BigTV English

Swiggy Delivery Income: స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ తక్కువ కాదు బాస్.. నెలకు ఎంత సంపాదనో తెలుసా?..

Swiggy Delivery Income: స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ తక్కువ కాదు బాస్.. నెలకు ఎంత సంపాదనో తెలుసా?..

Swiggy Delivery Income| జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరి యాప్స్ ఈ రోజుల్ల ప్రతి ఒక్కరి ఫోన్లలో కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం.. ఇంట్లో కూర్చొని ఫోన్ లో ఆర్డర్ చేస్తే చాలు మీకు ఇష్టమైన హోటల్ భోజనం నేరుగా మీ ఇంటి ప్లేటు వరకు చేరుతోంది. అయితే ఈ ప్రక్రియలో కీలక పాత్ర ఫుడ్ డెలివరి బాయ్స్ ది. డెలివరి బాయ్స్ రోజంతా నగరంలోని మూల మూలకు వెళ్లి ప్రజలకు ఇష్టమైన రెస్టారెంట్ నుంచి వంటకాలను వారి ఇళ్ల వరకు చేరుస్తున్నారు. అయితే వీరు ఇంత కష్టపడుతున్నారు కదా? వీరి సంపాదన ఎంతో మీకు తెలుసా?


కొన్ని రోజుల క్రితం ఫుల్ డిస్‌క్లోజూర్ Full Disclosure అనే యూట్యూబ్ చానెల్ లో జొమాటో, స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్స్ పై ఒక ప్రోగ్రామ్ చేశారు. ఈ ప్రొగ్రామ్ లో డెలివరి బాయ్స్ పడే కష్టాలతో పాటు వారి సంపాదన గురించి కూడా ప్రస్తావన వచ్చింది. అయితే డెలివరీ బాయ్ ఒక్క రోజుకు ఎంత సంపాదిస్తున్నాడు, అతనికి వారానికి నెలకు ఎంత సంపాదన వస్తోందని లెక్కులు వేస్తే.. ప్రొగ్రామ్ లో పక్కన నిలుచున్న వారు విని షాకై పోయారు.

Also Read:  16 ఏళ్ల అబ్బాయితో టీచర్ వివాహేతర సంబంధం.. విద్యార్థి తండ్రి తెలుసుకొని ఏం చేశాడంటే?..


ఆ డెలివరి బాయ్స్ ఒక రోజుకు ఈజీగా రూ.1500 నుంచి రూ.2000 వరకు సంపాదిస్తున్నారని వెల్లడించారు. వారానికి ఒక రోజు సెలవు తీసుకున్నా కనీసం రూ.12000 లేదా రూ.10000 వస్తుందని తెలిపారు. ఈ లెక్కన నెలకు కనీసం రూ.45000 నుంచి రూ.50000 వరకు సంపాదన వస్తుందని తెలుస్తోంది. వారిలో ఒక డెలివరి బాయ్ అయితే తాను నెలకు రూ.70000 నుంచి రూ.80000 వరకు సంపాదిస్తున్నానని చెప్పాడు. అయితే అందుకోసం సెలవు తీసుకోకుండా చాలా కష్టపడాల్సి వస్తుందని వివరించాడు.

అయితే ఈ వివరాలన్నీ వారు చెప్పడమే కాదు.. తమ ఫోన్ లో అకౌంట్ బ్యాలెన్స్ కూడా ఆధారంగా చూపించారు. పైగా చాలా మంది కస్టమర్లు టిప్స్ ఇస్తుంటారని.. అవి కూడా నెలకు రూ.5000 వరకు ఉంటాయని చెప్పారు. కొన్నిసార్లు అయితే వర్షాల్లో కూడా డెలివరీ చేయాల్సి వస్తుందని అప్పుడు కొంచెం ఎక్కువ చార్జ్ చేస్తామని అన్నారు. జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరి ప్లాట్‌ఫామ్స్ లో ఒక ఆర్డర్ పై ఎంత కమిషన్ వస్తుందో ముందే ఫిక్స్ అయి ఉంటుంది. కానీ ఎక్కువ దూరం వెళ్లి డెలివరి చేయాల్సి వచ్చినప్పుడు దానికి అదనంగా చార్జ్ చేస్తారు.

Also Read: ఫారిన్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. పెళ్లికి ముందు యువతిని ఎలా మోసం చేశాడంటే..

ఈ స్విగ్గీ డెలివరి బాయ్స్ గురించి యూట్యాబ్ లో ఇంటర్ వ్యూ చూసి చాలామంది నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. అందులో ఒక యూజర్ అయితే ”డెలివరి బాయ్స్ ఇంత సంపాదిస్తున్నారని అస్సలు తెలియదు. ఇప్పుడు నాకు కూడా ఒక బైక్ కొనాలనిపిస్తోంది” అని రాశాడు.

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×