BigTV English

Rohit Sharma: ధోనీ రికార్డ్ బ్రేక్.. సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ

Rohit Sharma: ధోనీ రికార్డ్ బ్రేక్.. సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ

Rohit Sharma: టీ 20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్ తో జరిగిన తొలిమ్యాచ్‌లో టీమ్ ఇండియా విజయం సాధించడం ఒక ఎత్తు అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ సాధించిన రికార్డులు మరో ఎత్తుగా నిలిచాయి. ఒకటి కాదు వరుసగా నాలుగు రికార్డులు బ్రేక్ చేసుకుంటూ వెళ్లాడు. ముఖ్యంగా టీ 20 ప్రపంచకప్‌లో వెయ్యి పరుగులు, టీ 20 అంతర్జాతీయ క్రికెట్‌లో 4వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. పనిలో పనిగా 600 సిక్సర్లు కొట్టిన జాబితాలోకి చేరుకున్నాడు.


ఇప్పుడు వీటన్నింటిని మించి కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ రికార్డ్‌ని అధిగమించాడు. టీమిండియాకి 9 ఏళ్ల పాటు టీ 20, వన్డే కెప్టెన్‌గా చేసిన ధోనీ 72 టీ 20 మ్యాచ్‌లు ఆడి 42 అత్యధిక విజయాలు అందించాడు. ఇప్పటివరకు తనే నంబర్ వన్‌గా ఉన్నాడు.

అయితే రోహిత్ శర్మ 55 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా ఉండి, 43 విజయాలు అందించి ధోనీని దాటి వెళ్లాడు. అత్యధిక టీ 20 విజయాలు అందించిన భారత కెప్టెన్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమ్ ఇండియా 50 మ్యాచ్‌లు ఆడింది. అందులో 32 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.


వీటన్నింటికి మించి టీమ్ ఇండియా అత్యధిక విజయాలు సాధించిన జట్టులో రోహిత్ శర్మ భాగస్వామిగా ఉన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ ఆడిన 295 మ్యాచ్‌ల్లో టీమ్ ఇండియా విజయం సాధించింది. రోహిత్ శర్మకు ఇది 300వ విజయం. అయితే విరాట్ కోహ్లీ మాత్రం 315 విజయాల్లో భాగం పంచుకున్నాడు. వీరందరి ముందూ ఉన్నాడు. అయితే మన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అయితే 307 మ్యాచ్‌లు గెలవడంలో తను భాగస్వామిగా ఉన్నాడు.

ఐర్లాండ్‌తో జరిగిన ఒకే ఒక్క మ్యాచ్‌తో రోహిత్ శర్మ ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. ఎన్నో రికార్డులను తిరగరాశాడు. మరి తన భుజం నొప్పి తగ్గి, పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడటమే కాదు.. హిట్ మ్యాన్ సారథ్యంలో టీమ్ ఇండియా మరిన్ని విజయాలు సాధించాలని, టీ 20 వరల్డ్ కప్ కూడా సాధించాలని కోరుకుందాం.

Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×