BigTV English

Strange Rituals: పౌర్ణమి ముందు రోజు ఊరంతా ఖాళీ.. తల్లి శవంతో నృత్యం చేసే కొడుకులు!

Strange Rituals: పౌర్ణమి ముందు రోజు ఊరంతా ఖాళీ.. తల్లి శవంతో నృత్యం చేసే కొడుకులు!

BIG TV LIVE Originals: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. అద్భుతమైన ప్రకృతి అందాలు మొదలుకొని ప్రముఖ పుణ్యక్షేత్రాల వరకు ఆకట్టుకుంటాయి. అంతేకాదు, ఆంధ్రాలోని పలు గ్రామాలు, సంస్కృతులలో కొన్ని వింత ఆచారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇవి సాంప్రదాయం, నమ్మకాలు, చారిత్రక నేపథ్యంతో ముడిపడి ఉన్నాయి. వీటిలో కొన్ని వినడానికే షాకింగ్ అనిపిస్తాయి. అలాంటి కొన్ని వింత ఆచారాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


⦿ పౌర్ణమికి ముందు రోజు ఊరంతా వలస
అనంతపురం జిల్లాలోని తలారి చెరువు గ్రామంలో మాఘమాసం పౌర్ణమికి ముందు రోజు గ్రామస్తులు ఊరు వదిలి సమీప దర్గాకు వెళతారు. ఊరిలో లైట్లు వేయరు. ఎలాంటి అగ్గి వెలిగించరు. ఊరు పూర్తిగా చీకట్లో ఉండిపోతుంది. పౌర్ణమి రోజు దర్గాలో గడిపి మరుసటి రోజు తిరిగి వస్తారు. ఈ ఆచారం వెనుక శాస్త్రీయ కారణాలు స్పష్టంగా లేవు. కానీ, పురాతన నమ్మకంగా కొనసాగుతోంది.

⦿ విజయదశమి రోజు సీతారామ కళ్యాణం
దేశమంతా విజయదశమి రోజు దుర్గాదేవి పూజలు, రావణ సంహారం జరుపుకుంటుంటే.. తూర్పు గోదావరి జిల్లా పేరూరు గ్రామంలో సీతారాముల కళ్యాణం జరుపుతారు. పూర్వీకులు వలస వెళ్లినప్పుడు ఈ సంప్రదాయం ప్రారంభమై, ఇప్పటికీ కొనసాగుతోంది.


⦿ గర్భిణీలకు ముడి వేయడం
విశాఖ జిల్లా కొన్ని గ్రామాల్లో గర్భిణీ స్త్రీలు ఐదో నెలలో సీమంతం చేస్తారు. ఈ సందర్భంగా చేతికి పసుపు రంగు దారం (ముడి వేయడం) కట్టడం ఆచారంగా వస్తోంది. ఈ దారం తల్లి, బిడ్డను దుష్టశక్తుల నుండి కాపాడుతుందని నమ్ముతారు. ఈ దారాన్ని సదరు మహిళ డెలివరీ అయ్యే వరకు తీయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు పెద్దలు.

⦿ పాము పుట్టలో చేయి పెట్టడం

ఈ ఆచారం నిజంగా భయం కలిగిస్తుంది. గుంటూరు జిల్లా కొన్ని గ్రామాల్లో ఈ ఆచారాన్నిపాటించేవారు. నాగపంచమి సందర్భంగా యువకులు పాము పుట్టలో చేయి పెట్టి, దానిని బయటకు తీసే ఆచారం ఉండేది. యువకులలో ధైర్య సాహసాలను గుర్తించేందుకు ఈ ఆచారాన్ని పాటించే వారు. కానీ, కొన్నిసార్లు పాముకాటుకు గురై యువకులు చనిపోవడంతో నిలిపివేశారు. ఇప్పటికీ కొన్ని చోట్ల ఈ ఆచారాం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

⦿ తల్లి శవంతో బిడ్డల నృత్యం
కర్నూలు జిల్లాలో ఈ అరుదైన వింత ఆచారం ఉంది. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లోతల్లి చనిపోతే ఆమె శవంతో బిడ్డలు నృత్యం చేస్తారు. ఇలా చేయడం వల్ల తల్లి ఆత్మకు శాంతి కలుగుతుందని సదరు కొడకులు, బిడ్డలు భావిస్తారు. అంతేకాదు, తమ తల్లితో ఇలా డ్యాన్స్ చేసి చివరి సారిగా తమ మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకునేవారు. ఈ ఆచారం ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తుంది.

ఏపీలోని ఈ ఆచారాలు వివిధ ప్రాంతాల సాంస్కృతిక వైవిధ్యాన్ని, నమ్మకాలను ప్రతిబింబిస్తాయి. కొన్ని ఆచారాలు ఇప్పటికీ కొనసాగుతుండగా, మరికొన్ని ఆధునికత, చట్టపరమైన ఆంక్షల కారణంగా తగ్గుముఖం పట్టాయి.

హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.

Read Also: ప్రీ మాన్ సూన్ వెకేషన్ ప్లాన్ చేస్తున్నారా? ఈ ప్లేసెస్ అస్సలు మిస్ కాకండి!

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×