Pune Pub Condom ORS New Year Party| న్యూ ఇయర్ వేడుకలనగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 రాత్రి అందరూ వేడుకలు జరుపుకుంటారు. ఈ క్రమంలో నగరాల్లో నివసించే ఆర్థికంగా సంపన్న కుటుంబాలకు చెందిన యువతీయువకులు పబ్ లలో పార్టీలు జరుపుకుంటుంటారు. వారికోసం పబ్ యజమాన్యం కూడా మంచి వెసులుబాట్లు కలిపిస్తూ ఉంటాయి. అక్కడ ముఖ్యంగా మద్యం పార్టీలు నడుస్తూ ఉంటాయి. ఈ కోవలో కొత్తగా ప్రారంభమైన ఓ పబ్ కస్టమర్లను ఆకర్షించడానికి విన్నూత్న కానుకలు ప్రకటించింది. కస్టమర్లకు తమ పబ్ లో న్యూ ఇయర్ వేడుకలకు ఆహ్వానం పంపించింది. అయితే ఆ ఆహ్వానంలో కండోమ్‌లు, ఒఆర్ఎస్ ప్యాకెట్లతో పాట ఇతరత్రా కానుకలు కూడా ఉన్నాయి. దీంతో ఆ పబ్ పంపింన ఆహ్వానం గురించి తెలుసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని పుణె నగరంలో ‘హై స్పిరిట్స్ కెఫె’ అనే పబ్ ఉంది. ఆ పబ్ తన కస్టమర్స్ కోసం మూడు రోజుల క్రితం ఒక ఆహ్వానం పంపింది. అందులో ఒక గిఫ్ట్ ప్యాక్ కూడా ఉంది. ఆ గిఫ్ట్ ప్యాక్ లోపల ఒక కండోమ్, రెండు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఒక డ్రైవర్ ఫోన్ నెంబర్ కలిగిన కార్డ్ కూడా ఉంది. డిసెంబర్ 31, 2024 రాత్రి న్యూ ఇయర్ వేడుకలకు అది ఆహ్వాన కానుక.
‘హై స్పిరిట్స్ కెఫె’ తమ రెగులర్ కస్టమర్లకు మాత్రమే ఆ కానుకలు పంపింది. ఆ కస్టమర్లలో ఒకరు ఆ కానుకల ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. అవి చూసిన మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ లీడర్ అక్షయ్ జైన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. న్యూ ఇయర్ పార్టీలలో మద్యంతో పాటు, వ్యభిచారాన్ని ప్రోత్సహించేందుకు ఆ పబ్ కానుకలు ఉచితంగా పంచుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
దీంతో పుణె నగరంలోని ముంధ్వా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. ఆ స్టేషన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ నీల్ కంఠ్ జగ్తాప్ .. హై స్పిరిట్స్ కెఫె యజమాన్యానికి నోటీసుల జారీ చేశారు. ఆ తరువాత విచరణ కూడా. దీనిపై కెఫె మెనేజర్ జాయెద్ ఖాన్ స్పందించారు.
ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “ఆ కానుకలు.. మా రెగులర్ కస్టమర్లకు మాత్రమే పంపించాం. పార్టీలలో మద్యం సేవించిన తరువాత వారి ఆరోగ్య రీత్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాం. యువతీయువకులు న్యూ ఇయర్ పార్టీలలో హద్దులు దాటి శారీరక సుఖం చూసుటారు. వారు అనివార్య పరిణామాలు చవిచూడాల్సి వస్తుంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా కండోమ్ ప్యాకెట్లు పంపించాం. వాటితో పాటు న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం సేవించి కారు డ్రైవింగ్ చేస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులవుతాయి. మద్యం సేవించి కారు నడిపితే ప్రమాదం అందుకే ఈ ప్రమాదాలు నివారించడానికి.. కస్టమర్లు పార్టీ ముగిసిన తరువాత మద్యం మత్తులో కారు నడిపి ప్రమాదాలకు కారణం కాకూడదని వారి కోసం ప్రత్యేకంగా క్యాబ్ లు ఏర్పాటు చేశాం. ఆ డ్రైవర్ల ఫోన్ నెంబర్లు కూడా కార్డ్ లో ప్రింట్ చేసి ఇచ్చాం. కానీ ఇప్పుడు పోలీసుల వద్ద ఫిర్యాదు చేయడంతో ఈ అంశం వివాదాస్పదమైంది” అని అన్నారు.