం తెలిపేలా ఫోటోలు దిగారు.

ఈ పోస్టును ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేస్తూనే.. బ్లౌజ్ లేకుండా దిగిన ఫోటోలకు నెగిటివ్ కామెంట్లు చేసే వారికి ముందే హెచ్చరించినట్లుగా ఓ క్యాప్షన్ ఇచ్చారు. ఆలోచనా విధానమే అన్నీని నిర్ణయిస్తుంది అని అర్థం వచ్చేలా.. పోస్టు చేశారు. ఈ వీడియోకు సోషల్ మీడియాలో అనూహ్య స్పందన దక్కింది. ఈ వీడియోను ఏకంగా.. 70 లక్షల మంది వీక్షించారు. కాగా.. ఈమె అకౌంట్ కు 1 లక్షా 38 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.


బాడీ ఫిట్ నెస్ పై మహిళలకు అవగాహన కల్పిస్తున్న చిత్రా పురుషోత్తమ్.. అనేక పోటీల్లో పాల్గొని బహుమతులు సైతం గెలుచుకున్నారు. మిస్ ఇండియా ఫిట్ నెస్, వెల్ నెస్, మిస్ సౌత్ ఇండియా, మిస్ కర్ణాటక వంటి పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నరు.

ఇక ఈ పెళ్లి ఫోటోలపై యూత్ ఆశ్చర్యంతో కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఆమె ఫ్రొఫెషన్ లో సాధించిన విజయానికి ఆమె శరీరమే ఉదాహరణ అంటూ పొగుడుతుంటే, మరికొందరు ఆమెకు ఆల్ థి బెస్ట్ చెబుతున్నారు. ఇక మరికొందరైతే.. పెళ్లి కొడుకుకు జాగ్రత్తలు చెబుతూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఈమెను చేసుకునే వాడిని చూడాలి భయ్యా అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా, చెప్పిన పని చేయకపోతే అంతే సంగతులు అంటూ పెళ్లి కొడుకును ఊహించుకుని మరో యూజర్ కామెడీ పండించారు. ఇక మరో కామెంట్లో అయితే ఇంట్లో పని విషయంలో మాట వినడం మన మంచికే అంటూ ఫన్ జనరేట్ చేస్తున్నారు. మరి మీరు.. ఓ పాజిటివ్ కామెంట్ విసరాలి అనుకుంటున్నారా.. అయితే చిత్రా పురుషోత్తమ్ ఇన్ స్టాగ్రామ్ ని చూసేయండి.

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×