BigTV English

Yuvraj Singh – GT : నెహ్రా అదిరిపోయే ప్లాన్.. ప్లే ఆఫ్స్ కోసం ఆ రాక్షసుడిని దింపుతున్నాడు

Yuvraj Singh – GT : నెహ్రా అదిరిపోయే ప్లాన్.. ప్లే ఆఫ్స్ కోసం ఆ రాక్షసుడిని దింపుతున్నాడు

Yuvraj Singh – GT :  ఐపీఎల్ 2025లో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్లే ఆప్స్ కి స్థానాలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. అయితే ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్  మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధిస్తే.. టాప్ 2లోకి వెళ్తుంది. లేదంటే.. టాప్ 1 పంజాబ్, టాప్ 2 గుజరాత్ టైటాన్స్, టాప్ 3 బెంగళూరు, టాప్ 4 ముంబై ఇండియన్స్ జట్లు నిలవనున్నాయి. ఇదిలా ఉంటే.. గుజరాత్ జట్టు ప్రారంభం నుంచి ఫస్ట్ ప్లేస్ లో కొనసాగి.. చివరి రెండు మ్యాచ్ ల్లో ఓటమి పాలు కావడంతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 2వ స్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడు గుజరాత్ స్థానం అనేది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై ఆధారపడి ఉంది.


Also Read :  Rohit – Shreyas: ఇదేం ర్యాగింగ్ రా.. శ్రేయస్ ను ఒక ఆట ఆడుకున్న రోహిత్

ఇదిలా ఉంటే.. మరో కీలక విషయం ఏంటంటే..? గుజరాత్ జట్టు కి ప్లే ఆప్స్ మ్యాచ్ ల కోసం  ఆశిష్ నెహ్రా పెద్ద ప్లాన్ వేశాడట. యువరాజ్ సింగ్ ను కోచ్ గా తీసుకువస్తున్నారట. కేవలం  ప్లే ఆప్స్ మ్యాచ్ ల కోసమే యువరాజ్ ని కోచ్ గా పెట్టుకుంటుంది గుజరాత్ టీమ్.  యువరాజ్ సింగ్ గతంలో బెంగళూరు, ముంబై, పంజాబ్ జట్టుల తరపున ఆడాడు. ఆ జట్టు ఆటగాళ్లు, ఆ జట్టు వాతావరణ పరిస్థితులు అన్ని యువరాజ్ సింగ్ కి తెలుసు కాబట్టి.. అతన్ని కోచ్ గా తీసుకుంటే గుజరాత్ టైటాన్స్ టైటిల్ కొట్టవచ్చని భావిస్తోంది. ప్రస్తుతం గుజరాత్ జట్టు 18 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే ప్లే ఆప్స్ కి వెళ్లిన జట్లకు ప్లే ఆప్స్ కి చేరుకోని జట్లు షాక్ ఇచ్చాయి.  ఇటీవల లీగ్ దశలో గుజరాత్ పై  లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించగా..   ఆర్సీబీ పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఊహించని విధంగా విజయం సాధించి షాక్ ఇచ్చింది. దీంతో టాప్ లోకి వెళ్లాలంటే లక్నో పై ఆర్సీబీ కచ్చితంగా విజయం సాధించాల్సిన పరిస్తితి నెలకొంది.


ముఖ్యంగా ప్రారంభం నుంచి గుజరాత్ టాప్ లో కొనసాగింది. కానీ లీగ్ దశలో తన చివరి రెండు మ్యాచ్ లు మాత్రం విజయం సాధించలేకపోయింది. అందులో లక్నో సూపర్ జెయింట్స్ పై జరిగిన మ్యాచ్ లో మార్ష్ విజృంభించి సెంచరీ సాధించడంతో గుజరాత్ ఆ మ్యాచ్ లో విజయం సాధించలేకపోయింది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మెన్స్ సైతం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా ఆయుష్, బ్రెవిస్ రెచ్చిపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 230 పరుగులు చేసింది. ఆ మ్యాచ్ లో 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఛేదించలేకపోయింది. దీంతో ఆ జట్టుకి ఎదురుదెబ్బ తగిలింది. ఇక ప్లే ఆప్స్ కి యువరాజ్ కోచ్ గా వస్తే.. మాత్రం ఆ జట్టు టైటిల్ సాధిస్తుందో లేదో వేచి చూడాలి మరీ.

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×