BigTV English

Taj Mahal Viral Video: తాజ్ మహల్‌లో గంగాజలం సమర్పించిన వీడియో వైరల్.. ఇద్దరు అరెస్ట్

Taj Mahal Viral Video: తాజ్ మహల్‌లో గంగాజలం సమర్పించిన వీడియో వైరల్.. ఇద్దరు అరెస్ట్

Taj Mahal Viral Video: ప్రపంచంలోని ఏడు వింతల్లో తాజ్ మహల్ ఒకటి. ఎంతో అద్భుతంగా కట్టిన ఈ కట్టడం ప్రపంచంలో ప్రతీ ఒక్కరిని ఆకర్షిస్తుంది. ముంతాజ్ ప్రేమకు గుర్తుగా షాజాహాన్ ఈ తాజ్ మహాల్ నిర్మించాడనే విషయం తెలిసిందే. అయితే తాజ్ మహాల్ ను చూసేందుకు కేవలం దేశీయులే కాదు విదేశాల నుంచి కూడా లక్షల మంది పర్యాటకులు తరచూ వచ్చి వీక్షిస్తుంటారు. ఎంతో అద్భుతంగా పాలరాతితో కట్టిన ఈ కట్టడం చరిత్రలో ఓ గుర్తుగా నిలిచిపోయింది. అయితే దీనికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


తాజ్ మహల్ లోపల ఓ వ్యక్తి గంగా జలాన్ని పోయడంతో ఆగ్రాలో కలకలం రేగింది. శ్రావణ మాసం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో తాజ్ మహల్‌పై గంగాజలాన్ని పోసినందుకు ఒక రైట్‌వింగ్ సంస్థకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. తాజ్ మహల్‌ను ‘తేజోమహాలయ’, శివాలయంగా భావించి ప్లాస్టిక్ బాటిళ్లలో పవిత్ర గంగాజలాన్ని సమర్పించినట్లు అరెస్టయిన వ్యక్తులు అన్నారని పోలీసులు తెలిపారు.

షాజహాన్, ముంతాజ్ సమాధులపై గంగా జలం


తాజ్‌మహల్ కాంప్లెక్స్‌లో అఖిల భారత హిందూ మహా సభతో సంబంధం కలిగి ఉన్నారని చెప్పుకునే ఇద్దరిని అరెస్టు చేసినట్లు తాజ్‌గంజ్ పోలీసులు పేర్కొన్నారు. షాజహాన్ మరియు ముంతాజ్ సమాధులు ఉన్న చోట నిందితుడు ప్లాస్టిక్ బాటిల్ నుండి నీటిని పోసిన వీడియో క్లిప్ ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తాజ్ మహల్ ఒక స్మారక చిహ్నం కాదని, శివాలయం అని, ఓం అనే స్టిక్కర్‌పై పవిత్ర జలం పోశారని నిందితులు వాదించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఇది వరకు కూడా ఇలాంటి ఎన్నో పరిస్థితులు వెలుగుచూశాయి. తాజ్ మహల్ పేరును మార్చడానికి అనేక హిందూ సంస్థలు ప్రయత్నాలు చేశాయి. కొన్నిసార్లు ప్రార్థనలతో హారతి, పూజలు నిర్వహించే ప్రయత్నాలు కూడా జరిగాయి. ఈ విషయమై స్థానిక కోర్టులో కేసు కూడా నడుస్తోంది.

 

 

 

Related News

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Viral Video: మూడో అంతస్తు మీద నుంచి పడిపోయాడు.. ఆ తర్వాత మీరు నమ్మలేనిది జరిగింది!

Viral Video: హాలీవుడ్ మూవీని తలపించేలా కారు ప్రమాదం.. వెంట్రుకవాసిలో బయటపడ్డాడు, వైరల్ వీడియో

Big Stories

×