Pre Monsoon Vacation Places: వర్షాలు ప్రారంభం కావడానికి ముందు చాలా మంది ప్రీ మాన్ సూన్ వీకెండ్స్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. చల్లని వాతావరణంలో ఆహ్లాదంగా గడిపేందుకు ఇష్టపడుతారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి హ్యాపీగా, జాలీగా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ ట్రెక్కింగ్ చేయాలనుకున్నా, కొండలలో ప్రశాంతంగా గడపాలనుకున్నా, ఉత్కంఠభరితమైన దృశ్యాల నడుమ వేడి వేడి ఛాయ్ తాగుతూ ఆహ్లాదంగా గడపాలన్నా, ముంబై సమీపంలో బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. వాటిలో కొన్ని అద్భుతమైన ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ముంబై సమీపంలో ప్రీ మాన్ సూన్ వీకెండ్ వెకేషన్ ప్లేసెస్
⦿ ఇగత్పురి (Igatpuri): ఇది ముంబైకి 120 కి.మీ దూరంలో ఉంటుంది. సహ్యాద్రి పర్వతాల్లో ఉన్న ఈ హిల్ స్టేషన్ ప్రీ-మాన్సూన్ లో చల్లగా, పచ్చగా మారుతుంది. విపస్సనా మెడిటేషన్ సెంటర్ ను సందర్శించవచ్చు. మహారాష్ట్రలోనే అత్యంత ఎత్తైన శిఖరం కల్సుబాయి ట్రెక్ ఇక్కడే ఉంటుంది. ట్రెక్కింగ్ చేసుకోవచ్చు. భాట్సా రివర్ వ్యాలీలో విశ్రాంతి తీసుకోవచ్చు. ముంబై నుంచి 2.5 గంటల్లో అక్కడికి చేరుకోవచ్చు.
⦿ కర్ణాల (Karnala): ఇది ముంబైకి 60 కి.మీ దూరంలో ఉంటుంది. ఈ ప్రదేశం తక్కువ దూరంలో ఉండి, ప్రీ-మాన్సూన్ లో ట్రెక్కింగ్ కు అనుకూలంగా ఉంటుంది. వెస్టర్న్ ఘాట్స్ దృశ్యాలు అద్భుతంగా ఆకట్టుకుంటాయి. కర్ణాల ఫోర్ట్ ట్రెక్, కర్ణాల బర్డ్ స్యాంక్చురీ సందర్శనకు వెళ్లొచ్చు. ముంబై నుంచి 1.5 గంటల్లో వెళ్లొచ్చు.
⦿ అలీబాగ్ (Alibaug): ముంబై నుంచి 95 కి.మీ దూరంలో ఉంటుంది. 1.5 గంటల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ బీచ్ టౌన్ ప్రీ-మాన్సూన్ లో చల్లని గాలులతో ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్సోలి బీచ్‌లో సూర్యాస్తమయం, కోలాబా ఫోర్ట్ సందర్శించి, సీఫుడ్ రుచి చూడొచ్చు.
⦿ తమ్హిని ఘాట్ (Tamhini Ghat): ముంబై నుంచి సుమారు 120 కిలో మీటర్ల దూరం ఉంటుంది. 2 నుంచి 3 గంటల ప్రయాణ సమయం పడుతుంది. ప్రీ-మాన్సూన్ లో చిన్న చిన్న జలపాతాలు, అడవులతో ఈ రోడ్ ట్రిప్ అద్భుతంగా ఉంటుంది. ఆహ్లాదకరమైన డ్రైవ్, ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచ్చు.
⦿ మల్షేజ్ ఘాట్ (Malshej Ghat): ముంబై నుంచి 130 కి.మీ దూరం ఉంటుంది. ప్రీ-మాన్సూన్ లో ఈ హిల్ స్టేషన్ లో ఆకుపచ్చని కొండలు, చిన్న జలపాతాలు, మేఘాలు అద్భుతంగా కనిపిస్తాయి. ట్రెక్కింగ్, క్యాంపింగ్, క్వైల్స్, ఫ్లెమింగో లాంటి పక్షులను చూస్తూ ఎంజాయ్ చెయ్యొచ్చు. ప్రయాణ సమయం 3 గంటలు ఉంటుంది.
⦿ లోనావల (Lonavala): ముంబైకి 83 కి.మీ దూరంలో ఉంటుంది. 2 గంటల్లో చేరుకోవచ్చు. ప్రీ-మాన్సూన్ లో ఈ హిల్ స్టేషన్ చల్లని వాతావరణం, పచ్చని దృశ్యాలతో ఆకట్టుకుంటుంది. భుషి డ్యామ్ వద్ద విశ్రాంతి, టైగర్ పాయింట్ దృశ్యాలు, కర్లా గుహలను చూడవచ్చు.
⦿ మాథేరాన్ (Matheran): ముంబై నుంచి 80 కి.మీ దూరంలో ఉంటుంది. ఇక్కడికి వాహనాలను నిషేధించారు. ఈ హిల్ స్టేషన్ ప్రీ-మాన్సూన్ లో ప్రశాంతంగా, పచ్చగా ఉంటుంది. షార్లెట్ లేక్ దగ్గర పిక్నిక్, లూయిసా పాయింట్ నుంచి అద్భుత దృశ్యాలు చూడవచ్చు. హార్స్ రైడింగ్ చేయవచ్చు.
Read Also: ఆహా అనిపించే అందమైన మడా అడవులు, మన దగ్గర కూడా ఉన్నాయండోయ్!