BigTV English

Ambati Rambabu: ఆ పాత్ర చంద్రబాబుకి ఇవ్వాలి.. సాంస్కృతిక కార్యక్రమాలపై అంబటి కౌంటర్లు

Ambati Rambabu: ఆ పాత్ర చంద్రబాబుకి ఇవ్వాలి.. సాంస్కృతిక కార్యక్రమాలపై అంబటి కౌంటర్లు

ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమం ఎంతో సందడిగా సాగింది. అయితే ఈ కార్యక్రమాలను వైసీపీ నేతలు బాయ్ కాట్ చేశారు. ఇక సహజంగానే కూటమి నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైసీపీని టార్గెట్ చేస్తూ కొన్ని స్కిట్స్ ఉన్నాయి. ఆ స్కిట్స్ ప్రదర్శించే సమయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పడిపడి నవ్వుకున్నారు. ఆ నవ్వుల వీడియోలు సోషల్ మీడియాలో హైలైట్ అయ్యాయి. దీంతో వైసీపీకి బాగానే కోపం వచ్చింది. అయితే దాన్ని వ్యక్తం చేయడానికి ఎవరూ లేకపోవడం విశేషం. కాస్త ఆలస్యంగా అయినా మాజీ మంత్రి అంబటి రాంబాబు తెరపైకి వచ్చారు. వారిది శునకానందం అంటూ సెటైర్లు పేల్చారు.


కాస్త గ్యాప్ తర్వాత మీడియా ముందుకొచ్చిన అంబటి రాంబాబు.. అసెంబ్లీ సమావేశాలపైన, ఇటీవల వైఎస్ఆర్ పేరుని తొలగిస్తూ ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపైన కూడా సుదీర్ఘంగా మాట్లాడారు. వైఎస్ఆర్ తనకి మంచి మిత్రుడని చెప్పుకునే చంద్రబాబు జిల్లా పేరుని మార్చేస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. వైఎస్ఆర్ పేరు వింటే చంద్రబాబుకి ఎందుకంత కోపం అని ప్రశ్నించారు.

ఎమ్మెల్యేల స్కిట్స్ పై కూడా అంబటి రాంబాబు కౌంటర్లు వేశారు. దుర్యోధనుడి పాత్రకు రఘురామకృష్ణం రాజు సరిగ్గా సరిపోయారని, బాలచంద్రుడు పాత్ర వేసిన దుర్గేష్ కూడా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారనన్నారు. అయితే అక్కడ ఒకటే లోటు అని, చంద్రబాబు శకుని పాత్ర వేసి ఉంటే బ్రహ్మాండంగా ఉండేదని సెటైర్లు పేల్చారు. భారతంలో శకుని పాత్ర అద్భుతంగా ఉంటుందని, దానికి చంద్రబాబు సరిగ్గా సరిపోతారన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా జగన్ ప్రస్తావన ఎందుకన్నారు. వైసీపీకి 11 సీట్లు వచ్చాయంటూ స్కిట్ లో చెప్పగానే చంద్రబాబు, పవన్ కల్యాణ్ పగలబడి నవ్వుకున్నారని, అంత కక్ష ఎందుకన్నారు. గతంలో కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలు, స్పోర్ట్స్ మీట్ లు జరిగాయని, అప్పుడు హుందాగా సాగేవని, కానీ ఇప్పుడు కేవలం ప్రతిపక్షాలపై సెటైర్లు వేసి నవ్వుకోడానికి పరిమితమయ్యాయని అన్నారు.


ఇక బడ్జెట్ సమావేశాలపై కూడా అంబటి రాంబాబు మండిపడ్డారు. 16రోజులపాటు ప్రతిపక్షం లేకుండా ఈ సమావేశాలు చప్పగా సాగాయన్నారు. టీవీల్లో కూడా ఎవరూ ఈ సమావేశాలు చూడలేదని, ఆ ఆసక్తి ఎవరికీ లేకుండా పోయిందన్నారు. కూటమి నేతలు ఒకర్నొకరు పొగుడుకోడానికే ఈ సమావేశాలు సరిపోయాయన్నారు అంబటి. డబ్బాలు కొట్టుకునే కార్యక్రమంతోనే శాసన సభ సమావేశాలు పూర్తయ్యాయని అన్నారు అంబటి. మండలిలో ప్రతిపక్షం ప్రశ్నలు సంధిస్తే ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయిందన్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను మండలిలో తమ సభ్యులు ఎండగట్టారన్నారు అంబటి.

సహజంగా ఎవరైనా అసెంబ్లీ సమావేశాలను ఆసక్తికరంగా చూస్తారని, కానీ ఇప్పుడు మండలి సమావేశాలే హైలైట్ అయ్యాయని చెప్పారు అంబటి రాంబాబు. వైసీపీ హయాంలో జరిగిన అప్పుల విషయంలో తప్పుడు లెక్కలు చెప్పారన్నారు. గవర్నర్ ప్రసంగంలో ఒకలా, ఆ తర్వాత అసెంబ్లీలో మంత్రులు మరోలా చెప్పడం హాస్యాస్పదం అన్నారు. ప్రజలు ఇవన్నీ చూస్తున్నారని చెప్పారు అంబటి. ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందన్నారాయన. ఇటీవల వినుకొండలో ప్రభుత్వంపై సునిశిత విమర్శలు చేసిన ఓ రైతుపై కేసు పెట్టారని, వెంటనే వైసీపీ న్యాయవిభాగం ఆయనకు అండగా నిలిచిందని చెప్పుకొచ్చారు అంబటి.

వైసీపీ ఎమ్మెల్యేల దొంగచాటు సంతకాలు అనే ఆరోపణపై కూడా అంబటి స్పందించారు. దొంగ సంతకాలు అనే స్పీకర్.. తమకి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో తామెప్పుడూ వెనకాడటంలేదని అన్నారు అంబటి రాంబాబు. శాసన సభకు వెళ్లకపోయినా తాము ప్రజల వెంటే ఉంటామన్నారు. శాసన సభను కూటమి నేతలు కక్షసాధింపులకు వేదికగా మార్చారన్నారు. అసెంబ్లీకి వెళ్లకపోయినా తాము ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు అంబటి.

Related News

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

Big Stories

×