BigTV English

Snake Viral Video: ఓ మై గాడ్.. రోడ్డుకు అడ్డంగా ఎంత పెద్ద పామో..!

Snake Viral Video: ఓ మై గాడ్.. రోడ్డుకు అడ్డంగా ఎంత పెద్ద పామో..!

Snake Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ పాములకు సంబంధించిన వీడియోలు కనిపిస్తూనే ఉంటాయి. చాలా సార్లు ఇలాంటి వీడియోలు బయటకు రావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కొన్ని పాములకు సంబంధించిన వీడియోలు చలా భయానకంగా ఉంటాయి. వాటిని చూసిన తర్వాత ఎవరైనా తమ కళ్లను నమ్మడం కష్టమనే చెప్పాలి. అయితే ఇప్పుటు ఇటువంటి వీడియోనే నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. దాన్ని చూసిన తర్వాత మీకు గూస్‌బంప్స్ వస్తాయి. ఒక పెద్ద పాము కనిపించే వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న వీడియోలో రోడ్లపై వాహనాల రాకపోకలు సాగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇంత పెద్ద పాము రోడ్డుపైకి వస్తుందంటే రోడ్డుపై వెళ్లే వారు దాన్ని చూసి ఆశ్చర్యానికి గురవుతారు. భారీ కొండచిలువ రోడ్డుపైకి రావడం వీడియోలో కనిపిస్తోంది. పాము చాలా పెద్దది కాబట్టి రోడ్డు మొత్తం ఆక్రమిస్తుంది. పాము రోడ్డు దాటుతోంది.

వీడియో చూసినట్లయితే పాము రోడ్డు దాటేటప్పుడు వాహనాలన్నీ ఆగిపోతాయి. అక్కడున్న పామును వీడియోలు తీస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. ఈ వీడియోకు సంబంధించి అది బ్రెజిల్‌కు చెందినదని క్లెయిమ్ చేస్తున్నారు. అయితే పాము దాదాపు 15 అడుగుల పొడవు ఉంటుంది. రోడ్డు దాటుతున్న క్రమంలో దానికి మధ్యలో ఓ డివైడర్ అడ్డొస్తుంది. కానీ దాన్ని పాము సులభంగా దాటేస్తుంది.

భారీ పామును చూసేందుకు వాహన దారులు దాని చుట్టూ గుమిగూడారు. అందరూ కూడా అది రోడ్డు దాటుతున్న దృశ్యాలను ఫోన్‌లలో షూట్ చేస్తున్నారు. చివరగా ఆ భారీ పాము పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లిపోతుంది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో Nature is Amazing అనే అకౌంట్ నుంచి అప్‌లోడ్ అయింది. welcome to brazil అనే కొటేషన్ ఇచ్చారు.

Also Read: వీడెవడ్రా బాబు.. పాముకు స్నానం చేయిస్తున్నాడు!

వీడియోపై ప్రజల రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. బ్రెజిల్‌లో ఇది సర్వసాధారణమని ఒక వినియోగదారుడు రాశారు. బ్రెజిల్ పాముల నగరం అని మరొరకు అన్నారు. బ్రెజిల్, ఆస్ట్రేలియాలో ఇది సాధారణం అయితే ఇక్కడ ప్రతిరోజూ చాలా పాములు కనిపిస్తాయని కామెంట్ చేశారు. ఓ యూజర్, ఓహ్ మై గాడ్, ఇంత పెద్ద పాము, అక్కడ ప్రజలు కూడా భయపడరని రాశారు. ఈ వీడియోపై పలువురు యూజర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Tags

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×