BigTV English

Ramajogayya Sastry: దేవర నుంచి పాన్ ఇండియా రేంజ్ లో ఓ బ్లాస్టర్ అప్ డేట్ రాబోతోంది అంటూ ఊరిస్తున్న రామజోగయ్య శాస్త్రి

Ramajogayya Sastry: దేవర నుంచి పాన్ ఇండియా రేంజ్ లో ఓ బ్లాస్టర్ అప్ డేట్ రాబోతోంది అంటూ ఊరిస్తున్న రామజోగయ్య శాస్త్రి

lyricist Ramajogayya Sastry gave update about 4th song in Devara: దేవర మూవీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ మూవీపై కొంత నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవుతూ వచ్చింది. పైగా ఈ మూవీకి బ్యాడ్ సెంటిమెంట్స్ కూడా తగిలించి మరీ ట్రోల్ చేస్తున్నారు కొందరు ట్రోలర్స్. పైగా మరో ఆంధ్రావాలా అంటూ పోలిక తెస్తున్నారు. ఇవన్నీ పట్టించుకోని నిర్మాతలు మాత్రం ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నారు. సెప్టెంబర్ 27న అత్యధిక థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది దేవర. ఇప్పటికే ఓవర్సీస్ లో ఈ మూవీ టిక్కెట్లు హాట్ కేకుల్లా రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. బుకింగ్స్ ఓపెన్ చేసిన ఐదు నిమిషాలలోనే అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించాయి.


రికార్డు వ్యూస్

దేవర ట్రైలర్ కూడా రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది. కొంతమంది ట్రైలర్ పై పెదవి విరిచినా ఓవరాల్ గా ట్రైలర్ కూడా దూసుకుపోతోంది మిలియన్ వ్యూస్ తో. రెండు పార్టులుగా ఈ మూవీని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ప్రస్తుతం సీక్వెల్ చిత్రాల జోరు కొనసాగుతోంది. దేవర మూవీ రెండో పార్ట్ పై జనంలో ఆసక్తిని ఎలా రేకిత్తిస్తారో చూడాలి. బాహుబలి నుంచి రెండు భాగాలుగా సినిమా విడుదల చేయడం జరుగుతోంది. నిర్మాతలకు కూడా తొలి భాగంపై వచ్చిన హైప్ ను రెండో భాగంలో కొనసాగిస్తే ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెరగిపోయి..మంచి బిజినెస్ వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు. బయ్యర్లు కూడా ఇలాంటి సినిమాలకే మొగ్గు చూపుతున్నారు. దేవర ప్రమోషన్లు కూడా ఊపందుకున్నాయి.


ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొరటాల

కొరటాల శివ కు కూడా ఈ దేవర మూవీ హిట్ ప్రతిష్టాత్మకం కానుంది. ఆచార్య మూవీ ఫ్లాప్ తో కొరటాల శివ డైలమాలో పడ్డారు. అందుకే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నారు కొరటాల. భారతీయుడు 2 మూవీ ఫ్లాప్ తో సంగీత దర్శకుడు అనిరుధ్ కూడా తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారు. దేవర మూవీకి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించాలని అనుకుంటున్నారు అనిరుధ్. దేవర మూవీ అనిరుధ్ కు కూడా దేవర మూవీ ప్రతిష్టాత్మకమే. ఇంతమంది కలిసి ఈ సినిమాను ఎలాగైనా హిట్ చేయాలని కసిగా పనిచేశారు. సినిమాకు మంచి ఔట్ పుట్ వచ్చినట్లు సమాచారం. పైగా ఈ సినిమాను ఒక రోజు ముందే లాస్ ఏంజిల్స్ లో జరిగే ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారని అప్ డేట్ ఇచ్చారు. సినిమా ఫలితం ఒక రోజు ముందే తెలిసిపోతుంది.

నాలుగో పాట గురించేనా?

ఈ మూవీ గురించి లిరికిస్ట్ రామజోగయ్య శాస్త్రి సరికొత్తగా ఓ అప్ డేట్ ఇచ్చారు. వచ్చే వారంలో పాన్ ఇండియా లెవెల్ లో ఓ పెద్ద బాంబు పేలనుంది. ఆయుధ పూజ ట్రాక్ రాబోతోందంటూ ట్వీట్ చేశారు. అది తప్పకుండా దేవర మూవీ నాలుగో పాట గురించే అని అభిమానులంతా భావిస్తున్నారు. జోగయ్య శాస్త్రి ఇచ్చిన అప్ డేట్ మంచి జోష్ ని ఇచ్చిందని అభిమానులు దేవర మూవీ గురించి ముందుగానే పండుగ చేసుకుంటున్నారు. ఈ మధ్య ముందుగా వచ్చిన పాటల కన్నా చివరలో వచ్చిన పాటలే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నాయి. గుంటూరు కారం మూవీ నుంచి కుర్చీ మడతపెట్టే సాంగ్ ని ఇచ్చిన తర్వాత ఒక్క సారిగా గుంటూరు కారం మూవీ బిజినెస్ రేంజ్ కూడా మారిపోయింది. విపరీతమైన హైప్ తీసుకొచ్చింది. ఇప్పుడు రాబోతున్న నాలుగో పాట గురించి రామజోగయ్య శాస్త్రి ఇచ్చిన అప్ డేట్ ను బట్టి సినిమా హిట్ ను అభిమానులు అంచనా వేసుకుంటున్నారు.

 

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×