BigTV English
Advertisement

Manchu Vishnu: నాకెందుకు ఈ పరీక్ష స్వామీ… హార్డ్ డిస్క్ ను భలే వాడేస్తున్నావు సామి!

Manchu Vishnu: నాకెందుకు ఈ పరీక్ష స్వామీ… హార్డ్ డిస్క్ ను భలే వాడేస్తున్నావు సామి!

Manchu Vishnu: మంచు విష్ణు(Manchu Vishnu) కన్నప్ప(Kannappa) సినిమా ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సినిమా మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మంచు విష్ణు వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇక ఈ సినిమా పై మంచి బజ్ క్రియేట్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఒక హార్డ్ డిస్క్(Hard Disk) మిస్సయిందనే వార్త వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది..


ఇప్పటివరకు ఏ సినిమా విషయంలో కూడా ఇలా జరగలేదు కేవలం మంచు విష్ణు సినిమా విషయంలో మాత్రమే హార్డ్ డిస్క్ మాయం కావడంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే మంచు విష్ణు మనోజ్ మధ్య గొడవలు ఉన్న నేపథ్యంలో ఈ హార్డ్ డిస్క్ మాయం అవ్వటం వెనుక మనోజ్ హస్తం ఉందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చిత్ర బృందానికి సంబంధించిన వారి సహాయంతోనే ఈ హార్డ్ డిస్క్ మాయం చేసి ఉంటారనే వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇలా ఈ సినిమా గురించి ఇంతటి వివాదం జరుగుతున్న నేపథ్యంలో మంచు విష్ణు ఎక్కడా కూడా ఈ ఘటన గురించి అధికారికంగా మాట్లాడలేదు.

ఎందుకు స్వామి ఈ పరీక్ష?

ఇకపోతే తాజాగా మంచు విష్ణు X వేదికగా కన్నప్ప సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ షేర్ చేశారు. ఇందులో భాగంగా జటాజూఠదారి, నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ అంటూ ఉన్నటువంటి ఒక పోస్ట్ షేర్ చేశారు. అయితే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కన్నప్ప సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా ఏదో ఒక విధంగా వార్తలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. కన్నప్ప సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూనే వచ్చారు. ఇలా ఈ సినిమాపై ఎంత నెగెటివిటీని రుద్దిన మంచు విష్ణు వాటన్నింటిని తట్టుకొని సినిమాని ముందుకు నడిపిస్తూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ఈ విధమైనటువంటి పోస్ట్ చేశారని స్పష్టమవుతుంది.


ప్లానింగ్ లో భాగమేనా?

మంచు విష్ణు ఈ పోస్ట్ షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ పోస్టుపై నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మీలాంటి మంచి వాళ్లకే ఇలాంటి కష్టాలు వస్తాయి అన్నా అంటూ కొందరు కామెంట్లు చేయగా, మరికొందరు మాత్రం.. హార్డ్ డిస్క్ ను భలే వాడేస్తున్నావు స్వామి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి హార్డ్ డిస్క్ మాయం అవ్వడం కూడా మంచు విష్ణు ప్లానింగ్ లో భాగమే అంటూ ఈ పోస్ట్ పట్ల నెటిజన్స్ వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. హార్డ్ డిస్క్ మాయమైందనే వార్తలు బయటకు రావడంతో కన్నప్ప సినిమా ఉదయం నుంచి ట్రెండ్ అవుతూనే ఉంది.

https://x.com/iVishnuManchu/status/1927309859831058546?t=MJCcTswQl_eZlg4BBgw24g&s=19

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×